By: ABP Desam | Updated at : 15 Feb 2023 02:00 PM (IST)
Edited By: anjibabuchittimalla
Images Credit: Instagram
గత కొంత కాలంగా టాలీవుడ్ హీరోయిన్లు రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ఇబ్బందులను వెల్లడిస్తున్నారు. కన్నీటిని దిగమింగుతూనే కెమేరా ముందుకు వస్తున్నారు. అభిమానుల కోసం తమ బాధను దిగమింగుతూ తమ పాత్రలకు న్యాయం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ కష్టాన్ని చెప్పుకుని సాంత్వన పొందుతున్నారు. మరి ఏయే నటి ఎలాంటి సమస్యతో బాధపడుతున్నారో చూద్దామా.
సౌత్ టాప్ హీరోయిన్ సమంతా మయోసైటిస్ అనే కండరాల వ్యాధితో బాధపడుతోంది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయిన ఈ వ్యాధి కారణంగా, అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నడవడానికి ఉపయోగాపడే కండరాల్లో తీవ్ర సమస్యలు వస్తాయి. నెమ్మదిగా శరీరం అంతా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ విషయాన్ని 2022లో సమంత సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
‘యమ దొంగ’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మమతా మోహన్ దాస్ కు క్యాన్సర్, హాడ్కిన్స్ లింఫోమా సోకింది. ఆ తర్వాత విటిలిగో (Vitiligo) అనే చర్మ వ్యాధి అటాక్ అయ్యింది. శరీర రోగనిరోధక వ్యవస్థ మెలనోసైట్‌లపై దాడి చేసి నాశనం చేయడం వల్ల విటిలిగో ఏర్పడుతుంది. వంశపారంపర్యంగానూ సోకుతుంది. మానసిక ఆందోళన, వడదెబ్బ, రసాయానలకు గురికావడం వంటి కారణాలు కూడా విటిలిగోకి కారణమవుతాయి.
అందాల తార అనుష్కను అత్యంత అరుదైన సమస్య వేధిస్తోందట. ఒక్కసారి నవ్వడం మొదలు పెడితే సుమారు అరగంట పాటు నవ్వుతూనే ఉంటుందట. తన నవ్వును కంట్రోల్ చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతోంది. “తన దగ్గర ఎవరైన జోక్ వేసినా, నవ్వించే విషయం చెప్పినా నవ్వు పరిమితికి మించి వస్తోంది. నేను ఒక్కసారి నవ్వడం మొదలు పెడితే ఆపడం సాధ్యం కావడం లేదు. సుమారు పావు గంట నుంచి అరగంట దాకా నవ్వుతూనే ఉంటాను నవ్వును కంట్రోల్ చేయలేక చాలా సతమతం అవుతున్నాను” అని అనుష్క తన అరుదైన సమస్య గురించి వెల్లడించింది.
రేణు దేశాయ్, గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వెల్లడించింది. ''గత కొంత కాలంగా నేను పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. వాటిని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నాను. నా మాదిరిగానే ఎవరైనా బాధపడుతుంటే? వారిలో ధైర్యం నింపాలనే ఉద్దేశంతోనే ఈ పోస్టు పెడుతున్నాను. ఎవ్వరూ ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోకూడదు. ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఉండాలి. జీవితం మీద నమ్మకం అనేది ఉండాలి. అనారోగ్యానికి చికిత్స తీసుకుంటున్నాను. త్వరలోనే కోలుకుని షూటింగులకు హాజరవుతాను” అంటూ ఇన్ స్టాలో సుదీర్ఘ పోస్టు రాసుకొచ్చింది.
ఈ అందాల తార రెండు సంవత్సరాలుగా ఫైబ్రో మైయాల్జియా సమస్యతో బాధపడుతోంది. ఈ రుగ్మత కారణంగా అలసట, నిద్ర, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మానసిక స్థితిలో సమస్యలు, కండరాల నొప్పి సహా పలు ఇబ్బందులు పడుతోందట. ప్రస్తుతం ఈ సమస్య నుంచి బయటపడేందుకు కేరళలో చికిత్స తీసుకుంటోంది. తాజాగా తన చికిత్సకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నయనతార మేకప్ వేసుకున్న తర్వాత స్కిన్ అలెర్జీని ఎదుర్కొంటుంది. ఈ సమస్యల అధిగమించడానికి తన సినిమాల కోసం ప్రత్యేక మేకప్ టీమ్‌ని ఏర్పాటు చేసుకుంది.
ఈ గోవా బ్యూటీ ఇలియానా డిక్రూజ్ డైస్మోర్ఫిక్ బాడీ డిజార్డర్ అనే అరుదైన రుగ్మతతో బాధపడుతోంది. BDD లేదా బాడీ డిస్మోర్ఫియా అనేది ఒక మానసిక ఆరోగ్య పరిస్థితి. ఈ వ్యాధి ఉన్నవారు తమ వ్యక్తిత్వం, శరీరతత్వం గురించి తలచుకుంటూ కుమిలిపోతుంటారు. పదే పదే అద్దంలో చూసుకుంటూ తాను పర్‌ఫెక్ట్‌గా లేను అనుకోవడ వంటివి ప్రధాన లక్షణాలు. ఇది దాదాపు ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కొందరిలో అది తీవ్రస్థాయికి చేరి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
సోనమ్ కపూర్ – డయాబెటిస్
బాలీవుడ్ టాప్ హీరోయిన్ సోనమ్ కపూర్ డయాబెటిస్ తో బాధపడుతోంది.
Read Also: అనుష్కను వేధిస్తున్న అరుదైన వ్యాధి - ఆమె నవ్వితే షూటింగ్ ఆపేస్తారట!
Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!
Jagapathi Babu Mother House: జగపతి బాబు తల్లి సింప్లిసిటీ, కొడుకు ఎంత పెద్ద స్టారైనా చిన్న ఇంట్లోనే నివాసం - ఇదిగో వీడియో
Anni Manchi Sakunamule: 'అన్నీ మంచి శకునములే' నుంచి సీతా కళ్యాణం సాంగ్ రిలీజ్
Varun Sandesh Vithika: ఆ సమయంలో మా చేతిలో రూ.5 వేలు కూడా లేవు: వరుణ్ సందేశ్ భార్య వితిక
Manisha Koirala: రజినీకాంత్ సినిమా వల్లే అక్కడ మూవీ ఛాన్సులు పోయాయి - మనీషా కోయిరాల సంచలన వ్యాఖ్యలు
CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం
Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు
Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు
IPL 2023: ఐపీఎల్ ట్రోఫీతో కెప్టెన్ల గ్రూప్ ఫొటో! మరి రోహిత్ ఎక్కడా?