అన్వేషించండి

Kartik Aaryan : నో స్టెరాయిడ్స్, ఓన్లీ వర్కౌట్స్ - ‘చందు ఛాంపియన్‌’ కోసం కార్తీక్ ఇంత కష్టపడ్డాడా?

Kartik Aaryan Fitness : కార్తీక్ ఆర్యన్, కబీర్ ఖాన్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘చందు ఛాంపియన్’. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో బాడీ ఫిట్ నెస్ కోసం కార్తీక్ ఎంతో కష్టపడ్డారట.

Chandu Champion Movie : బాలీవుడ్ నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తాజా చిత్రం ‘చందు ఛాంపియన్‌’. కార్తిక్ ఆర్యన్ హీరోగా, కబీర్ ఖాన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే  షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. అదిరిపోయే బాడీ ఫిట్ నెస్​తో కార్తీక్ ఆశ్చర్యపరిచాడు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

బాడీ ఫిట్ నెస్ కోసం ఏడాదిన్నర కష్టపడ్డ కార్తీక్

‘చందు ఛాంపియన్‌’ సినిమాలో బాడీ ఫిట్​నెస్ కోసం కార్తీక్ ఆర్యన్ చాలా కష్టపడ్డాడట. మెస్మరైజ్ చేసే సిక్స్ ఫ్యాక్ కోసం ఆయన రాత్రింబవళ్లు కష్టపడినట్లు దర్శకుడు కబీర్ ఖాన్ తెలిపారు. ఎలాంటి స్టెరాయిడ్స్ లేకుండా కేవలం వర్కౌట్స్, డైట్ తో అద్భుతమైన శరీర సౌష్ఠవాన్ని సాధించినట్లు వెల్లడించారు. ఇందుకోసం ఆయన ఏకంగా ఏడాదిన్నర కష్టపడినట్లు చెప్పారు. తన బాడీలోని ఫ్యాట్ పర్సంటేజ్ ను ఏకంగా 39 శాతం నుంచి 7 శాతానికి తగ్గించుకున్నట్లు తెలిపారు. సాల్ట్, షుగర్ ను చాలా వరకు తగ్గించినట్లు చెప్పారు. “ఈ రోజుల్లో జిమ్ కు వెళ్లే చాలా మంది బాడీ చక్కగా కనిపించేందుకు స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడుతున్నారు. అవసరం లేకున్నా దుర్వినియోగం చేస్తున్నారు. కానీ, కార్తిక్ ఎలాంటి స్టెరాయిడ్స్ తీసుకోకుండా తన బాడీని ఫిట్​గా తయారు చేసుకున్నాడు. అతడి ఫిట్ నెస్ అలాగే నిలిచిపోయే అవకాశం ఉంది. ఒకవేళ స్టెరాయిడ్స్ తీసుకుని బాడీని ఫిట్ గా తయారు చేస్తే, కొద్ది రోజుల్లోనే యథాస్థితికి వస్తుంది” అని కబీర్ ఖాన్ వెల్లడించారు.   

మురళీకాంత్ కథ విని ఆశ్చర్యపోయాను- కబీర్ ఖాన్

‘చందు ఛాంపియన్‌’ సినిమాను ఫ్రీస్టైల్ స్విమ్మింగ్‌లో ఇండియాకు తొలి పారాలింపిక్ గోల్డ్ మెడల్ అందించిన  మురళీకాంత్ పేట్కర్ జీవితం కథ ఆధారంగా రూపొందించినట్లు కబీర్ ఖాన్ తెలిపారు. చందు పాత్రలో కార్తిక్ అద్భుతంగా ఒదిగిపోయిన నటించారని వెల్లడించారు. “చందు పాత్రకు కార్తిక్ ఎంపిక వందకు వంద శాతం కరెక్టేనని సినిమా చూసిన ప్రతి ఒక్కరు చెప్తారు. వాస్తవానికి నేను మురళీకాంత్ కథ విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఆయన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనుకున్నాను. ఆ పాత్రకు కార్తిక్ న్యాయం చేయగలడు అనుకున్నాను. ఆ పాత్ర కోసం కార్తిక్ పడిన కష్టం నిజంగా అభినందనీయం” అని కబీర్ ఖాన్ వెల్లడించారు. 

జూన్ 14న ‘చందు ఛాంపియన్‌’ విడుదల

‘చందు ఛాంపియన్‌’ సినిమాను సాజిద్‌ నడియాడ్‌ వాలా, కబీర్ ఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీని జూన్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రీసెంట్ గా విడుదలైన ‘శ్రీకాంత్’ సినిమా ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్న నేపథ్యంలో ‘చందు ఛాంపియన్‌’ పైనా ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. తప్పకుండా ఈ సినిమా చక్కటి విజయాన్ని అందుకుంటుందని సినీ జనాలు అభిప్రాయపడుతున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KARTIK AARYAN (@kartikaaryan)

Read Also: నరేంద్ర మోదీ బయోపిక్‌లో 'బాహుబలి' ఫేం‌ - ప్రధానిగా కనిపించనున్న స్టార్‌ నటుడు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Embed widget