Jyotika: ప్రేమకు లింగ బేధాలుండవు - నటి జ్యోతిక ఆసక్తికర వ్యాఖ్యలు
దర్శకుడు జయప్రకాశ్ రాధా కృష్ణన్ తాజా మూవీ ‘కాదల్ ఎన్‌బదు పొదు ఉడమై’. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ జ్యోతిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
‘లెన్స్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకడు జయప్రకాష్ రాధాకృష్ణన్ ప్రస్తుతం ‘కాదల్ ఎన్‌బదు పొద్దు ఉడమై’ సినిమా చేస్తున్నారు. ఇందులో లిజోమోల్, అనూష ప్రభు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్ ను జ్యోతిక, టోవినో థామస్‌తో పాటు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈ పోస్టర్‌లో లిజోమోల్, అనూష ప్రభు రొమాన్స్ చేస్తున్నట్లు కనిపించారు.
ప్రేమను మాత్రమే గౌరవిస్తూ వాలంటైన్స్ డే జరుపుకుందాం- జ్యోతిక
‘లెన్స్’తో దర్శకుడిగా అరంగేట్రం చేసిన తర్వాత, దర్శకుడు జయప్రకాష్ రాధాకృష్ణన్ 2019లో ‘ది మస్కిటో ఫిలాసఫీ’ని రూపొందించారు. అతడి తాజా సినిమా ‘కాదల్ ఎన్‌బదు పొదు ఉడమై’ ఈ సంవత్సరం థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. వాలంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ను జ్యోతి తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. "ప్రేమ అనేది రెండు స్వచ్ఛమైన హృదయాలకు సంబంధించిన విషయం, రెండు విభిన్న జెండర్ లకు సంబంధించిన విషయం కాదు. ప్రేమను మాత్రమే గౌరవిస్తూ వాలంటైన్స్ డే జరుపుకుందాం” అంటూ రాసుకొచ్చింది. అటు నటుడు నిర్మాత టోవినో థామస్ సైతం ‘ కాదల్ ఎన్‌బదు పొద్దు ఉడమై’ టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు.
First Look Poster of #KaadhalEnbadhuPodhuUdamai 💕🦋#LoveIsForAll #KEPUFirstLook
— Guna (@pro_guna) February 14, 2023
From The makers of #TheGreatIndianKitchen @jeobaby @JPtheactor @subhaskaar @nobinkurian @jose_lijomol @danivcharles @srkalesh @anuv_prabhu @srkalesh@sreesaravanandp@RajeshSaseendr1 @pro_guna pic.twitter.com/f1QEvbhpWP
‘కాదల్ ఎన్‌బదు పొద్దు ఉడమై’లో ఎవరెవరు నటిస్తున్నారంటే?
‘కాదల్ ఎన్‌బదు పొద్దు ఉడమై’ చిత్రానికి జయప్రకాష్ రాధాకృష్ణన్ రచన, దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో లిజోమోల్, రోహిణి, అనూష, దీప, వినీత్ మరియు కాలేష్ నటిస్తున్నారు. మ్యాన్‌కైండ్ సినిమాస్, నీత్స్ ప్రొడక్షన్స్, సిమెట్రీ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సినిమాటోగ్రాఫర్ శ్రీ శరవణన్, కంపోజర్ కన్నన్ నారాయణన్, ఎడిటర్ డాని చార్లెస్ టెక్నికల్ క్రూలో భాగం అయ్యారు. ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ డైరెక్టర్ జియో బేబీ ‘కాదల్ ఎన్‌బదు పొదు ఉడమై’ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
View this post on Instagram
Read Also: కన్నీటిని దిగమింగి, కెమేరా ముందుకు - అరుదైన వ్యాధులతో బాధపడుతున్న మన తారలు వీరే!