News
News
X

Interesting Facts About Kaikala: యముడైనా, పిరికి మొగుడైనా కైకాలే - కానీ, అదొక్కటే లోటు!

టాలీవుడ్‌లో యుముడి పాత్రంటే మనకు ఠక్కున గుర్తుకొచ్చేది కైకాల సత్యనారాయణే. ఆ పాత్రలో ఆయనను తప్ప మరెవ్వరినీ ఊహించుకోలేం. అంతేకాదు, ఆయనకు ఏ పాత్ర ఇచ్చిన పరాయ ప్రవేశం చేసి మెస్మరైజ్ చేస్తారు కైకాల.

FOLLOW US: 
Share:

ముండా... అంటూ గంభీరంగా ఆయన చెప్పిన డైలాగ్ విని యముడంటే అతనే అని ప్రేక్షకలోకం ఫిక్సయిపోయింది. వేలమందిని మట్టి కరిపించే ఘటోత్కచుడు.. పసిపాప కోసం పరితపిస్తుంటే.. ఆయనతో పాటే.. ఆడియన్స్ కన్నీళ్లు పెట్టారు. నాగరాజు పగ.. నాగుపాము కంటే భయంకరమైందని భయంకరమైన విలనీ చూపెట్టినా.. కొంగు చాటు భర్తగా అనేక సినిమాల్లో అమాయక పాత్రలు వేసినా.. తనదైన రీతిలో హాస్యాన్ని పండించినా అది ఆయనకు మాత్రమే సాధ్యమైంది. 

ఆయనే నవరస నటనా సార్వభౌమ.. 
విలక్షణ పాత్రల చిరునామా.. 
కైకాల సత్యనారాయణ..
 
ఐదు తరాల నటులు.. 60 ఏళ్ల సినీ ప్రస్థానం.. 800కు పైగా సినిమాలు ఈ మూడు ఘనతలూ సొంతం చేసుకున్న ఏకైక నటుడు కైకాల. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సూపర్ స్టార్ స్టేటస్ పొందిన తొలినటుడు ఎస్వీరంగారావు. అయితే ఆయన త్వరగా కాలం చేయడంతో ఆ స్థానాన్ని దక్కించుకుంది సత్యనారాయణే. క్రూరమైన విలనిజంతో జనాలను ఏ స్థాయిలో భయపెట్టారో.. ఆర్థ్రతతో నిండిన పాత్రల్లోనూ అంతే జీవించారు. విలనిజం ద్వారా ప్రేక్షకులను బాధపడేలా చేసిన ఆయన.. అదే మంచి పాత్రలతోనూ.. వారి చేత కంటతడి పెట్టించగలిగారు. ఇది అతి కొద్దిమందికి మాత్రమే సాధ్యమయ్యే విషయం. 

యముడంటే ఆయనే.. 

నిండైన విగ్రహం.. అలంకారాలతో అతి గంభీరంగా కనిపించే యముడు.. అంత సరదాగా ఉంటాడని.. మన ఇంట్లో మనిషిగా మారిపోతాడని ఎవరైనా ఊహించారా.. స్వచ్ఛమైన తన చిరునవ్వుతో.. అద్భుతమైన తన నటనతో సాధ్యం చేసిన వాడు కైకాల. అంతకు మందు పౌరాణిక సినిమాల్లో చాలా మంది యముడి పాత్రలు పోషించారు. కానీ కైకాల ఆ క్యారెక్టర్ కే.. ఓ క్యారెక్టరిస్టిక్ తీసుకొచ్చారు. ఇంకెవరు ఎంత బాగా చేసినా ఆయన సాటికి రారు అన్నంత రీతిలో దాన్ని నిలిపారు. యముడు, ఘటోత్కచుడు వంటి పాత్రలకు చిన్న పిల్లలు సైతం కేరింతలు కొట్టేలా చేయగలిగారు అంటే.. అది ఆయనకు మాత్రమే సాధ్యమైన విద్య.

ఎన్టీఆర్ సైతం ఆశ్చర్యపోయేలా.. 

గొప్పగా నటించగలిగే వాళ్లు చాలా మంది ఉంటారు, ఉండొచ్చు. కానీ అందరికీ అన్నీ పాత్రలు నప్పవు. కానీ సత్యనారాయణ, ఎస్వీఆర్, ఎన్టీఆర్ లాంటి వాళ్లు అన్ని పాత్రలకు సరితూగగలిగే నటులు. సత్యనారాయణ మంచి అందగాడు.. స్పురద్రూపి ఏ క్యారెక్టర్ అయినా అవలీలగా పోషించగలిగే ముఖ వర్చస్సు ఉన్న వ్యక్తి. అందుకే అన్ని క్యారెక్టర్లు ఆయన ముందువాలాయి. కథానాయకుడిగానే సినిమా ప్రయాణం మొదలుపెట్టినా.. విలన్ వేషాలతో కేరీర్ కొనసాగించాల్సి వచ్చింది. కానీ ఆయనకేమో ఆల్ రౌండర్ అనిపించుకోవాలని కోరిక. అందుకే విలక్షణ పాత్రలను వేయాలని పరితపించేవారు. ఆ కోరికను తీర్చింది.. ఎన్టీఆర్ నిర్మాణ సారధ్యంలోని ‘ఉమ్మడి కుటుంబం’ సినిమా. అందులో అత్తారింట్లో నలిగిపోయే అల్లుడిగా సత్యనారాయణ చేసిన పాత్ర ఎన్టీఆర్‌నే ఆశ్చర్యపోయేలా చేసింది. క్రూరత్వం నిండిన పాత్రలతోనే జనాలకు తెలిసిన సత్యనారాయణ ఆ పాత్ర చేయలేరేమో అని, చేసినా జనం స్వీకరించరేమో అని ఎన్టీఆర్ సందేహించారు. కానీ.. అందరి అభిప్రాయాలను ఆ సినిమాతో పటాపంచలు చేశారు సత్యనారాయణ.
 
ఇక ఆ తర్వాత ఆయన్ను వెతుక్కుంటూ పాత్రలు వచ్చాయి. జానపద, పౌరాణిక, చారిత్రక , సాంఘిక చిత్రాల్లో ఆయన చేయని పాత్ర లేదు. తనకన్నా.. వెనుక ఇండస్ట్రీకి వచ్చిన నూతన్ ప్రసాద్, రావుగోపాలరావు వంటి ఆర్టిస్టులు విలన్ గా చేస్తుంటే.. వారికి అమాయకమైన కొడుకుగా కామెడీ విలన్ గా చేశారు. దటీజ్ కైకాల. ‘శారద’ సినిమాలో చెల్లెలి కోసం పరితపించిపోయే అన్నగా కైకాలను చూసి.. ఆడియన్స్ చలించిపోయారు. ఇన్నాళ్లు విలన్ గా భయపెట్టింది ఆయనేనా అని ఆశ్చర్యపోయేలా చేశారు. 

ఎన్నెన్ని పాత్రలు

తెలుగు సినిమాలు పుట్టినప్పటి నుంచి ‘చిత్తూరు నాగయ్య’ దగ్గర నుంచి.. మొన్నటి ‘మహర్షి’ సినిమా వరకూ తాతలు, తండ్రులు, మనవళ్లతో కూడా కలిపి నటించారు ఆయన. ఇప్పటి వాళ్లకి ఆయన చేసిన యముడు, ఘటోత్కచుడు పాత్రలే పరిచయం ఏమో కానీ.. సత్యనారాయణ గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. సాంఘిక పాత్రల్లో అదీ కామెడీ కలగలసిన పెద్దరికం పాత్రలు చేయడం ఆయనకు కొట్టిన పండి. ‘తాయారమ్మ- బంగారయ్య’లో కొత్త జంటల మధ్య అలకలు తీర్చే.. పెద్ద జంటగానూ, అడవిరాముడు, వేటగాడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, బొబ్బిలిపులి వంటి సినిమాల్లో భయంకరమైన విలన్ గానూ, సింహాసనం, చాణక్య చంద్రగుప్త సినిమాల్లో రాక్షస మంత్రిగానూ.. నారీ నారీ నడుమ మురారి, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు లాంటి సినిమాల్లో నోరు లేని భర్తగానూ, అన్వేషణ, అమ్మ రాజీనామా వంటి సినిమాల్లో విలక్షణ పాత్రలతోనూ.. గ్యాంగ్ లీడర్, సమరసింహారెడ్డి వంటి సినిమాల్లో కథను మలుపు తిప్పే కీలక పాత్రల్లోనూ .. ఆ మధ్య వచ్చిన మహేష్ బాబు సినిమాలో సత్తిపండుగానూ.. ఏ సినిమాలో చూసినా ఆయన ముద్ర సుస్పష్టం. అందుకే కైకాల నవరసనటనా సార్వభౌమ.

