అన్వేషించండి

Karthika Deepam December 16th Update: చారుశీల సాయం అడిగిన శౌర్య, కార్తీక్ ని అనుమానిస్తున్న దీప, తల్లడిల్లిపోతున్న సౌందర్య

కార్తీకదీపం డిసెంబరు 16 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

Karthika Deepam  December 16th  Episode 1537 (కార్తీకదీపం డిసెంబరు 16ఎపిసోడ్)

చారుశీల పేషెంట్లను చూస్తూ ఉండగా  శౌర్య హాస్పిటల్ కి వెళుతుంది. శౌర్యని చూసి షాక్ అయిన చారుశీల..ఇప్పుడు కార్తీక్ వస్తే ఏం జరుగుతుందో..అందుకే తను వచ్చేలోగా శౌర్యని పంపించేయాలి అనుకుంటుంది. 
చారుశీల: ఏంటి జ్వాలా ఇలా వచ్చావు
శౌర్య: మీ దగ్గరకే వచ్చాను హెల్ప్ కావాలని అడిగి అమ్మా-నాన్న మీరెక్కడున్నారు అనే పోస్టర్ ని అతికించమని అడుగుతుంది. మీది చాలా పెద్ద హాస్పిటల్ కదా డాక్టర్ ఈ పోస్టర్ని మీ హాస్పిటల్ లో అతికించండి ఈ పోస్టర్ ను చూస్తే మా అమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను కలుస్తారు
చారుశీల: మీ నాన్న ఇక్కడే ఉన్నారని నీకు ఎలా చెప్పనమ్మా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ప్లీజ్ డాక్టర్ నాకు హెల్ప్ చేస్తారు కదా అనడంతో సరే తప్పకుండా హెల్ప్ చేస్తాను అని అబద్ధం చెబుతుంది చారుశీల. ఆ తర్వాత చారుశీల సిస్టర్ కి పోస్టర్ ఇచ్చి దానిని అతికించమని చెబుతుంది.
శౌర్య: ఇక్కడ మాత్రమే కాదు డాక్టర్ ఊరు మొత్తం పోస్టర్లు అతికించాను. ఇంతవరకు ఎవరూ ఫోన్ చేయలేదు 
చారుశీల: మీ అమ్మ వాళ్ళు ఇక్కడ లేరేమో శౌర్య అనడంతో లేదు వాళ్ళు ఇక్కడే ఉన్నారు అని అంటుంది శౌర్య. ఆమె బాధని చూసి కన్నీళ్లు పెట్టుకున్న చారుశీల కార్తీక్ వచ్చేలోగా పంపించేయాలి అనుకుంటుంది

Also Read: దేవయానితో సవాల్ చేసి ఇంట్లోంచి వెళ్లిపోయిన వసు, బొకే తీసుకుని బయలుదేరిన రిషి

సౌందర్య-అంజి
సౌందర్య..దీప కోసం వెతికి వెతికి నిరాశగా వస్తుంది. అప్పుడు డ్రైవర్ అంజి ... కనిపించారా మేడం అనడంతో లేదు అంజి అని బాధతో మాట్లాడుతుంది సౌందర్య. అంత తొందరగా దొరికితే దేవుడు ఎందుకు అవుతాడు అంజి ఇంకా మమ్మల్ని ఎన్ని కష్టాలు పెడతాడు అనుకుంటూ ఉంటుంది సౌందర్య. అప్పుడు సౌందర్య బాధను చూసిన అంజి బాధపడకండి మేడం ఎలా అయినా కార్తీక్ సార్ దీప మేడమ్ ఎదురు దొరుకుతారు అని అంటాడు.

