అన్వేషించండి

Ka Movie OTT: ‘క’ ఓటీటీ రిలీజ్... అసలు విషయం చెప్పేసిన మేకర్స్, పుకార్లకు చెక్

త్వరలో ‘క’ సినిమా ఓటీటీ విడుదల కాబోతుందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఇప్పట్లో ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశం లేదని వెల్లడించింది.

Ka OTT Release: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘క’. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం చక్కటి విజయాన్ని అందుకుంది. సుమారు ఏడాది గ్యాప్ తర్వాత ‘క’ మూవీతో థియేటర్లలోకి అడుగు పెట్టిన కిరణ్... కెరీర్ లో సాలిడ్ హిట్ అందుకున్నారు. తొలి షో నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ లభించింది. మౌత్ పబ్లిసిటీతో ప్రేక్షకులు మూవీని చూసేందుకు పోటెత్తుతున్నారు. తొలుత ‘క’ సినిమాకు థియేటర్స్ తక్కువగానే లభించినా... హిట్ టాక్ రావడంతో థియేటర్ల సంఖ్య నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది. సుజిత్- సందీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయన్ సారిక హీరోయిన్ గా నటించింది.

‘క’ ఓటీటీ రిలీజ్ పై నిర్మాణ సంస్థ క్లారిటీ

ఓవైపు ఈ సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండగానే, మరోవైపు ఓటీటీలో విడుదల అవుతుందంటూ ఊహాగానాలు వినిపించాయి. నవంబర్ 21 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కు వస్తుందంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణం బృందం క్లారిటీ ఇచ్చింది. “’క' మూవీ ఇప్పట్లో ఓటీటీలోకి రాదు. థియేటర్లలోనే చూడండి. త్వరలో ఓటీటీలో ఈ సినిమా విడుదల అవుతుందని వస్తున్న అసత్య వార్తలను నమ్మకండి” అని మేకర్స్ వెల్లడించారు.  

‘క’ ఓటీటీ రైట్స్ దక్కించుకున్న రెండు సంస్థలు!   

అటు ‘క’ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓటీటీ డీల్ కంప్లీట్ అయ్యింది. ఈ సినిమాను రెండు ప్రముఖ ఓటీటీ సంస్థలు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. తొలుత ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను  ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నది.  ఇందుకోసం పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించినట్లు తెలిసింది. మరోవైపు తెలుగు ఓటీటీ సంస్థ  ఈటీవీ విన్ కూడా కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ రైట్స్ కోసం సుమారు రూ. 10 కోట్లు చెల్లించినట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి గత కొద్ది కాలంగా  నిర్మాణ సంస్థలు తమ సినిమాలను పలు ఓటీటీ సంస్థలకు అమ్ముతున్నాయి. సుధీర్ బాబు హీరోగా నటించిన ‘హరోమ్ హర’ సినిమాను మేకర్స్ మూడు ఓటీటీ ఫ్లాట్ ఫారమ్స్ కు అమ్మారు. ఈ సినిమా ఆహా, అమెజాన్ ప్రైమ్ తో పాటు సన్ నెక్ట్స్ లో అందుబాటులో ఉంది. ‘క’ సినిమా రైట్స్ ను కూడా నెట్ ఫ్లిక్స్ తో పాటు ఈటీవీ విన్ దక్కించుకున్నట్లు తెలిసింది.

ఇక ‘క’ సినిమా చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్‌ టైన్‌ మెంట్స్ బ్యానర్‌ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. సుజీత్, సందీప్ జంటగా విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించారు. దీపావళి కానుకగా గత నెల(అక్టోబర్) 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల అయ్యింది.  

Read Also: కథలు అద్భుతంగా రాస్తారా... అయితే ప్రభాస్ బంఫర్ ఆఫర్ మీలాంటి టాలెంటెడ్ రైటర్స్ కోసమే

టాప్ హెడ్ లైన్స్

Devi Sri Prasad: దేవికి ఓటు వేసిన నాగార్జున... 'కింగ్ 100'కు డీఎస్పీ మ్యూజిక్ కన్ఫర్మ్
దేవికి ఓటు వేసిన నాగార్జున... 'కింగ్ 100'కు డీఎస్పీ మ్యూజిక్ కన్ఫర్మ్
Vijay Varma: తమన్నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు లైంగిక వేధింపులు... కాస్టింగ్ కౌచ్ గురించి విజయ్ వర్మ ఏమన్నాడంటే?
తమన్నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు లైంగిక వేధింపులు... కాస్టింగ్ కౌచ్ గురించి విజయ్ వర్మ ఏమన్నాడంటే?
Casting Couch: డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం
డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం
Soniya Singh: యూట్యూబ్ క్రేజ్ నుంచి విరూపాక్ష దాకా.. సోనియా సింగ్ రియల్ లైఫ్ విశేషాలు
యూట్యూబ్ క్రేజ్ నుంచి విరూపాక్ష దాకా.. సోనియా సింగ్ రియల్ లైఫ్ విశేషాలు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget