అన్వేషించండి

Karthika Deepam October 15th Update: మోనితని ఆడేసుకుంటున్న కార్తీక్, దీప, దుర్గ - శౌర్య కోసం వెతుకుతున్న శివ

కార్తీకదీపం అక్టోబరు 15ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కి గతం గుర్తొచ్చేసింది. ఇప్పుడు మోనిత ఏం చేయబోతోందనేది ఇంట్రెస్టింగ్...

Karthika Deepam October 15th Episode 1484 (కార్తీకదీపం అక్టోబరు 15 ఎపిసోడ్)

నిన్న రాత్రి నీ హ్యాండ్ బ్యాగ్ నా దగ్గర మర్చిపోయావు మోనిత అని కార్తీక్ దగ్గర బుక్ చేస్తాడు. నేను నిన్ను రాత్రి నీ దగ్గరికి రావడం ఏంట్రా అంటే..నిన్న రాత్రి మనిద్దరమే కదా సంగారెడ్డి నుంచి ఇక్కడికి కలిసి వచ్చాం... అప్పటికి నేను చెబుతూనే ఉన్నాను కార్తీక్ కనిపించడం లేదు కదా వెతుకుదాం రేపు ఉదయం వద్దాం అంటే ఎలాగా కనిపించలేదు కదా ఇంటికి వచ్చేసుంటాడులే రా పద అని తీసుకొచ్చేసావు కదా మోనిత అని అంటాడు దుర్గ.  కార్తీక్ అక్కడ నుంచి కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. దుర్గా కూడా వెళ్లిపోతుండగా పరిస్థితి ఏదైనా తేడా జరిగితే నీ అంతుచూస్తానని బెదిరిస్తుంది. 

ఆ తర్వాత కార్తీక్ రూమ్ లో ఒంటరిగా ఆలోచనల్లో పడతాడు
అమ్మా నాన్నలు ఇక్కడకు రాలేదంటే వాళ్లకి నేను బతికి ఉన్నట్టే తెలియదా..దీప ఒక్కతే ఇక్కడుందంటే పిల్లలేరి..హైదరాబాద్ వెళ్లలేదా..శౌర్య, వారణాసి ఇక్కడే ఉన్న విషయం దీపకు తెలియదా, శౌర్య బొమ్మలమ్ముతోంది ఏంటి.నేను మోనిత చేతికి ఎలా చిక్కాను...హిమను కార్లోంచి బయటకు తోసేశాను ఎక్కడుంది? దీపను వెళ్లి అడుగుదాం అంటే మోనితకు కూడా నిజం తెలిసిపోతుంది..అప్పుడు దీపకు ప్రమాదం.. ప్రతిక్షణం మోనిత నుంచి దీపను కాపాడుకుంటూనే ఉండాలి..అలాగే అమ్మావాళ్ల దగ్గరకు వెళ్లాలి..ఇప్పుడు వెళదాం అంటే మోనిత దీపను ఏం చేస్తుందో అన్న భయం..ముందు శౌర్యని వెతకాలి..తను దొరికాకే మిగిలినది ప్లాన్ చేస్తాను అనుకుంటాడు...

దీప వాళ్ళ అన్నయ్య కి, దుర్గకి వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అన్నయ్య, నువ్వు కూడా భోజనం చెయ్యమ్మా అంటే డాక్టర్ బాబుని భోజనానికి పిలుస్తాను ఈ రోజు ఆయనతో తినాలని ఉందంటుంది. మోనిత పంపిస్తుందా అని డాక్టర్ అన్నయ్య అంటే..
దీప: అదెవరు పంపించడానికి నా భర్తని నేను తీసుకొస్తానంటుంది. ఈ మధ్య డాక్టర్ బాబు ప్రవర్తనలో మార్పు కనిపిస్తోంది. నేరుగా నా దగ్గరకు వచ్చారు....
డాక్టర్ అన్నయ్య: ఈ మధ్య జరిగిన సంఘటనలతో మోనిత తప్పు నువ్వు నిజం అని తెలిసిందేమో
దుర్గ: డాక్టర్ బాబుకి గతం గుర్తొచ్చిఉంటుంది..
దీప: లేదన్నయ్య ఒకవేళ గతం గుర్తొస్తే ఇప్పుడే మోనిత అంతు చూసి నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్లి పోతారు గతం గుర్తు రావడంలేదు కానీ ఏది మంచో ఏది చెడో తెలుస్తుంది అని అంటుంది.