హాస్పిటల్ లో శౌర్య అతికించిన పోస్టర్ ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు.
కార్తీక్: చూసావా చారుశీల ఈ వయసులో నా కూతురు మా కోసం ఎంతలా కష్టపడుతుందో ఇలాంటి కష్టమే ఏ తల్లి తండ్రికి రాకూడదు అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. నాకు కొంచెం కూడా దయ లేదు చారుశీల కళ్ళముందు కూతురు కనిపిస్తున్నా కూడా తనని కష్టపడుతున్నాను 
చారుశీల: అలా మాట్లాడకు కార్తీక్ నీకు ఎంత కష్టం ఉంటే ఇలా బిడ్డ విషయంలో ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నావు అని సర్దిచెబుతుంది. 
కార్తీక్: ఇక్కడ శౌర్య మాకోసం వెతుకుతోంది.. దీప శౌర్య కోసం వెతికి అలసిపోతోంది. తల్లీ బిడ్డల ఆరాటం చూస్తున్నా నేను ఏమీ చేయలేకపోతున్నా
చారుశీల: మరి చెప్పేయండి డాక్టర్ మరి ఎందుకు ఇంతలా బాధపడుతున్నారు. మీరు చెప్పకూడదు అనుకున్నారు కాబట్టి మంచి అని చెప్పడం లేదు కదా కాబట్టి మీరు ఎక్కువగా ఆలోచించి బాధపడకండి 

మరొకవైపు దీపకి పండరి టాబ్లెట్స్ ఇస్తుంటే..దీప దీర్ఘంగా ఆలోచిస్తుంది. ఏంటి దీపమ్మ ఎప్పుడూ ఇలాగే కూర్చుని బాధపడుతూ ఉంటావు అని అంటే.. శౌర్య కోసం అని చెబుతుంది. దీప చూపించిన ఇంద్రుడు-చంద్రమ్మ ఫొటో చూసిన పండరి.. వీళ్లు ఈ మధ్యే మా ఇంటికి దగ్గర్లోకి అద్దెకు దిగారు..నాకు తెలుసు అనడంతో దీప సంతోషిస్తుంది. వెంటనే తీసుకెళ్లమని బతిమలాడుతుంది. 

సౌందర్య-అంజి కలసి కార్తీక్ కోసం హాస్పిటల్స్ మొత్తం వెతుకుతూ ఉంటారు. అక్కడున్న డాక్టర్లని కార్తీక్ ఆచూకీ అడుగుతారు. మరోవైపు దీప-పండరి ఇద్దరూ శౌర్య కోసం వెళుతుంటారు. దీప కంగారు చూసి ఎందుకమ్మా అలా కంగారు పడతారు వాళ్లెక్కడికి పోతారని పండరి అంటుంది. గతంలో వాళ్లు తన నుంచి తప్పించుకుని వెళ్లిపోయిన సంగతి చెబుతుంది. మనం వెళుతున్నసంగతి వాళ్లకి తెలియదుకదా కంగారుపడొద్దని చెబుతుంది. అప్పుడు దీప కార్తీక్ కి కాల్ చేసి శౌర్య దగ్గరకు వెళుతున్న సంగతి చెబుతుంది. పండరీకి ఫోన్ ఇచ్చి అడ్రస్ చెప్పమంటుంది. కార్తీక్ షాక్ అవుతాడు

Also Read: పండరి మోనిత మనిషా, కార్తీక్-దీప మళ్లీ విడిపోతారా, సౌందర్య ఏం చేయబోతోంది!

రేపటి( శనివారం)ఎపిసోడ్ లో
దీప వాళ్లు అక్కడకు వెళ్లేసరికి అక్కడ ఎవరూ ఉండరు..ఆ ఇంటి బయట ఇల్లు అమ్మబడును అని బోర్డు కనిపిస్తుంది. అది చూసి దీప షాక్ అవుతుంది. వెళ్లి అడిగొస్తానని పండరి అంటున్నా కార్తీక్ అడ్డుకుంటాడు. మనం వస్తున్న సంగతి తెలియదు కదా అని పండరి అంటే.. మీకు తెలుసుకదా డాక్టర్ బాబు అంటుంది దీప...అంటే నన్ను అనుమానిస్తున్నావా అంటాడు కార్తీక్... 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Pawan Kalyan Latest News: పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Political News : జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Pawan Kalyan Latest News: పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Political News : జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
Mirai Audio Rights: హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
Tirumala News: తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
Priyanka Gandhi Took Oath Today: వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Embed widget