Kantara Chapter 1: రూ.1000 కోట్లు కొట్టేస్తారేమో -‘కాంతార: ఛాప్టర్ 1’ ఫస్ట్‌లుక్, టీజర్ రిలీజ్ - ఈసారి ఏడు భాషల్లో!
Kantara Chapter 1 First Look: ‘కాంతార ఛాప్టర్ 1’ ఫస్ట్‌లుక్, టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
Kantara Chapter 1 Teaser: 2022లో విడుదల అయిన ‘కాంతార’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.400 కోట్ల వసూళ్లను సాధించింది. కర్ణాటకలో ‘కేజీయఫ్: ఛాప్టర్ 2’ని మించిన వసూళ్లను సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు దీని రెండో భాగాన్ని ‘కాంతార: ఛాప్టర్ 1’ పేరిట తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగానికి ప్రీక్వెల్‌గా ఈ సినిమా రానుంది. ఈ సినిమా రూ.1000 కోట్ల వసూళ్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. ఏడు భాషల్లో ఈ సినిమాని మేకర్స్ విడుదల చేయనున్నారు. కన్నడ, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, ఇంగ్లిష్, బెంగాలీ భాషల్లో ‘కాంతార: ఛాప్టర్ 1’ రిలీజ్ కానుంది.
టీజర్‌ను కూడా ఏడు భాషల్లో రిలీజ్ చేశారు. డీఫాల్ట్‌గా ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో టీజర్ ప్లే అవుతుంది. సెట్టింగ్స్‌లో దాన్ని ఇతర భాషలకు మార్చుకోవచ్చు. ‘వెలుగులో కంటికి అంతా కనిపిస్తుంది. కానీ అది చూపు కాదు... దర్శనం.’ అంటూ గూస్‌బంప్స్ తెప్పించే మాడ్యులేషన్‌తో డైలాగ్ చెప్పారు. పొడవైన జుట్టు, గడ్డంతో ఒక ముని లాగా రిషబ్ ఈ టీజర్‌లో కనిపించాడు. తన కళ్లు పులి కళ్లలా మెరవడం కూడా చూడవచ్చు. సినిమా ఎప్పుడు రిలీజ్ కానుందో అధికారికంగా ప్రకటించలేదు. రిలీజ్ డేట్ ప్రెజర్ లేకుండా మంచి అవుట్ పుట్ ఇవ్వడానికి టీమ్ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు.
‘కాంతార’ మొదటి భాగం ముందుగా కేవలం కన్నడ ప్రేక్షకుల్లో మాత్రమే హైప్ క్రియేట్ చేసింది. అక్కడే విడుదలయ్యి బ్లాక్‌బస్టర్ అందుకుంది. పాన్ ఇండియా వైడ్‌గా విడుదల చేయాలన్న ఆలోచన రిషబ్ శెట్టికి లేదు. ఇతర భాషల్లోని నిర్మాతలు ఈ మూవీని చూసి ఇష్టపడి ఎన్నో కోట్లు పెట్టి కొనుకున్నారు. అలా డబ్ అయిన ప్రతీ భాషలో కూడా మూవీ సూపర్ హిట్ రేంజ్‌ను అందుకుంది. దీంతో ‘కాంతార’కు రెండో భాగం ఉంది అని తెలియగానే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆటోమేటిక్‌గా అంచనాలు పెరిగిపోయాయి. అందుకే దీనిని మరింత భారీ బడ్జెట్‌తో, పాన్ ఇండియా స్థాయలో విడుదల చేయాలని రిషబ్ శెట్టి నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం ‘కాంతార 2’ బడ్జెట్ రూ.125 కోట్లు అని తెలుస్తోంది. శాండిల్‌వుడ్ ప్రేక్షకులను కూడా ఈ బడ్జెట్ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
‘కాంతార’కు అయిన బడ్జెట్ కేవలం రూ.15 కోట్లు మాత్రమే. కానీ దాని సక్సెస్ కారణంగా రెండో భాగంపై పెరిగిన అంచనాలు బడ్జెట్‌ను కూడా పెంచేస్తున్నాయి. రూ. 15 కోట్లతో తెరకెక్కించిన మొదటి భాగం మొత్తంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. రాజకీయ నాయకుల నుంచి కూడా ‘కాంతార’ ఎన్నో అభినందలను అందుకుంది. కేంద్ర మంత్రి అనురాగ్ థాకూర్.. రిషబ్ శెట్టి ‘కాంతార’ గురించి పార్లమెంటులో కూడా ప్రస్తావన తీసుకొచ్చారు. మన ఇండియన్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఎలా గుర్తింపు అందుకుంటున్నాయో చెప్పడానికి ‘కాంతార’నే ఉదాహరణ అని ఈ సందర్భంగా అన్నారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆
*T&C Apply