Kangana Ranaut Home Temple: కంగనా మనాలి ఇంట్లో పూజ గది చూశారా? ఆలయాన్ని తలపిస్తోంది!
Kangana Ranaut Home Temple: నటి కంగనా రనౌత్ మనాలిలోని తన ఇంటి పూజ గది వీడియోను అభిమానులతో పంచుకుంది. ఆధ్యాత్మిక శోభను వెదజల్లుతూ అందరినీ ఆకట్టుకుంటోంది.
Kangana Ranaut’s Manali Home Temple: బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఉన్నది ఉన్నట్లు ముఖం మీదే చెప్పేసే కంగనా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ఈ ముద్దుగుమ్మకు 2023 పెద్దగా కలిసి రాలేదని చెప్పుకోవచ్చు. గత ఏడాది ఆమె నటించిన ఏ సినిమా కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ‘తేజస్’, ‘చంద్రముఖి -2’ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచయా. ప్రస్తుతం ఆమె నటించిన ‘ఎమర్జెన్సీ’ మూవీ విడుదలకు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాత్రలో ఆమె కనిపించబోతోంది. ఆమె ఆశలన్నీ ఈ సినిమా మీదే పెట్టుకుంది.
ఆధ్యాత్మిక శోభతో ఆకట్టుకుంటున్న కంగనా పూజగది
తాజాగా కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో మనాలిలోని తన ఇంటి పూజ గది వీడియోను షేర్ చేసింది కంగనా. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఆమె పూజగది తలుపులు పురాతన ఆలయ శోభను కలిగి ఉన్నాయి. ఆ తలుపులు సైతం చాలా పాత కాలానికి చెందినవిగా కనిపిస్తున్నాయి. వాటి మీద అనేక దేవతా మూర్తుల బొమ్మలు ఉన్నాయి. ఇక గదిలోపల పెద్ద శివలింగంతో సహా అనేక దేవతా మూర్తుల విగ్రహాలు ఉన్నాయి. గణపతి, దుర్గాదేవితో పాటు ఇతర దేవతల విగ్రహాలు కొలువు దీరి ఉన్నాయి. లార్డ్ గిరిరాజ్ ఫ్రేమ్డ్ ఫోటో గోడకు వేలాడదీయబడి ఉంది. ఎడమ గోడపై పాతకాలపు పెయింటింగ్ కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంట్లో ప్రశాంతత లేదు - కంగనా
View this post on Instagram
అటు కంగనా తన ట్విట్టర్ వేదికగా రీసెంట్ గా చేసిన పోస్టు కూడా బాగా సర్క్యులేట్ అయ్యింది. ఇంట్లో లేనప్పుడే తాను ప్రశాంతంగా, సంతోషంగా ఉంటానని చెప్పింది. మనం శరీరానికి నిరంతరం యజమానులుగా ఉండలేమన్న ఆమె, జీవితం చాలా చిన్నదని వివరించింది. ఆ విషయం తనకు కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తోందని వెల్లడించింది. ఎప్పుడూ ఇంటికే పరిమితం కాకూడదని చెప్పింది. కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న తాను, తన కలల ఇంటిని, గెస్ట్ హౌస్, ఫామ హౌస్ లను నిర్మించుకున్నట్లు చెప్పింది. అయినప్పటికీ, ఇంట్లో ఉన్నప్పుడు కలగని ప్రశాంతత, ఆనందం బయట ఉన్నప్పుడు కలుగుతుందన్నారు.
ఈ ఏడాది కంగనా నటించి, దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఆమె మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ పాత్రలో కనిపిస్తోంది. జయప్రకాశ్ నారాయణ్‌గా అనుపమ్ ఖేర్, అటల్ బిహారీ వాజ్‌పేయిగా శ్రేయాస్ తల్పాడే, మొరార్జీ దేశాయ్‌గా అశోక్ ఛబ్రా, పుపుల్ జయకర్‌గా మహిమా చౌదరి, ఫీల్డ్ మార్షల్ సామ్ మానేక్షాగా మిలింద్ సోమన్, సంజయ్ గాంధీగా విశాక్ నాయర్ నటిస్తున్నారు. ‘ఎమర్జెన్సీ’ రోజుల నాటి వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
Read Also: ‘హనుమాన్’ను రిలీజ్ ఎందుకు వాయిదా వేయలేదంటే? అసలు విషయం చెప్పిన ప్రశాంత్ వర్మ