By: ABP Desam | Updated at : 29 Jun 2022 06:28 PM (IST)
మీనా భర్త మృతిపై తప్పుడు ప్రచారం - నటి ఖుష్బూ ఫైర్
ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల సినీ ఇండస్ట్రీ విచారం వ్యక్తం చేస్తోంది. మీనా కుటుంబానికి సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సానుభూతి తెలుపుతున్నారు. కొందరు సెలబ్రిటీలు మీనా ఇంటికి చేరుకొని విద్యాసాగర్ కి నివాళులు అర్పిస్తున్నారు. శ్వాసకోస సంబంధిత వ్యాధితో విద్యాసాగర్ మరణించినట్లు డాక్టర్స్ చెబుతున్నారు. అయితే ఆయన మరణంపై విభిన్న కథనాలను ప్రచురిస్తున్నారు.
ఈ ఏడాది జనవరి నెలలో మీనా కుటుంబ సభ్యులు కరోనా బారిన పడి మెల్లగా కోలుకున్నారు. మీనా, ఆమె భర్త విద్యాసాగర్, కూతురు నైనికా కోవిడ్ నుంచి కోలుకున్నారు. అయితే విద్యాసాగర్ కి కోవిడ్ నెగెటివ్ వచ్చినా.. ఆయన ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. దీంతో డాక్టర్స్ లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని సూచించారు. డోనర్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో విద్యాసాగర్ ఆరోగ్యం క్షీణించి మరణించారని తెలుస్తోంది.
అయితే ఆయన మరణానికి పావురాలే కారణమంటూ మరో ప్రచారం జరుగుతోంది. మీనా ఇంటి సమీపంలో పావురాలు ఎక్కువగా ఉన్నాయని.. అవి విడిచిన వ్యర్ధాల నుంచి వచ్చిన గాలి పీల్చడంతో విద్యాసాగర్ ఆరోగ్యం దెబ్బతిని మరణించారని కథనాలను ప్రచురిస్తున్నారు. ఈ వార్తలపై నటి ఖుష్బూ స్పందించింది. విద్యాసాగర్ మృతి విషయంలో మీడియా బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. మీనా భర్తకు మూడు నెలల క్రితం కోవిడ్ వచ్చిందని.. కరోనా కారణంగా అతడి ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అయ్యాయని.. కోవిడ్ కారణంగానే విద్యాసాగర్ ని కోల్పోయామని తెలిపింది. ఈ విషయంలో తప్పుడు ప్రచారాలు చేయొద్దని.. ఎలాంటి భయాలను క్రియేట్ చేయొద్దని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.
Also Read : విడాకుల వార్తలపై స్పందించిన సింగర్స్ శ్రావణ భార్గవి, హేమచంద్ర
Also Read : మగబిడ్డకు జన్మనిచ్చిన 'దిల్' రాజు భార్య తేజస్విని వ్యాఘా రెడ్డి
I very humbly request the media to be little responsible. Meena's husband had covid 3 months back. Covid worsened his lung condition. Pls do not send out a wrong message & create any kind of fear or cause flutter by saying we lost Sagar to covid. Yes we need to cautious, but pls.
— KhushbuSundar (@khushsundar) June 29, 2022
Waking up to a terrible news.Heartbroken to learn actor Meena's husband, Sagar, is no more with us. He was battling lung ailment for long. Heart goes out to Meena n her young daughter. Life is cruel. At loss of words to express grief. Deepest condolences to the family. #RIP 🙏😭
— KhushbuSundar (@khushsundar) June 29, 2022
Amardeep vs Priayanka: ఫైనల్ అస్త్రా కోసం అమర్, ప్రియాంక మధ్య సీరియస్ ఫైట్ - చెయ్యి కొరికేసిన వంటలక్క
Guppedantha Manasu November 29th Episode: ఇంకేం కావాలి ఇది చాలదా - రిషిధార స్పెషల్ సెలబ్రేషన్స్, షాకిచ్చిన అనుపమ!
Prema Entha Madhuram November 29th: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: పోలీసుల ముందు అడ్డంగా దొరికిపోయిన జలంధర్ - అను ఫోటోని ఆర్యకి చూపించి కథలో ట్విస్ట్ ఇచ్చిన ఉష!
Bigg Boss 7 Telugu: అర్జున్‌పై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ శివాజీ రివర్స్ స్ట్రాటజీ - ‘బిగ్ బాస్’పై అలిగిన SPY
Jagadhatri November 29th Episode - 'జగద్ధాత్రి' సీరియల్: కీర్తికి గుడ్ న్యూస్ చెప్పిన ధాత్రి - కౌషికి మీద కోపంతో రగిలిపోతున్న నిషిక!
Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!
Jagan Case: కోడి కత్తి కేసులో జగన్ పిటిషన్‌కు విచారణ అర్హత లేదు- హైకోర్టులో ఎన్‌ఐఏ కౌంటర్
Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్
Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
/body>