అన్వేషించండి

Amitabh Bachchan Emotional:‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ముగింపు - అమితాబ్ ఎమోషనల్ నోట్ వైరల్

‘కౌన్ బనేగా కరోడ్ పతి’ కార్యక్రమానికి 2000 సంవత్సరం నుంచి హోస్ట్ గా చేస్తున్నారు అమితాబ్. ఇప్పటి వరకూ 14 సీజన్ లు వచ్చాయి.

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వచ్చిన ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షో గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది. అమితాబ్ బచ్చన్ కారణంగానే ఈ షో అన్ని ఎపిసోడ్ లు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ముఖ్యంగా గేమ్ ఆడటానికి వచ్చిన కంటెస్టెంట్ లతో ఆయన మాట్లాడే విధానం, నడుచుకునే తీరు కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అందుకే ఈ కార్యక్రమం టివి షో లలో అత్యధిక రేటింగ్ ను సాధించింది. ప్రస్తుతం ఈ ప్రోగ్రాం 14 సీజన్ నడుస్తోంది. అయితే ఈ సీజన్ కు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త ఒకటి బయటకు వచ్చింది. త్వరలోనే ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ సీజన్ 14 ముగియనుందని తెలుస్తోంది. ఇటీవల అమితాబ్ బచ్చన్ చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ తో ఈ విషయం బయటకు వచ్చింది. దీంతో కేబీసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

‘కౌన్ బనేగా కరోడ్ పతి’ సీజన్ 14 ముగింపు దశకు చేరుకోవడంతో అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ నోట్ ను రాసుకొచ్చారు. ఈ కార్యక్రమం ముగింపు దశకు రావడం తనకు ఎంతో ఆవేదన కలిగిస్తోందని అన్నారు. ‘‘కెబీసీ ముగింపుకు అన్నీ సిద్దం అవుతున్నాయి. నటీనటులు, సిబ్బంది వారి రెగ్యులర్ జీవితం గడుపుతారు.. కానీ, మనమందరం త్వరలో మళ్లీ కలుసుకుంటామని ఆశిస్తున్నాను’’ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. అలాగే ఈ షో ద్వారా చాలా నేర్చుకున్నానని చెప్పారు అమితాబ్. కెెబీసిలో ఎంతో మంది ప్రతిభావంతులు, విజ్ఞానవంతులు పాల్గొన్నారని, వారందరి నుంచీ చాలా నేర్చుకున్నానని అన్నారు. అది తమ భవిష్యత్తుకు స్పూర్తిగా నిలుస్తుందన్నారు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ చేసిన పోస్ట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. 

ఈ ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ కార్యక్రమానికి 2000 సంవత్సరం నుంచి హోస్ట్ గా చేస్తున్నారు అమితాబ్. ఇప్పటి వరకూ 14 సీజన్ లు వచ్చాయి. ప్రతీసారి ఏదో ఒక కొత్తదనంతో సీజన్ ను కొనసాగిస్తున్నారు. ఈ షోలో  కంటెస్టెంట్ లతో అమితాబ్ బచ్చన్ ఇంట్రాక్ట్ అయ్యే విధానం ఎంతగానో ఆకట్టుకుంటుంది. తనదైన శైలిలో పనిచేస్తూ అందర్నీ ఆకర్షిస్తుంటారు అమితాబ్. అంతలా ఈ షో కు కనెక్ట్ అయ్యారాయన. ఇటీవల ఆయన 80వ పుట్టిన రోజు వేడుకలను కూడా ఇక్కడే జరుపుకున్నారు. అప్పుడు కూడా ఎమోషనల్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు షో ముగింపు దశకు రావడంతో మరోసారి ఎమోషనల్ అయ్యారు బిగ్ బి. 

అమితాబ్ బచ్చన్ అటు సినిమాల్లోనూ బిజీగా ఉంటున్నారు. ఇటీవల ఆయన నటించిన చిత్రం ‘ఉంచాయ్’  విజయం సాధించింది. దీని తర్వాత పలు చిత్రాల్లోనూ ఆయన నటించనున్నారు. అలాగే దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న భారీ చిత్రం ‘ప్రాజెక్ట్ కె’ లో అమితాబ్ నటించనున్నారు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ దశలో ఉంది. 

Also Read : కీరవాణి ఇంట్లో విషాదం - ఆయనకు మాతృ వియోగం

టాప్ హెడ్ లైన్స్

NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Embed widget