Photo@Yash/Instagram
కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన 'కేజీఎఫ్' సినిమా సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశవ్యాప్తంగా ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. గోల్డ్ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ సినిమాకి కొనసాగింపుగా వచ్చిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' సెన్సేషన్ క్రియేట్ చేసింది. సౌత్, నార్త్ అని తేడా లేకుండా విడుదలైన ప్రతి భాషలో వసూళ్ళ వర్షాన్ని కురిపించింది. బాలీవుడ్‌లో ఈ చిత్రం సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది.
స్పెషల్ వీడియోతో చాప్టర్-3 హింట్
ఇక ఈ బ్లాక్ బస్టర్ సినిమా గత ఏడాది ఏప్రిల్ 14న విడుదల అయ్యింది. ఈ రోజుతో ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ స్పెషల్ వీడియో విడుదల చేసింది. ఈ సినిమా సాధించిన ఘన విజయాన్ని గుర్తు చేసింది. “అత్యంత శక్తిమంతుడైన వ్యక్తి నిలబెట్టిన అత్యంత శక్తివంతమైన వాగ్దానం ఈ చిత్రం. ‘KGF2’ మరపురాని పాత్రలు, యాక్షన్‌తో మనల్ని ఓ అద్భుత ప్రయాణంలోకి తీసుకెళ్లింది. ప్రపంచ వ్యాప్త సినిమా రికార్డులను బద్దలు కొట్టడంతో పాటు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ సంవత్సర కాలంలో ఎన్నో సరికొత్త రికార్డులు సృష్టించింది” అని రాసుకొచ్చింది. చివర్లో వాగ్దానం నిలనెబెట్టుకుంటున్నామంటూ ‘కేజీఎఫ్’ చాప్టర్-3 గురించి అనౌన్స్ చేశారు. ఈ వీడియో చూసి అభిమానులు ఇప్పుడు పండుగ చేసుకుంటున్నారు.
The most powerful promise kept by the most powerful man 💥
KGF 2 took us on an epic journey with unforgettable characters and action. A global celebration of cinema, breaking records, and winning hearts. Here's to another year of great storytelling! #KGFChapter2#Yash… pic.twitter.com/iykI7cLOZZ— Hombale Films (@hombalefilms) April 14, 2023
శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రావు రమేష్, ప్రకాష్ రాజ్, రవీనా టాండన్, సంజయ్ దత్ లు కీలక పాత్రలు పోషించారు. హొంబలే ఫిల్మ్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందించగా, రవి బస్రూర్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్రంలోని పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్ళాయి.
‘KGF2’ కథ ఏంటంటే?
‘కేజీఎఫ్’ సినిమాలో గరుడ ను చంపిన తర్వాత రాఖీ భాయ్ కేజీఎఫ్ ను తన ఆధీనంలోకి తీసుకుంటాడు. అయితే, రాఖీ నుంచి మళ్లీ కేజీఎఫ్ ను తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు గరుడ సోదరుడు అధీరా(సంజయ్ దత్) రంగంలోకి దిగుతాడు. రాఖీ బాయ్ అధీరాను ఎదుర్కోవడంతో పాటు రాజకీయంగానూ భారీ సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. భారత ప్రధాని రమీకా సేన్(రవీనా టండన్)తో పాటు అధీరాతో రాఖీ భాయ్ ఎలా పోరాడాడు? ఈ పోరాటంలో విజయం ఎవరిని వరించింది? అనేది సినిమా కథ.
ఆకట్టుకున్న రవీనా టాండన్, సంజయ్ దత్ నటన
ప్రధాన మంత్రి పాత్రలో రవీనా టాండన్ పవర్ ఫుల్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. సంజయ్ దత్.. అధీరా అనే విలన్ రోల్ లో కనిపించారు. ఆయన నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు. అతడి గెటప్, కాస్ట్యూమ్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఈ చిత్రంలో సంజయ్ దత్ ను ఓ రాక్షసుడిలా చూపించారు. కొన్ని సినిమాలు ఎప్పటికీ స్పెషల్ గా మిగిలిపోతాయని.. అలాంటి సినిమాల్లో 'కేజీఎఫ్2' ఒకటని సినిమా విడుదల తర్వాత దత్ వెల్లడించారు. ఈ సినిమా తన పొటెన్షియల్ ఏంటో తెలిసేలా చేసిందని.. చాలా ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చారు.
Read Also: ‘రుద్రుడు’ హిందీ రైట్స్ వివాదం - నిర్మాతలకు అనుకూలంగా హైకోర్ట్ తీర్పు
Mrunal Thakur: అలా జరగకపోతే నా పేరు మార్చుకుంటా - ‘హాయ్ నాన్న’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మృణాల్
Animal Movie: 'యానిమల్' బడ్జెట్, తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ - 'దిల్' రాజుకు ప్రాఫిట్ తెచ్చే సినిమాయేనా?
Rocky Aur Rani Ki Prem Kahaani: రణవీర్ సింగ్ ‘రీల్’ ఇంట్లో హత్య - ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’ రాంధావ ప్యారడైజ్‌లో దుర్ఘటన
TS Election Voting: ఉదయమే ఓటు వేసిన చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్ - క్యూ లైనులో స్టార్స్, మరి మీరు?
Naga Panchami November 30th Episode: 'నాగ పంచమి' సీరియల్: తల్లైతేనే ఇంట్లో ఉంటావ్ - పంచమిని హెచ్చరించిన మోక్ష, గెటప్ మార్చేసిన కరాళి!
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన, పోలింగ్ బూత్ బయటే - ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
Nagarjuna Sagar News: నాగార్జున సాగర్ టెన్షన్స్‌పై నేతలు ఏమీ మాట్లాడొద్దు - వికాస్ రాజ్ ఆదేశాలు
Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ డ్యాం వద్ద హైటెన్షన్, 500 మంది ఏపీ పోలీసుల మోహరింపు, సగం ప్రాజెక్టు స్వాధీనానికి యత్నం
Telangana Election Polling Updates: తెలంగాణలో ఓట్ల జాతర- 7 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద బార్లు
/body>