అన్వేషించండి

Rudhrudu Release: ‘రుద్రుడు’ హిందీ రైట్స్ వివాదం - నిర్మాతలకు అనుకూలంగా హైకోర్ట్ తీర్పు

లారెన్స్ హీరోగా నటించిన తాజాగా చిత్రం ‘రుద్రుడు’. ఈ మూవీ రిలీజ్ నిలిపివేయాలంటూ రేవంశు గ్లోబల్‌ వెంచర్స్‌ సంస్థ వేసిన పిటిషన్ ను, మద్రాసు హైకోర్టు కొట్టివేసింది.

ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్‌, ప్రియా భవానీ శంకర్‌ జంటగా నటించిన చిత్రం ‘రుద్రుడు’. కదిరేశన్ ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాను ఇవాళ(ఏప్రిల్ 14) విడుదల అయ్యింది. అయితే, ఈ చిత్ర విడుదలను నిలిపివేయాలంటూ, హిందీ డబ్బింగ్‌ రైట్స్ దక్కించుకున్న రేవంశు గ్లోబల్‌ వెంచర్స్‌ సంస్థ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేసింది. ‘రుద్రుడు’ చిత్ర నిర్మాత హిందీ రైట్స్ కు మరో రూ. 4 కోట్లు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారని పిటిషన్ లో వెల్లడించింది. అయితే, ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నెల 24 వరకు సినిమాను విడుదల చేయకూడదంటూ తాత్కాలిక స్టే విధించింది. ఈ నేపథ్యంలో ‘రుద్రుడు’ నిర్మాత హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం స్టేను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముందుగా అనుకున్నట్లుగానే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.    

ఆకట్టుకున్న ‘రుద్రుడు‘ ట్రైలర్

ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను బాగా అలరించింది.  పూర్తి స్థాయి మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఓవర్ ది బోర్డ్ యాక్షన్ సీన్లను ట్రైలర్‌లో చూడవచ్చు. తల్లిదండ్రులతో సంతోషంగా ఉంటూ, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఒక యువకుడి జీవితంలో జరిగిన అనుకోని సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ‘కాంచన’లో శరత్ కుమార్ ఆత్మకు సాయం చేసే పాత్రలో లారెన్స్ కనిపించాడు. ఇందులో వీరిద్దరూ ఎదురెదురుగా హీరో, విలన్ పాత్రలో కనిపించనున్నారు. హీరోయిన్ ప్రియా భవాని శంకర్ అందంగా కనిపిస్తుంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో విడుదల అయ్యింది. ఈ చిత్రంలో శరత్ కుమార్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ కీలక పాత్రల్లో  కనిపించనున్నారు.  జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

‘చంద్రముఖి2’లో నటిస్తున్న లారెన్స్

ఇక లారెన్స్ ప్రస్తుతం ‘చంద్రముఖి 2’లో నటిస్తున్నారు. ‘చంద్రముఖి 2’ చిత్రానికి పి. వాసు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘చంద్రముఖి’. ఆప్తమిత్ర అనే కన్నడ చిత్రానికి రీమేక్ గా, 2005 లో వచ్చింది. ఈ సినిమా అప్పట్లో  తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది.  దాదాపు 17 ఏళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి భయపెడుతూ నవ్వించడానికి 'చంద్రముఖి 2' రెడీ అవుతోంది. కాకపొతే ఈసారి కొత్త క్యాస్టింగ్ తో వస్తున్నారు. ఇందులో కంగనా రనౌత్ ఒక రాజ నర్తకిగా కనిపించనుంది. దీని కోసం ఆమె క్లాసికల్ డ్యాన్స్ లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుందని తెలుస్తోంది. 'చంద్రముఖి' సీక్వెల్ బాక్సాఫీసు వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.

Read Also: సల్మాన్‌తో డేటింగ్ రూమర్స్ పై పూజా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Posani Krishna Murali: పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
BRSLP : డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
New Immigration Bill: వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
Group 2 Results: తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

DMK Uncivilised Heated Argument in Parliament | నోరు జారిన ధర్మేంద్ర ప్రధాన్..ఒళ్లు దగ్గర పెట్టుకోమన్న స్టాలిన్ | ABP DesamChampions Trophy 2025 Winners Team India | కాలు కదపకుండా ఆడి ట్రోఫీ కొట్టేశామా | ABP DesamRohit Sharma Virat Kohli Kolatam | వైట్ కోటులతో రచ్చ చేసిన టీమిండియా హీరోలు | ABP DesamRohit Sharma Fitness Champions Trophy 2025 | ఫిట్ నెస్ లేకుండానే రెండు ఐసీసీ ట్రోఫీలు కొట్టేస్తాడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Posani Krishna Murali: పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
BRSLP : డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
New Immigration Bill: వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
Group 2 Results: తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
Pakistan Passenger Train Hijacked: పాకిస్తాన్‌లో ట్రైన్‌ హైజాక్ - బలూచిస్తాన్ రెబల్స్ వద్ద వందల మంది బందీలు 
పాకిస్తాన్‌లో ట్రైన్‌ హైజాక్ - బలూచిస్తాన్ రెబల్స్ వద్ద వందల మంది బందీలు 
Rajamouli: ప్రభాస్ 'కల్కి' సినిమాకు భిన్నంగా కాశీ చరిత్రను చూపేలా SSMB29 ప్లాన్ చేసిన రాజమౌళి!
ప్రభాస్ 'కల్కి' సినిమాకు భిన్నంగా కాశీ చరిత్రను చూపేలా SSMB29 ప్లాన్ చేసిన రాజమౌళి!
Robots Into SLBC Tunnel: రంగంలోకి దిగిన రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
రంగంలోకి దిగిన రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
Khammam Crime News: సర్వే, సోదాల పేరు చెప్పుకొని వచ్చేవాళ్లతో జాగ్రత్త- ఖమ్మంలో ఏం జరిగింది అంటే?
సర్వే, సోదాల పేరు చెప్పుకొని వచ్చేవాళ్లతో జాగ్రత్త- ఖమ్మంలో ఏం జరిగింది అంటే?
Embed widget