Also Read: కార్తీక్ ఈజ్ బ్యాక్ - వంటలక్క సేఫ్, ఇక మోనితకు మూడినట్టే!

శివ బయట స్విమ్మింగ్ పూల్ లో నీళ్లు ప్యూరిఫై చేస్తుంటాడు. వచ్చి మాధవ్ ఏం చేస్తున్నావు అనడంతో నా పేరు శివ అంటాడు. నాకు తెలుసు కానీ నాకు గతం గుర్తొచ్చిందని ఎవరికి అనుమానం రాకూడదని ఇలా పిలుస్తున్నాను అని కార్తీక్ మనసులో అనుకుంటాడు. ఆరోజు మనం బొమ్మలు కొన్నాం కదా ఆ పాప ఎక్కడైనా కనిపిస్తే చెప్పు అంటాడు. నిన్నే కనిపించింది కానీ మేడం పిలవడంతో వెళ్లిపోయానంటాడు. 
కార్తీక్: మీ మేడం అడ్డుపడక పోతే ఆశ్చర్యపోవాలి..మళ్లీ ఆ పాప కనిపిస్తే చెప్పు
శివ: ఆ పాప గురించి ఎందుకు అడుగుతున్నారు
కార్తీక్: చిన్నవయసులో బొమ్మలు అమ్ముకుంటోంది కదా...చదివిద్దాం అనుకుంటున్నా 
 ఆ పాప మీకు థ్యాంక్స్ చెబుదాం అనుకుంటే మోనిత మేడం నన్ను బెదిరించారని శివ చెప్పడంతో...నువ్వెక్కడున్నావో తెలుసుకుంటాను..నువ్వు నేను కలసి మీ అమ్మ దగ్గరకి వెళ్లాలి..మీ అమ్మ కళ్లలో సంతోషం చూడాలి శౌర్య అనుకుంటాడు కార్తీక్...మరోవైపు  నా కుటుబాన్ని ముక్కలు చేసి నువ్వు నన్ను దక్కించుకోవాలి అనుకున్నావా నీ అంతుచూస్తా మోనిత అని కోపంతో రగిలిపోతాడు.

అటు శౌర్య..తల్లిదండ్రుల కోసం వెతికి..ఇంటికి వెళుతుంది. మొన్న నువ్వు మోనిత మీద రాయి విసిరేటప్పుడు అనవసరంగా విసిరావు అనిపిస్తోంది. ఎవరితోనైనా శత్రుత్వం మంచిది కాదు అంటాడు. పర్లేదు బాబాయ్ లేకపోతే నన్నే తిడుతుందా ఇంతకీ పిన్ని ఏది అని అనగా పిన్ని ఊరెళ్లింది వచ్చేస్తుంది అంటాడు ఇంద్రుడు. వంటెవరు చేస్తారని శౌర్య అడిగితే నేనే చేస్తానంటాడు ఇంద్రుడు. కాసేపు బాబాయ్ ని ఆటపట్టిస్తుంది..