ఎన్టీఆర్ తో ప్రత్యేక అనుబంధం

ఎన్టీఆర్ కు సరిసామానమైన రూపం, పర్సనాలిటీ ఉండటంతో తొలినాళ్లలో ఆయనకే డూప్ గా పనిచేశారు. ఎన్టీఆర్ 300 సినిమాలు చేస్తే.. అందులో 107 చిత్రాల్లో సత్యనారాయణ నటించారు. ఎన్టీఆర్ పోషించిన సుయోధన, రావణాసుర వంటి పాత్రలన్నీ అద్బుతంగా చేశారు. రాముడు, కృష్ణుడిగా తెరపై కనిపించలేదు కానీ.. ఎన్టీఆర్ కు డూప్ గా ఆ పాత్రలు కూడా చేశారు. అదే ఎన్టీఆర్ ప్రోత్సాహంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారారు. ఆయన సొంత సినిమాల్లో అద్భుతమైన క్యారెక్టర్లు చేశారు. రాజకీయాల్లోనూ వెన్నంటి ఉన్నారు. 

అదొక్కటే లోటు

ఇన్ని సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించిన అంత గొప్ప నటుడుకి పద్మ అవార్డు మాత్రం రాలేదు. ఆయన తర్వాత కేరీర్ ప్రారంభించిన ఎంతో మందికి ఈ అవార్డులు వచ్చాయి. సినిమాల్లో తన తర్వాత వచ్చిన వారికి... చిన్న వారికి కూడా అవార్డులు వచ్చి.. లెజండరీ స్థాయి ఉన్న తనను గుర్తించకపోవడంపై కైకాల నొచ్చుకున్నారు కూడా.. కానీ ఆ లోటు తీరకుండానే ఆయన తెరపై నుంచి నిష్క్రమించడం బాధాకరం.

Also Read: నటుడిగా కైకాల ప్రయాణంలో మజిలీలు - సత్యనారాయణ సమగ్ర సినిమా చరిత్ర 

Published at : 23 Dec 2022 11:59 AM (IST) Tags: Kaikala Satyanarayana Kaikala Satyanarayana Death Kaikala Satyanarayana Died Kaikala Satyanarayana NTR NTR Kaikala Bond

సంబంధిత కథనాలు

మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?

మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?

Rakhi Sawant Mother Death: రాఖీ సావంత్ తల్లి జయ భేదా కన్నుమూత - ఇక ఎవరు నన్ను హగ్ చేసుకుంటారంటూ భావోద్వేగం

Rakhi Sawant Mother Death: రాఖీ సావంత్ తల్లి జయ భేదా కన్నుమూత - ఇక ఎవరు నన్ను హగ్ చేసుకుంటారంటూ భావోద్వేగం

Ajith Kumar’s AK62 Movie: అజిత్ సినిమా నుంచి దర్శకుడు విఘ్నేష్ శివన్ ఔట్? కారణం అదేనా?

Ajith Kumar’s AK62 Movie: అజిత్ సినిమా నుంచి దర్శకుడు విఘ్నేష్ శివన్ ఔట్? కారణం అదేనా?

Chiranjeevi - Ram Charan: రామ్ చరణ్ స్థానంలో నేనే ఉన్నంత గర్వంగా ఉంది: చిరంజీవి

Chiranjeevi - Ram Charan: రామ్ చరణ్ స్థానంలో నేనే ఉన్నంత గర్వంగా ఉంది: చిరంజీవి

Pawan Kalyan New Movie: పవర్ స్టార్ అభిమానులకు సూపర్ న్యూస్, పవన్ - సుజిత్‌ మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్!

Pawan Kalyan New Movie: పవర్ స్టార్ అభిమానులకు సూపర్ న్యూస్, పవన్ - సుజిత్‌ మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్!

టాప్ స్టోరీస్

Australian Open 2023: 2023ను రికార్డుతో మొదలెట్టిన ‘జోకర్’ - పదో ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం!

Australian Open 2023: 2023ను రికార్డుతో మొదలెట్టిన ‘జోకర్’ - పదో ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం!

Nellore Rural MLA: నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు ! వైసీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

Nellore Rural MLA: నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు ! వైసీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

Gujarat Junior Clerk Exam Cancel: హైదరాబాద్‌లో పేపర్ లీకేజీ కలకలం, జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ రద్దు చేసిన గుజరాత్

Gujarat Junior Clerk Exam Cancel: హైదరాబాద్‌లో పేపర్ లీకేజీ కలకలం, జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ రద్దు చేసిన గుజరాత్

BRS Parliamentary Party Meeting: బీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ - ముఖ్యంగా ఆ విషయాలపైనే ఫోకస్ !

BRS Parliamentary Party Meeting: బీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ - ముఖ్యంగా ఆ విషయాలపైనే ఫోకస్ !