అన్వేషించండి

Chandu Champion Trailer : కోమా నుంచి వరల్డ్ ఛాంపియన్ దాకా - ఆకట్టుకుంటున్న ‘చందు ఛాంపియన్‌’ ట్రైలర్

Chandu Champion Movie : యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘చందు ఛాంపియన్’. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రబృందం ట్రైలర్ ను విడుదల చేసింది.

Chandu Champion Trailer Out : బాలీవుడ్‌ యంగ్ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘చందు ఛాంపియన్‌'. ‘బజరంగీ భాయిజాన్’, ‘ఏక్ థా టైగర్’ సినిమాల దర్శకుడు కబీర్‌ ఖాన్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. 1965 ఇండో-పాక్‌ యుద్ధంలో తీవ్రంగా గాయపడి అంగ వైకల్యానికి గురైన ఓ మాజీ సైనికుడి జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా చిత్రబృందం ట్రైలర్ ను విడుదల చేసింది.

ఆద్యంతం ఆకట్టుకుంటున్న ట్రైలర్

యుద్ధంలో తీవ్రంగా గాయపడి రెండు సంవత్సరాల తర్వాత కోమా నుంచి బయటకు వచ్చిన సైనికుడిగా కార్తిక్ కనిపించడంతో ట్రైలర్ మొదలవుతుంది. బాల్యం నుంచే కార్తిక్ కు ఛాంపియన్ గా ఎదగాలనే కోరిక ఉంటుంది. అనుకోని పరిస్థితులలో సైన్యంలో చేరుతాడు. ఇండో-పాక్ యుద్ధంలో తీవ్రంగా గాయపడుతాడు. కోమాలోకి వెళ్లి చావు బతుకుల మధ్య పోరాడుతాడు. చివరకు ప్రాణాపాయం నుంచి బయటపడి, ఛాంపియన్ కావాలనే తన కోరికను కొనసాగిస్తాడు. ఆ ప్రయత్నంలో ఎన్నో అవమానాలు ఎదురైనా, వాటిని దాటుకుంటూ ముందుకుసాగుతాడు. పారాలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధిస్తాడు. ఎంతో  మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాడు. అమాయకుడిగా కనిపిస్తూనే అద్భుతమైన ప్రతిభ కనబర్చే యువకుడిగా కార్తిక్ ఆర్యన్ ఒదిగిపోయి నటించాడు. ఆయన డైలాగ్ డెలివరీ, యాక్షన్ సన్నివేశాలు, ఫిట్ నెస్ అందరినీ ఆకట్టుకుంటాయి. చెదిరిపోని పట్టుదలతో ఆయన అనుకున్న సాధించే క్రమంలో ఎదురైన అవమానాలు కసిని పెంచుతాయి. సీటు ఎడ్జ్ మీద కూర్చొబెట్టేలా ఉన్న ఈ ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచుతోంది.   

మురళీకాంత్ పేట్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘చందు ఛాంపియన్’

స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ‘చందు ఛాంపియన్‌’ సినిమాకు కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. నడియావాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియా వాలా, కబీర్ ఖాన్ ఈ సినిమాను నిర్మించారు. భారతదేశం నుంచి తొలి పారాలింపిక్ గోల్డ్ మెడల్ సాధించిన  ఫ్రీస్టైల్ స్విమ్మర్ మురళీకాంత్ పేట్కర్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది. 1965 ఇండో-పాక్‌ యుద్ధంలో తీవ్రంగా గాయపడిన మురళీకాంత్ దివ్యాంగుడిగా మారుతారు. అయినా, ఏమాత్రం నిరాశ చెందకుండా 1972లో జరిగిన ప్రపంచ పారాలింపిక్స్‌ లో పాల్గొని స్విమ్మింగ్ లో గోల్డ్‌ మెడల్‌ను సాధించారు. ఆయన స్ఫూర్తివంతమైన ప్రయాణాన్ని ‘చందు ఛాంపియన్’ సినిమాలో చూపించబోతున్నారు.  ఈ మూవీని జూన్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.  

బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా రాణిస్తున్న కార్తిక్ ఆర్యన్

ఇక కార్తిక్ ఆర్యన్ బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగిస్తున్నాడు. ‘ప్యార్‌ కా పంచునామా’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అనంతరం ‘లుకా చుప్పి’, ‘పతి ఔర్ పత్నీ వో’, ‘సత్యప్రేమ్ కి కథ’ లాంటి సినిమాలతో సక్సెస్ ఫుల్ హీరోగా ఎదిగాడు. ఇప్పుడు ‘చందు ఛాంపియన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  

Read Also: నో స్టెరాయిడ్స్, ఓన్లీ వర్కౌట్స్ - ‘చందు ఛాంపియన్‌’ కోసం కార్తీక్ ఇంత కష్టపడ్డాడా?

టాప్ హెడ్ లైన్స్

National Film Awards 2026 Winners List: నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
Chiranjeevi On Vikram 1: విక్రమ్ 1 విజయంపై చిరంజీవి ట్వీట్... పీఎం మోడీ, పవన్ కళ్యాణ్ సైతం... స్కైరూట్‌కు అభినందనలు
విక్రమ్ 1 విజయంపై చిరంజీవి ట్వీట్... పీఎం మోడీ, పవన్ కళ్యాణ్ సైతం... స్కైరూట్‌కు అభినందనలు
AZADI 501 Release Date: ఆజాదీ 501 స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది... ఆహా ఓటీటీలో టెక్ స్కామ్ సిరీస్‌ను ఎప్పట్నించి చూడొచ్చంటే?
ఫ్రీడమ్ 251తో జనాలకు బోడిగుండు... ఇప్పుడు ఆహా ఓటీటీకి 'ఆజాదీ 501'గా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Gudivada Tour: రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Guntur Crime News: గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
683 కి.మీ రేంజ్‌ Mahindra BE6 EVపై రూ. 2.50 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
683 కి.మీ రేంజ్‌ Mahindra BE6 EVపై రూ. 2.50 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Anna Lezhneva Visits Thirumala: శ్రీవారి సన్నిధిలో అన్నా లెజినోవా... తిరుమలలో పవన్ భార్య ఫోటోలు
శ్రీవారి సన్నిధిలో అన్నా లెజినోవా... తిరుమలలో పవన్ భార్య ఫోటోలు
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
Embed widget