Kajal Aggarwal: కొడుకు ఫోటో షేర్ చేసిన కాజల్, అందులోనూ చిన్న ట్విస్ట్
కాజల్ అగర్వాల్ తల్లయ్యాక సినిమాలకు దూరమైంది.
కాజల్ అగర్వాల్ తెలుగు ప్రేక్షకుల దృష్టిలో అందాల చందమామ. టాప్ హీరోయిన్‌గా చాలా ఏళ్లు వెండితెరపై వెలుగులీనింది. ప్రెగ్నెన్సీ వచ్చాక సినిమాల్లోంచి తప్పుకుంది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చాక కొడుకుతో చాలా బిజీగా మారిపోయింది. ఇంతవరకు కొడుకు ఫోటోలను మాత్రం బయటపెట్టలేదు. తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో కళ్ల భాగం తప్ప మిగతా ముఖమంతా కనిపిస్తోంది. తన కొడుకునే ప్రేమగా చూస్తున్న కాజల్ ఆ ఫోటోలో చూడొచ్చు. కాజల్ కొడుకు చాలా క్యూట్ గా ఉన్నాడంటూ అభిమానులు కామెంట్లు వెల్లువలా పెడుతున్నారు. తన కొడుకుకు నీల్ కిచ్లూ అని నామకరణం చేసింది. మొన్నటి వరకు పిల్లాడి ఫోటోలు బయటికి రాకుండా జాగ్రత్త పడింది కాజల్. ఇప్పుడు తానే అభిమానుల కోసం పోస్టు చేస్తోంది. చాలా మంది సెలెబ్రిటీలు పిల్లల ఫోటోలను బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. క
కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లూ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ స్కూల్ లో కలిసి చదువుకున్నారని తెలుస్తోంది. దాదాపు పదేళ్ల పాటూ ప్రేమించుకున్న వీరు పెద్ధల అంగీకారంతోనే పెళ్లి పీటలెక్కారు. గౌతమ్ డిసెర్న్ లివింగ్ అనే ఇంటీరియర్ డిజైనింగ్ స్టూడియోని నడుపుతున్నట్టు తెలుస్తోంది. బిజినెస్ లో రాణిస్తున్న వ్యక్తి అని సమాచారం. 2020, అక్టోబర్ 30న వీరిద్దరి వివాహం ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది.
View this post on Instagram
Also read: ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే ఇప్పటికీ అమ్మకే ఓటీపీ వెళుతుంది, తల్లితో అనుబంధాన్ని పంచుకున్న సాయి పల్లవి