KGF 2: 'కేజీఎఫ్2' ఓటీటీ రిలీజ్ - ఫ్రీగా చూసే ఛాన్స్ లేదు!
'కేజీఎఫ్1' సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఇప్పుడు 'కేజీఎఫ్2' హక్కులు కూడా అమెజానే కొనుక్కున్నట్లు తెలుస్తోంది.
కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన 'కేజీఎఫ్' సినిమా సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశవ్యాప్తంగా ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. గోల్డ్ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ సినిమాకి కొనసాగింపుగా వచ్చిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది ఈ సినిమా.
ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కి సిద్ధమవుతోంది. 'కేజీఎఫ్1' సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఇప్పుడు 'కేజీఎఫ్2' హక్కులు కూడా అమెజానే కొనుక్కున్నట్లు తెలుస్తోంది. తాజాగా 'కేజీఎఫ్2' ఓటీటీ రిలీజ్ గురించి ఓ పోస్ట్ పెట్టింది అమెజాన్ ప్రైమ్ సంస్థ. ఈ సినిమాను చూడాలంటే 199 చెల్లించాల్సి ఉంటుందని చెప్పింది.
క్రేజ్ ఉన్న చాలా సినిమాలను ఇలా రెంట్ పద్దతిలో రిలీజ్ చేస్తుంటాయి ఓటీటీ సంస్థలు. ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉన్నప్పటికీ అందులో కొన్ని హాలీవుడ్ సినిమాలను చూడలేం. అవి చూడాలంటే పే పర్ వ్యూ పద్దతిలో డబ్బు చెల్లించాల్సిందే. ఇప్పుడు 'కేజీఎఫ్2' విషయంలో కూడా ఇదే చేస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' ఓటీటీ రిలీజ్ కి జీ5 సంస్థ కూడా ఇలానే చేస్తుంది. ఇక రాబోయే రోజుల్లో భారీ బడ్జెట్ సినిమాలను థియేటర్లోనే కాకుండా.. ఓటీటీలో కూడా డబ్బు చెల్లించి చూడాల్సిందేనేమో.
అయితే 'కేజీఎఫ్2' ఓటీటీ రిలీజ్ డేట్ గురించి మాత్రం ఏం చెప్పలేదు. అందుతున్న సమాచారం ప్రకారం.. మే 27 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారని టాక్. త్వరలోనే దీనిపై కూడా క్లారిటీ రానుంది. శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా.. రావు రమేష్, ప్రకాష్ రాజ్, రవీనా టాండన్, సంజయ్ దత్ లు కీలకపాత్రలు పోషించారు.
Also Read: పూజా హెగ్డేతో వెంకటేష్, వరుణ్ తేజ్ సల్సా - 'ఎఫ్ 3'లో స్పెషల్ సాంగ్ ప్రోమో చూశారా?
View this post on Instagram