Keeravani Mother Passes Away : కీరవాణి ఇంట్లో విషాదం - ఆయనకు మాతృ వియోగం
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన మాతృమూర్తి ఈ రోజు తుదిశ్వాస విడిచారు.
![Keeravani Mother Passes Away : కీరవాణి ఇంట్లో విషాదం - ఆయనకు మాతృ వియోగం MM Keeravani Mother Passes Away Keeravani Mother Died In Hyderabad Due to Health Issues Keeravani Mother Passes Away : కీరవాణి ఇంట్లో విషాదం - ఆయనకు మాతృ వియోగం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/14/8870a9bc4629f6bfa75cba8966d582ab1671010868665313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి (MM Keeravani) ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన మాతృమూర్తి ఈ రోజు మరణించారు. ఆవిడకు వయసు రీత్యా అనారోగ్య సమస్యలు తలెత్తడంతో హైదరాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. మూడు రోజులుగా కిమ్స్‌లో చికిత్స పొందుతున్న కీరవాణి తల్లి... ఈ రోజు తుది శ్వాస విడిచారు. మరికాసేపట్లో రాజమౌళి నివాసానికి ఆమె పార్థీవ దేహాన్ని తరలించనున్నట్లు తెలిసింది. ఆవిడ పేరు బాల సరస్వతి.
కీరవాణి తల్లి మృతితో ఆయన కుటుంబ సభ్యులు అందరూ విషాదంలో ఉన్నారు. కీరవాణి తండ్రి శివ శక్తి దత్త రచయిత అనే సంగతి తెలిసిందే. కీరవాణి తమ్ముడు కళ్యాణి మాలిక్, సోదరి ఎంఎం శ్రీలేఖ కూడా సంగీత దర్శకులుగా రాణిస్తున్నారు. కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ కూడా సంగీత దర్శకుడిగా, గాయకుడిగా అడుగులు వేస్తున్నారు. 'బాహుబలి', 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాల్లో ఆయన పాడిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. 'కలర్ ఫోటో'తో పాటు పలు చిత్రాలకు ఆయన అందించిన స్వరాలు, నేపథ్య సంగీతం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.
కీరవాణి బాబాయ్, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, ఆయన కుమారుడైన దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిభ గురించి చెప్పనవసరం లేదు. ఆయన దర్శకత్వం వహించే సినిమా వ్యవహారాలు కీరవాణి భార్య శ్రీవల్లి చూసుకుంటారు. రాజమౌళి భార్య రామ కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తారు. కీరవాణి, రాజమౌళి కుటుంబ సభ్యులు అందరూ సినిమాల్లో ఉన్నారు.
M.M.Keeravani’s mother is no more. She passed her last breath few minutes ago.
— Allu Arjun ❤ (@Murthuja_AA_Fan) December 14, 2022
ప్రపంచవ్యాప్తంగా 'ఆర్ఆర్ఆర్'కు లభిస్తున్న గుర్తింపు, అవార్డులతో యావత్ భారతీయ ప్రేక్షకులు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యే గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో 'నాటు నాటు...' పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయ్యింది. సినిమా నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కేటగిరిలో నామినేషన్ పొందింది. ఈ సందర్భంగా ప్రభాస్, రామ్ చరణ్ నుంచి ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేయడంతో పాటు రాజమౌళి, కీరవాణికి అభినందనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంలో విషాదం చోటు చేసుకోవడం శోచనీయం.
Also Read : బాలయ్య షోలో ప్రభాస్ పెళ్లి టాపిక్ - ఎప్పుడో చెప్పిన రామ్ చరణ్, గోపీచంద్
లాస్ ఏంజెల్స్ క్రిటిక్స్ అవార్డుల్లో 'బెస్ట్ ఒరిజినల్ సాంగ్' అవార్డు ఎంఎం కీరవాణికి దక్కింది. ఇక ఉత్తమ దర్శకుడి విభాగంలో ఎస్.ఎస్.రాజమౌళి రన్నరప్‌గా నిలిచారు. ఈ ఏడాది 'ఆర్ఆర్ఆర్'కు గాను ఉత్తమ దర్శకుడిగా రాజమౌళికి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు ఇచ్చింది. సన్‌సెట్ సర్కిల్ అవార్డుల్లో దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఉత్తమ దర్శకుడి విభాగంలో రన్నరప్‌గా నిలిచారు.
బోస్టన్ సొసైటీ నుంచి కూడా కీరవాణికి ఒక అవార్డు వచ్చింది. అంతకు ముందు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి కూడా 'ఆర్ఆర్ఆర్' అవార్డు అందుకుంది. 'ఆర్ఆర్ఆర్' కాస్ట్ అండ్ క్రూ (నటీనటులు, సాంకేతిక నిపుణులు) కు స్పాట్ లైట్ విన్నర్ అవార్డు వచ్చింది. ఆల్రెడీ 'బెస్ట్ ఇంటర్నేషనల్ పిక్చర్'గా అవార్డులు అందుకున్న 'ఆర్ఆర్ఆర్'కు, అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ కూడా అదే విభాగంలో అవార్డు ఇచ్చింది. దీంతో ఆ అవార్డుల సంఖ్య మూడుకు చేరింది.ఇంతకు ముందు... సన్‌సెట్ సర్కిల్ అవార్డుల్లో నాలుగు హాలీవుడ్ సినిమాలతో పోటీ పడి మరీ 'ఉత్తమ అంతర్జాతీయ సినిమా' విభాగంలో 'ఆర్ఆర్ఆర్' విజేతగా నిలిచింది. శాటన్ (50th Saturn Awards) పురస్కారాల్లో 'ఆర్ఆర్ఆర్'కు 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్' అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవగణ్, శ్రియా కీలక పాత్రలు పోషించగా... అలీసన్ డూడీ, రే స్టీవెన్ సన్ విలన్ రోల్స్ చేశారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. డీవీవీ మూవీస్ పతాకంపై డీవీవీ దానయ్య సినిమా నిర్మించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)