కార్తీక్ కోపం గా మోనిత ను పిలుస్తాడు.అదే సమయంలో దీప కార్తీక్ ఇంటికి వచ్చి వీళ్ళ మాటలు గోడ చాటు నుంచి వింటుంది. అప్పుడు కార్తీక్ మోనితతో ఆ రౌడీలను దీపను చంపడానికి ఎందుకు పంపావు అని అడుగుతాడు. నేను రౌడీలను పంపించడం ఏంటి అంటుంది
దీప: ఇది ఆరోజు ఊరికే అన్నది అనుకున్నా, నిజంగానే మనుషుల్ని పంపించిందా..
కార్తీక్: ఆ రౌడీలను నువ్వే పంపావని నాకు తెలుసు నిన్న దీప ను చంపేస్తాను అని బెదిరించావ్, అవసరం అయితే అడ్డు తొలగిస్తానన్నావ్.. చెప్పినట్టే మనుషుల్ని పంపించావ్
మోనిత: ఆవేశంలో అన్న మాటలివి..కోపంలో వంద అంటాం..అన్నీ చేసేస్తామా
కార్తీక్: దీప కోసం మనుషుల్ని పంపలేదా
మోనిత:పంపలేదు
కార్తీక్: మరి నాకోసం పంపించావా
మోనిత: ఏం మాట్లాడుతున్నావ్..
కార్తీక్: పరిస్థితులు మోనితా..ఎంతకైనా తెగించేలా చేస్తాయ్..మనం సంగారెడ్డి వెళ్లేటప్పుడే అన్నాకదా..నువ్వు దుర్గ కలసి ఏమైనా చేస్తారా అని..మీరిద్దరూ కలసి ప్లాన్ చేయలేదని గ్యారంటీ ఏంటి
మోనిత: ఈ మధ్య ప్రతి విషయంలో నన్ను అనుమానిస్తున్నావ్
కార్తీక్: వాళ్లు నువ్వు పంపిన మనుషులు కాకపోతే ఈ దెబ్బ ఎవరు కొట్టారు.. 
మోనిత: అది వాళ్లు కాదు.. శౌర్య రాయి విసిరితే తగిలిందని గుర్తుచేసుకుని..ఎవరో కొట్టారు
కార్తీక‌్: రౌడీలు రావడం నిజం, వాళ్లు నన్ను కానీ దీపను కానీ అటాక్ చేయాలి అనుకోవడం నిజం.. ఇది తెలిసి నాకు కావాల్సిన మనిషి అడ్డుపడితే తనని చావగొట్టారు..నేను అడ్డుపడితే నన్ను కొట్టారు.. సంగారెడ్డిలో నాపై, దీపపై అటాక్ చేయాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు నీకు తప్ప...
దీప: నా భర్తని సొంతం చేయడానికి పిచ్చివేషాలు వేసింది చాలక..నా అడ్డే తొలగించుకోవాలని చూస్తావా...
ఏంటి దీపమ్మా కార్తీక్ సార్ ని పిలుద్దాం అని వెళ్లావ్ కదా అని దుర్గ అంటే... కార్తీక్ మాటలన్నీ చెబుతుంది... దీన్ని వదలకూడదు దీపమ్మా చేయ్ దుర్గ...ఇంతవరకూ అడ్డుచెప్పలేదు ఇకపై రెచ్చిపో అంటుంది...ఇప్పుడు చెబుతా దానిసంగతి అంటూ వెళతాడు దుర్గ...

Also Read: జగతికి అత్తగారి హోదా , రిషిధార మధ్య చిచ్చు పెట్టిన చీర!

దుర్గ:హలో బంగారం
మోనిత: ఎవర్రా బంగారం..మళ్లీ అలా పిలిస్తే నాలుక చీరేస్తా
దుర్గ: కోపంలో వద్దంటున్నావ్ కానీ..ఎప్పుడూ పిలిచే పిలుపు పిలవకుండా ఎలా ఉంటాను
మోనిత: నాకు చిరాగ్గా ఉంది వెళ్లిపో
దుర్గ: అనుకున్న పని అవ్వకపోతే చిరాగ్గానే ఉంటుంది కదా బంగారం. దీపని లేపేద్దామమని రౌడీలని పెట్టించావు. పాపం పని జరగలేదు కదా అని అంటాడు దుర్గ.
అదే సమయంలో కార్తీక్ వాళ్ళ మాటలు వింటాడు
ఎపిసోడ్ ముగిసింది

సోమవారం ఎపిసోడ్ లో
ఏం ఆలోచిస్తున్నారు డాక్టర్ బాబు అంటే తలనొప్పిగా ఉంది కాఫీ కావాలి అని అడుగుతాడు. దీప కాఫీ ఇస్తుంది మోనిత వచ్చి ఫైర్ అవుతుంది... దీప లాగిపెట్టి కొడుతుంది...నీ భార్యని కొడుతుంటే చూస్తావేంటి కార్తీక్ అని మోనిత అంటే.. నా భార్య ఎవరు నువ్వా-వంటలక్కా అని అడుగుతాడు కార్తీక్...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Honda SP 125: ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
Ram Gopal Varma: 'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Embed widget