అన్వేషించండి

Kiara Advani: గూగుల్ సెర్చ్‌లో కియారా నెంబర్ వన్, ఆమె భర్త మాత్రం!

Kiara Advani: బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ అరుదైన గుర్తింపు దక్కించుకుంది. ఈ ఏడాది గూగుల్ లో అత్యధికంగా సెర్చ్ చేసిన సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకుంది.

Kiara Advani: 2023 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. మరికొద్ది రోజుల్లోనే నూతన సంవత్సరం లోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ ఏడాదిలోని కీలక ఘటనలను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు నెటిజన్లు. ఈ నేపథ్యంలో గూగుల్  సరికొత్త నివేదికను వెల్లడించింది. ఈ ఏడాది అత్యధికంగా నెటిజన్లు సెర్చ్ చేసిన సెలబ్రిటీలు ఎవరు అనే అంశాన్ని వెల్లడించింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ టాప్ ప్లేస్ లో నిలిచింది.

గూగుల్ సెర్చ్ లిస్టులో కియారా టాప్

బాలీవుడ్ లో పలువురు సీనియర్ స్టార్ హీరోయిన్లు ఉన్నారు. వరుస సినిమాలతో మాంచి క్రేజ్ లో కొనసాగుతున్నారు.  దీపికా పదుకొణె,  ప్రియాంక చోప్రా, ఆలియా భట్‌, ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్‌ లాంటి బ్యూటీలను కాదని, కియారా గురించి ఎక్కువ తెలుసుకునే ప్రయత్నం చేశారట నెటిజన్లు. ఈ ఏడాది కియారా తన ప్రియుడిని పెళ్లి చేసుకోవడంతో నెటిజన్లు ఫోకస్ ఆమె మీదకు వెళ్లినట్లు గూగుల్ తెలిపింది. ముఖ్యంగా ఆమె పెళ్లి ఫోటోల గురించి ఎక్కువగా ఆరా తీసినట్లు వెల్లడించింది. కియారా భర్త ఎవరు? అతడు ఏం చేస్తాడు? వీరిద్దరి ప్రేమ ఎలా మొదలయ్యింది? పెళ్లి ఎలా జరిగింది? అనే విషయాల గురించి నెటిజన్లు తెలుసుకునే ప్రయత్నం చేశారట. దీంతో ఆమె ఈ ఏడాది గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన సెలబ్రిటీలలో నెంబర్ 1గా చోటు దక్కించుకుంది.

గ్లోబల్ సెర్చ్‌లో 9వ స్థానం

కియారా అద్వానీ కేవలం ఇండియన్ గూగుల్ సెర్చ్ లో మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. గ్లోబర్ వైడ్ గూగుల్ సెర్చ్  టాప్ 10 సెలబ్రిటీల లిస్టులోనూ చోటు దక్కించుకుంది. ఈ లిస్టులో ఆమె 9వ ప్లేస్ పొందింది. అంతేకాదు, గ్లోబర్ సెర్చ్ లో ప్లేస్ దక్కించుకున్న ఒకే ఒక్క ఇండియన్ సెలబ్రిటీగా గుర్తింపు దక్కించుకుంది. మొత్తంగా ఈ ఏడాది గూగుల్ క్వీన్ గా కియారా అద్వానీ ఘనత సాధించింది.   

6వ స్థానంలో నిలిచిన సిద్దార్థ్ మల్హోత్రా

గూగుల్ సెర్చ్ లిస్టులో కియారా అద్వానీ ఫస్ట్ ప్లేస్ దక్కించుకోగా, ఆమె భర్త సిద్దార్థ్ మల్హోత్రా 6వ స్థానంలో నిలిచారు. కియారాతో పెళ్లి నేపథ్యంలో ఆయన గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది. సిద్దార్థ్ బాలీవుడ్ లో యంగ్ హీరోగా కొనసాగుతున్నారు. కియారా, సిద్దార్థ్ కలిసి 2021లో 'షేర్షా' అనే మూవీలో నటించారు. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పెళ్లి వరకు ఈ విషయాన్ని బయటకు రాకుండా ఉంచారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజస్థాన్ వేదికగా పెళ్లి చేసుకున్నారు. ఇన్ స్టాలో వీరి పెళ్లి ఫోటోలు అరుదైన గుర్తింపు దక్కించుకున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ లో ఎక్కువ లైక్స్ పొందిన వెడ్డింగ్ పిక్స్ గా రికార్డుకెక్కాయి.   

ఇక బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఎక్కువ సెర్చ్ చేసిన లిస్టులో టాప్ లో నిలువగా, టీమిండియా క్రికెటర్  శుభమన్ గిల్, న్యూజిలాండ్ క్రికెటర్ రచిన్ రవీంద్ర, ఇండియన్ క్రికెటర్ మహమ్మద్ షమీ, ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ తరువాత నాలుగు స్థానాల్లో నిలిచారు. ప్రస్తుతం కియారా తెలుగులో ‘గేమ్‌ ఛేంజర్’ సినిమాలో నటిస్తోంది. ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ‘వార్ 2’లోనూ హీరోయిన్ గా కనిపించనుంది.  

Read Also: 73వ వసంతంతోకి రజనీకాంత్, తలైవా గురించి 9 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం!

టాప్ హెడ్ లైన్స్

Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
Jabardasth Venky Reaction : సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమిట్మెంట్ ఆరోపణలు? - జబర్దస్త్ వెంకీ స్ట్రాంగ్ రియాక్షన్
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమిట్మెంట్ ఆరోపణలు? - జబర్దస్త్ వెంకీ స్ట్రాంగ్ రియాక్షన్
Nindu Manasulu Serial Today August 10th: నిండు మనసులు: కోలుకున్న సిద్ధూ..! విజయానంద్ అనుమానం గణ మీదే!
నిండు మనసులు: కోలుకున్న సిద్ధూ..! విజయానంద్ అనుమానం గణ మీదే!
Brahmamudi Serial Today August 10th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రేఖకు రాజు వార్నింగ్‌ - ఐషును ఆపేందుకు ప్రయత్నించిన స్వాతి  
‘బ్రహ్మముడి’ సీరియల్: రేఖకు రాజు వార్నింగ్‌ - ఐషును ఆపేందుకు ప్రయత్నించిన స్వాతి  

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Embed widget