News
News
X

KD - The Devil Title Teaser: 'యుద్ధం మొదలెడదామా' - కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో సినిమా!

ధ్రువ సజ్జా హీరోగా దర్శకుడు ప్రేమ్ ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ టీజర్ ను విడుదల చేశారు.

FOLLOW US: 
 
ఈ మధ్యకాలంలో కన్నడ ఇండస్ట్రీ నుంచి వస్తోన్న సినిమాలపై జనాలు దృష్టి పడింది. 'కేజీఎఫ్' నుంచి ఈ క్రేజ్ మొదలైంది. రీసెంట్ గా విడుదలైన 'కాంతారా' అనే సినిమా మరో సెన్సేషన్ అయింది. ఈ సినిమాను తెలుగు ఆడియన్స్ కూడా ఎగబడి చూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ సినిమా దూసుకుపోతుంది. ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో సినిమా రాబోతుంది. ధ్రువ సజ్జా హీరోగా దర్శకుడు ప్రేమ్ ఓ సినిమాను రూపొందిస్తున్నారు. 

ఈ సినిమా టైటిల్ టీజర్ ను విడుదల చేశారు. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా టీజర్ ను కట్ చేశారు. 'రామాయణ యుద్ధం స్త్రీ కోసం.. మహాభారత యుద్ధం రాజ్యం కోసం.. ఈ కలియుగ యుద్ధం కేవలం రక్తం కోసం' అనే డైలాగ్ తో టీజర్ మొదలైంది. ఆ తరువాత కాళీ అనే వ్యక్తి రిలీజ్ అవుతున్నాడని.. పోలీసులు సిటీ మొత్తాన్ని అలెర్ట్ చేయడం, సిటీ లోపలకి అతడు రాకుండా చేయడానికి జాగ్రత్తలు తీసుకోవడం వంటి సన్నివేశాలను చూపించారు. అతడిని చంపడానికి వేల మంది జనాలు రెడీగా ఉన్నారని పోలీసులు అనుకుంటారు. 

కానీ ఆ వ్యక్తిని ఊరేగించడానికి వేల మంది జనాలు జైలు దగ్గరకు తరలివస్తారు. మెల్లగా నిప్పుల మధ్య హీరోను రివీల్ చేస్తూ.. 'ఫీల్డ్ లోకి దిగాక యుద్ధంచేయాల్సిందే.. చస్తే వీరమరణం.. గెలిస్తే సింహాసనం.. యుద్ధం మొదలెడదామా అన్నయ్యా' అంటూ హీరోతో డైలాగ్ చెప్పించారు. అదే సమయంలో 'కేడి' అనే టైటిల్ ను రివీల్ చేశారు. టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. 

News Reels

ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దానికి తగ్గట్లే సినిమాలో క్యాస్టింగ్ కూడా ఉంది. అయితే నటీనటులను మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. అర్జున్ జన్య ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. విలియం డేవిడ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. 

1970లలో ఈ సినిమా కథ సాగుతుందని తెలుస్తోంది. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలకపాత్ర పోషిస్తున్నారు. సినిమాలో ఆయన రోల్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. 

Also Read : జిన్నా రివ్యూ: మంచు విష్ణు జిన్నా ప్రేక్షకులను అలరించిందా?

View this post on Instagram
 
A post shared by KVN Productions (@kvn.productions)

Published at : 21 Oct 2022 03:35 PM (IST) Tags: prem Dhruva Sarja KD - The Devil KD - The Devil title teaser KVN Production

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu:ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు

Bigg Boss 6 Telugu:ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు

Mahesh Babu: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - తిరిగి రంగంలోకి దిగిన మహేష్!

Mahesh Babu: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - తిరిగి రంగంలోకి దిగిన మహేష్!

స్టార్లను సైతం వెనక్కి నెట్టిన రామ్‌చరణ్ - ట్రూ లెజెండ్ అవార్డు దక్కించుకున్న మెగాపవర్!

స్టార్లను సైతం వెనక్కి నెట్టిన రామ్‌చరణ్ - ట్రూ లెజెండ్ అవార్డు దక్కించుకున్న మెగాపవర్!

Pushpa 2 In Russia : రష్యాలో 'పుష్ప 2' కూడా - లేట్ లేకుండా నయా ప్లాన్!

Pushpa 2 In Russia : రష్యాలో 'పుష్ప 2' కూడా - లేట్ లేకుండా నయా ప్లాన్!

Prabhas Marathi Movie : ఇప్పుడు మారుతి సెట్స్‌కు ప్రభాస్ - క్రిస్మస్ ముందు వరకూ!

Prabhas Marathi Movie : ఇప్పుడు మారుతి సెట్స్‌కు ప్రభాస్ - క్రిస్మస్ ముందు వరకూ!

టాప్ స్టోరీస్

President Droupadi Murmu : నేడు ఏపీకి ద్రౌపదీ ముర్ము, నేవీ డే కార్యక్రమాల్లో పాల్గోనున్న రాష్ట్రపతి

President Droupadi Murmu : నేడు ఏపీకి ద్రౌపదీ ముర్ము, నేవీ డే కార్యక్రమాల్లో పాల్గోనున్న రాష్ట్రపతి

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

Weather Latest Update: ముంచుకొస్తున్న మాండస్ తుపాను, ఏపీకి వర్షసూచన!

Weather Latest Update:  ముంచుకొస్తున్న మాండస్ తుపాను, ఏపీకి వర్షసూచన!

Horoscope Today 4th December 2022: ఈ రాశివారు మనసులో మాట బయటపెట్టొద్దు అది మీకు సమస్యగా మారుతుంది, డిసెంబరు 4 రాశిఫలాలు

Horoscope Today 4th  December 2022:  ఈ రాశివారు మనసులో మాట బయటపెట్టొద్దు అది మీకు సమస్యగా మారుతుంది, డిసెంబరు 4 రాశిఫలాలు