Ilayaraaja Biopic: ఇళయరాజా బయోపిక్ నుంచి క్రేజీ న్యూస్- స్క్రీన్ ప్లే అందించబోతున్న కమల్ హాసన్
ధనుష్, అరుణ్ మథేశ్వరన్ కాంబోలో వస్తున్న తాజాగా చిత్రం ‘ఇళయరాజా’ బయోపిక్. లోక నాయకుడు కమల్ హాసన్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించబోతున్నారు.

Kamal Haasan’s screenplay for Ilayaraaja’s biopic: తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా బయోపిక్ తెరకెక్కబోతోంది. సంగీత దిగ్గజం జీవిత ప్రయాణంతో పాటు ఆయన ఎదగుదలను ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ చిత్రంలో ఇళయరాజా పాత్రలో ధనుష్ కనిపించబోతున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ కూడా కీలక పాత్ర పోషించబోతున్నారు. ఈ సినిమాకు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ దర్శకుడు ధనుష్ తో ‘కెప్టెన్ మిల్లర్’ అనే సినిమాను తెరకెక్కించారు. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది.
ఇళయరాజా బయోపిక్ కు కమల్ స్క్రీన్ ప్లే
ఇక ఇళయరాజా బయోపిక్ కు సంబంధించి తాజాగా ప్రీ లుక్ రిలీజ్ చేశారు. ఇళయరాజా అనే టైటిల్ తో, చేతిలో బ్యాగ్‌లతో మద్రాస్‌లోకి అడుగు పెట్టే పాత్రలో ధనుష్‌ని చూపించారు. ‘ది కింగ్ ఆఫ్ మ్యూజిక్’ అని సినిమాకు ట్యాగ్ లైన్ అందించారు. ఇక ఈ వేడుకలో ఇళయరాజా, కమల్ హాసన్, ధనుష్ పాల్గొన్నారు. అయితే, కమల్ ఈ వేడకకు కేవలం గెస్టుగా హాజరు కాలేదు. ఆయన కూడా ఈ సినిమాలో భాగం అవుతున్నారు. ఈ చిత్రానికి ఆయన స్క్రిప్ట్ రాస్తున్నారు. అంతేకాదు, స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నారు. కమల్ హాసన్ కు రచయితగా, దర్శకుడిగా ఇప్పటికే మంచి గుర్తింపు ఉంది. ‘హే రామ్’ లాంటి అద్భుతమైన క్లాసిక్ ను తెరకెక్కించారు. ‘దశావతారం’తో పాటు పలు సినిమాలకు స్క్రీన్ ప్లే అందించారు. ఆయన రచనా శైలి కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడు ఆయన ఇళయరాజా బయోపిక్ కు స్క్రీన్ ప్లే అందించడంతో సినిమా మరో రేంజిలో ఉండబోతున్నట్లు అర్థం అవుతోంది.
తన బయోపిక్ కు తనే సంగీతం అందించుకుంటున్న ఇళయరాజా
సినిమాల పరంగానే కాకుడా వ్యక్తిగతంగానూ ఇళయరాజా, కమల్ హాసన్ మధ్య మంచి బాండింగ్ ఉంది. ఇద్దరి మధ్య చక్కటి ప్రేమ, గౌరవం ఉన్నాయి. కమల్ హాసన్ నటించిన ఎన్నో సినిమాలకు ఇళయరాజా సంగీతం అందించారు. ఇళయరాజా గురించి బాగా తెలిసిన కమల్ ఈ బయోపిక్ కు స్క్రీన్ ప్లే అందించడంతో కచ్చితంగా ఈ చిత్రం మరో లెవెల్ లో ఉంటుందంటున్నారు సినీ అభిమానులు. ఇక తన బయోపిక్ కు తనే సంగీతం అందివ్వబోతున్నారు ఇళయరాజా.
కమల్ హాసన్ ‘విక్రమ్’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’లో నటించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు మణిరత్నంతో కలిసి ఓ ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘థగ్ లైఫ్’ అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రంలో కమల్ మూడు పాత్రల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అటు దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ధనుష్ స్వీయ దర్శకత్వంలో ‘D50’ అనే సినిమా చేస్తున్నారు.
Read Also: ‘ఎర్త్ అవర్’ రోజు లైట్లు ఎందుకు ఆర్పేయాలి? హైదరాబాద్‌లో ఈ టైమ్‌లో లైట్స్ అన్నీ బంద్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

