Kasturi Shankar: ఆ టాలీవుడ్ స్టార్ హీరో నన్ను దారుణంగా టార్చర్ పెట్టాడు - నటి కస్తూరి కామెంట్స్ వైరల్
Kasturi Shankar: నటి కస్తూరి స్టార్ హీరోని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తను ఒకేసారి ఓ మూడు పెద్ద సినిమాలకు హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యానని, అయితే ఓ స్టార్ హీరో వల్ల వాటి నుంచి తప్పించారంది.
Actress Kasturi Shankar Comments: నటి కస్తూరి శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇంటింటి గృహలక్ష్మితో బుల్లితెర ఆడియన్స్‌కి దగ్గరైన ఆమె అన్నమయ్య సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత బాలయ్య నిప్పు రవ్వ సినిమాతో హీరోయిన్‌గా పరిచమైన ఆమె ఆ తర్వాత అన్నమయ్య సినిమాలతో మంచి గుర్తింపు పొందింది. ఈ సినిమా తర్వాత ఒకటిరెండు సినిమాల్లో మెరిసిన ఆమె ఆ తర్వాత పూర్తిగా వెండితెరకు దూరమైంది. చాలా ఏళ్లకు 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్స్‌తో బుల్లితెరపై మెరిసింది. తులసిగా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆమె తరచూ తన కామెంట్స్‌తో వార్తల్లో నిలుస్తుంది.
ఎలాంటి అంశమైన నిర్మోహమాటం లేకుండ తన అభిప్రాయాన్ని బయటపెడుతుంది. అంతేకాదు తన తీరుతో తరచూ ట్రోల్స్ కూడా ఎదుర్కొంటుంది. రీసెంట్‌గా పూనమ్ పాండే వ్యవహరంపై కూడా ఘాటుగా స్పందించింది. ఆమె నిజంగా మరణించిన అదీ పెద్ద వార్త కాదంటూ మండిపడింది. అలాంటి ఆమె తాజాగా ఓ స్టార్ హీరోని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తను ఒకేసారి ఓ మూడు పెద్ద సినిమాలకు హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యానని, అయితే ఓ స్టార్ హీరో వల్ల వాటి నుంచి తప్పించారంది. "అదే హీరోతో మూడు సినిమాలకు నా కాల్‌షీట్ తీసుకున్నారు. అయితే ఓ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆ హీరో నన్ను దారుణంగా టార్చర్ చేశాడు. డబ్బుల కోసం, ఆఫర్ల కోసం కమిటిమెంట్ ఇచ్చే టైపు కాదు నేను. వారి చెప్పినట్టు వినకపోయేసరికి నన్ను మిగతా ప్రాజెక్ట్స్ నుంచి తీసేశారు.
ఆ మూవీ మంచి హిట్ అయ్యింది. ఆ సినిమాతో మంచి పేరు కూడా వచ్చింది. కానీ వారి పెట్టే టార్చర్ భరిస్తూ వర్క్ చేయాలి అనిపించలేదు. నన్ను ఆ సినిమాల నుంచి తొలగించిందే మంచిదైంది. లేదంటే మనసులో తిట్టుకుంటూ.. పైకి నవ్వుతూ పలకరించడం నా వల్ల కాదు" అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఆ హీరో ఎవరన్నది ఆమె రివీల్ చేయదు. దీంతో కస్తూరి కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. అయితే గతంలో చాలా సార్లు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు తాజాగా ఆమె మళ్లీ ఆ హీరో గురించి చేప్పడంతో మరోసారి కస్తూరి కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ఇక ఆమె కామెంట్స్ విన్న కొందరు నెటిజన్లు ఆ హీరో నందమూరి బాలకృష్ణ అయ్యింటాడా? అని అభిప్రాయపడుతున్నారు.
Also Read: 'కల్కి 2898 AD' రిలీజ్‌కు లైన్ క్లియర్ - 'ఇండియన్-2' విడుదల తేదీలో మార్పు
ఆమె చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆమె బాలయ్య సరసన నటించిన నిప్పు రవ్వ మూవీ మంచి హిట్ అయ్యింది. ఈ సినిమాలో ఆమె నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత నటించిన అన్నమయ్య ప్లాప్ అయ్యింది. అంటే బాలకృష్ణ ఉద్దేశించే ఆమె మాట్లాడిందా? అని అభిప్రాయపడుతున్నారు. నిప్పు రవ్వ టైంలోనే ఆమెను బాలయ్య ఇబ్బంది పెట్టాడేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే బాలయ్యపై గతంలోనూ పలువురు హీరోయిన్స్ ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. నటి రాధిక ఆప్టే, విచిత్ర లాంటి హీరోయిన్ల కూడా బాలకృష్ణ తమని ఇబ్బంది పెట్టాడంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. కస్తూరి ఏ హీరోను ఉద్దేశించి ఈ కామెంట్స్ చేసిందో కానీ, కొందరు నెటిజన్లు మాత్రం అవి బాలయ్యపైనే అంటూ స్పందిస్తున్నారు.