అన్వేషించండి

Keerthy Suresh: చిన్న వయసులోనే దూరం అయ్యింది - కంటతడి పెట్టిస్తున్న కీర్తి సురేష్ పోస్టు

తన బెస్ట్ ఫ్రెండ్ గురించి కీర్తి సురేష్ పెట్టిన సోషల్ మీడియా పోస్టు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. చిన్న వయసులోనే చనిపోయిందటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.

Keerthy Suresh About Her Best Friend Death: వరుస సినిమాలతో బిజీగా ఉంది హీరోయిన్ కీర్తి సురేష్. ఆమె తాజాగా నటించిన ‘రఘుతాత’ సినిమా త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా బిజీగా గడుపుతోంది. తాజాగా కీర్తి సురేష్ తన స్నేహితురాలి గురించి షేర్ చేసిన పోస్టు అందరికీ కంటతడి పెట్టిస్తోంది. ఇంతకీ ఆమె షేర్ చేసిన పోస్టులో ఏం ఉందంటే…?

కంటతడి పెట్టిస్తున్న కీర్తి సురేష్ పోస్టు

కీర్తి సురేష్ ప్రాణ స్నేహితురాలు మనీషా రీసెంట్ గా బ్రెయిన్ ట్యూమర్ తో చనిపోయింది. ఇదే విషయాన్ని ఆమె పుట్టిన సందర్భంగా గుర్తు చేసుకుంటూ సుదీర్ఘ పోస్టు పెట్టింది. ఆమెతో తనకున్న అనుబంధం, చనిపోయే ముందు తను పడిన బాధ గురించి రాసుకొచ్చింది. “గత కొన్ని వారాలుగా నేను ఎంతో బాధను అనుభవిస్తున్నాను. నా చిన్ననాటి స్నేహితురాలు  ఇంత త్వరగా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లడం నమ్మశక్యంగా లేదు. 21 ఏళ్ల వయసులోనే తీవ్రమైన బ్రెయిన్ ట్యూమర్‌ కు గురైంది. దాదాపు 8 ఏళ్ల పాటు వ్యాధితో పోరాడింది. గత నవంబర్‌ లో ఆమెకు మూడో సర్జరీ జరిగింది. ఆ సమయంలోనూ తను ధైర్యంగానే ఉంది. కానీ, ఆ సమయంలో తను నొప్పి భరించలేకపోతున్నట్లు నాతో చెప్పి కంటతడి పెట్టింది. ఆమె బాధ ఇప్పటికీ నా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. రోజు రోజుకు ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఆమె అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు చివరిసారిగా చూశాను. ఆ బాధను పంచుకోలేకపోతున్నాను” అని కీర్తి  రాసుకొచ్చింది.  

కలలు నెరవేరకుండానే అనంతలోకాలకు..

చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన తన స్నేహితురాలిని తలచుకుని కీర్తి సురేష్ కంటతడి పెట్టుకుంది. “తన జీవితాన్ని ఇప్పుడిప్పుడే మొదలు పెట్టింది. తను ఎన్నో కలలు కన్నది. ఆమె కలలు ఏవీ నెరవేరలేదు. ఇంత చిన్న వయసులోనే ఆమెకు ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావడం లేదు. బ్రెయిన్ ట్యూమర్ ఆమెను అనంతలోకాలకు తీసుకెళ్లింది. కానీ, ఆ వ్యాధి నుంచి బయటపడేందుకు తన చివరి శ్వాస వరకు పోరాడింది. సరిగ్గా నెల రోజుల క్రితం ఆమె పోరాడుతూ ఓడిపోయింది. ఆమె గురించి గుర్తు చేసుకోలేని రోజులేదు. ఈ రోజు ఆమె బర్త్ డే సందర్భంగా ఆమెను మరోసారి గుర్తు చేసుకుంటున్నాను. ఎప్పటికీ మర్చిపోలేను మనీషా” అంటూ కీర్తి ఆవేదన వ్యక్తం చేసింది.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)

ఆగష్టు 15న ‘రఘుతాత’ విడుదల

కీర్తి సురేష్ చివరగా పాన్ ఇండియన్ మూవీ 'కల్కి 2898AD'లో తన వాయిస్ వినిపించింది. ప్రస్తుతం ఆమె నాలుగు సినిమాలతో బిజీగా ఉంది. కీర్తి ప్రధాన పాత్రలో సుమన్‌ కుమార్‌ తెరకెక్కించిన ‘రఘుతాత’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది. హిందీ రాని ఓ తమిళ అమ్మాయి ఎలాంటి ఇబ్బందులు పడింది అనేది ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా ఆగష్టు 15న విడుదలకానుంది.   

Read Also: మహేష్ బాబు, జక్కన్న మూవీలో విక్రమ్? అసలు విషయం చెప్పేసిన చియాన్

టాప్ హెడ్ లైన్స్

Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
SlumDog Update : విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ నుంచి బిగ్ సర్ప్రైజ్ - టబు As డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డే
విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ నుంచి బిగ్ సర్ప్రైజ్ - టబు As డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డే
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Embed widget