అన్వేషించండి
Advertisement
Keerthy Suresh: కీర్తి సురేష్ మ్యూజిక్ వీడియో, రిలీజ్ ఎప్పుడంటే?
ఓ మ్యూజికల్ వీడియోలో నటిస్తోంది కీర్తి సురేష్. 'గాంధారి' అనే మ్యూజికల్ వీడియోతో ప్రేక్షకులను అలరించబోతుంది కీర్తి సురేష్.
సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్.. రీసెంట్ గా 'గుడ్ లక్ సఖి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఓటీటీలో కూడా వర్కవుట్ అవ్వలేదు. అయినప్పటికీ.. కీర్తికి వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం నాని 'దసరా' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ బాబుతో కలిసి 'సర్కారు వారి పాట' సినిమా చేస్తోంది.
అలానే మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'భోళా శంకర్' సినిమాలో మెగాస్టార్ కి చెల్లెలిగా కనిపించనుంది. మలయాళంలో 'వాశి' అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో టొవినో థామస్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ లాయర్ గా కనిపించనుంది. వీటితో పాటు మరికొన్ని సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయి. ఇప్పుడు సినిమాలతో పాటు ఓ మ్యూజికల్ వీడియోలో కూడా నటిస్తోంది కీర్తి సురేష్. 'గాంధారి' అనే మ్యూజికల్ వీడియోతో ప్రేక్షకులను అలరించబోతుంది కీర్తి సురేష్.
ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది కీర్తి సురేష్. ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. ఇందులో కీర్తి సురేష్ లెహంగా వేసుకొని డాన్స్ చేస్తూ కనిపించింది. ఈ మ్యూజిక్ వీడియోకు 'లవ్ స్టోరీ' ఫేమ్ పవన్ సి.హెచ్ మ్యూజిక్ అందించారు. బృంద కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశారు. పూర్తి పాటను ఫిబ్రవరి 21న విడుదల చేయనున్నారు. సోనీ సంస్థ ఈ పాటను నిర్మించింది.
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion