By: ABP Desam | Updated at : 03 Feb 2023 04:40 PM (IST)
కమల్ హాసన్, చిరంజీవి
చిరంజీవి... సినిమాల్లో మెగాస్టార్! 150కు పైగా సినిమాలు చేశారు. సగటు చిరంజీవి అభిమానిని కానీ వేరే ఎవరినైనా అడగండి. 'ఒరేయ్... అన్నయ్య సినిమాల్లో నీకు యాక్టింగ్ చేశాడు అనిపించే సినిమాలు ఏంటిరా?' అని! అప్పుడు వాళ్లు చెప్పే సమాధానాల్లో 'స్వయం కృషి', 'ఆపద్భాందవుడు', 'శుభలేఖ' తప్పకుండా ఉంటాయి.
కమల్ హాసన్... ప్రేక్షకులకు లోకనాయకుడు. సినిమా ప్రపంచంలో ఆయన చేసినన్ని ప్రయోగాలు ఎవరూ చేసి ఉండరు. కానీ కమల్ హాసన్ ను యాక్టర్ గా పది మెట్లు ఎక్కించిన సినిమాలంటే 'సాగర సంగమం', 'స్వాతి ముత్యం', 'శుభ సంకల్పం' పేర్లు తప్పకుండా చెబుతారు.
కమల్ హాసన్, చిరంజీవి... నటులుగా వీళ్ళిద్దరినీ రెండేసి మెట్లు ఎక్కించిన సినిమాల్లో కామన్ పాయింట్? కళాతపస్వి కె. విశ్వనాథ్. బేసిగ్గా కమల్, చిరు నటులు. కానీ, హీరోలు అన్నాక కమర్షియల్ సినిమాల్లో నటించక తప్పదు. కమర్షియల్ సినిమాలు రీచ్ ఎక్కువ ఉంటుంది. ఫలితంగా వాళ్ళకంటూ ఓ ఫ్యాన్ బేస్ ఏర్పడిపోతుంది. దాన్ని వెంటనే ఇమేజ్. మళ్లీ నటనకు ఆస్కారమున్న పాత్రల్లో చేయాలంటే ఎందుకో తెలియని జంకు. అభిమానులు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా అని. అతి కొద్ది మంది డైరెక్టర్లు మాత్రమే ఈ ఫార్మూలాను చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయగలరు. కె. విశ్వనాథ్ అలాంటి అరుదైన డైరెక్టర్. అందుకే చిరంజీవి, కమల్ హాసన్ సూపర్ స్టార్లు అయినా ఆయన సినిమాల్లో మాత్రం వాళ్లు జస్ట్ నటులు మాత్రమే. ఆకలి తీరేలా నటించారు వాళ్ల సినిమాల్లో.
చిరంజీవి విషయానికి వస్తే 'స్వయం కృషి'లో ఓ చెప్పులు కుట్టుకునే వాడి పాత్ర. కృషితో నాస్తి దుర్భిక్షం అనే మాటను నమ్మితే ఓ మనిషి ఎంత గొప్ప స్థానానికి చేరుకోవచ్చనే దానికి ఉదాహరణ. బహుశా ఇలాంటి లైన్ చెబితే ఇమేజ్ ఉన్న ఏ హీరో చేయడు. కానీ చిరంజీవిని ఒప్పించారు కే విశ్వనాథ్ అంతే అందంగా ఉంటుంది ఆ సినిమా. ఆపద్భాందవుడు చిరంజీవిలోని ఓ ఎమోషనల్ నటుడికి ఓ బెంచ్ మార్క్. అసలు ఆ బీచ్ ఒడ్డున ఓ శివలింగాన్ని ఇసుకతో తయారు చేసుకుని చిరంజీవి శివ దూషణ చేసే సీన్ అయితే తెలుగు సినిమా చరిత్రలోనే అతిగొప్ప సన్నివేశాల్లో ఒకటి. శుభలేఖలో చిరంజీవిది వెయిటర్ పాత్ర. వరకట్నం చుట్టూ తిరిగే ఆ సినిమా చిరంజీవికి నటుడిగా తొలిఫిలింఫేర్ ను తీసుకువచ్చింది. అసలు అప్పటికే అంతటి ఇమేజ్ ఉన్న చిరంజీవి లాంటి యాక్టర్ తో ఇన్ని రిస్కీ ఫిల్మ్స్ చేసి కూడా అన్నింటినీ సూపర్ హిట్ గా నిలిపిన ఘనత కె విశ్వనాథ్ ది.
Also Read : సినిమాల్లో సంస్కృతికి టార్చ్ బేరర్ - విశ్వనాథ్ అంటే సాహసాలు కూడా!
కమల్ హాసన్ విషయానికి వస్తే 'సాగర సంగమం'. డ్యాన్సర్ అవుదామనుకుని కాలేక పేదరికం ఓ వైపు ప్రేమించిన అమ్మాయి దూరమై... తన భర్తనుంచి తనను వేరు చేయలేకు... వివాహ వ్యవస్థ మీద గౌరవంతో తాగుబోతుగా మారిన డ్యాన్సర్ కథ. ఇన్ని వేరియేషన్స్ ఒకే కథలో చూపించిన కమల్ హాసన్ ను... వర్షంలో బావి మీద డ్యాన్స్ వేసిన కమల్ హాసన్ ను నటనను మరిచిపోగలమా? 'శుభ సంకల్పం' ఓ మత్య్సకారుడి పాత్రలో కమల్ ఒదిగిపోయిన తీరును గుర్తు చేసుకోకుండా ఉండగలమా? ఈ సినిమాతోనే విశ్వనాథ్ నటుడిగానూ మారారు. 'స్వాతి ముత్యం' గురించి ఏమని చెప్పుకోవాలి. ఓ ఆటిస్టిక్ లక్షణాలున్న యువకుడి పాత్రలో కమల్ హాసన్ యాక్టింగ్ నభూతో న భవిష్యతి.
కమల్ హాసన్, చిరంజీవి హీరోలుగా విశ్వనాథ్ తీసిన సినిమాల్లో వాళ్ళ క్యారెక్టర్లు గమనించారా? చెప్పులు కుట్టుకునే వాడిలా.... పని వాడిలా... తాగుబోతులా... ఆటిస్టిక్ లక్షణాలున్న వాడిగా... మత్య్సకారుడిగా... అసలు ఏ పాత్ర చూసినా ఇమేజే లేదు. చిరంజీవి, కమల్ హాసన్... ఇద్దరు లెజెండ్స్! ప్రేక్షకులకు సూపర్ స్టార్స్! విశ్వనాథ్ సినిమాల్లో మాత్రం వాళ్ళు నటులు... అంతే!
Also Read : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక
Director Pradeep Died: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం - ప్రముఖ దర్శకుడు మృతి
OTT: 'మీర్జాపూర్' to 'ఫ్యామిలీ మ్యాన్', సీజన్-3తో తిరిగొస్తున్న 10 పాపులర్ వెబ్ సిరీసులు ఇవే
Vishnu VS Manoj: మంచు మనోజ్, విష్ణు మధ్య విభేదాలు - ఫేస్బుక్ పోస్ట్‌తో ఇంటి గుట్టు బయటకు
Hero Srikanth: ఇంట్లో చెప్పకుండా చెన్నై పారిపోయా, ఆ నాలుగు రోజులు నరకం చూశా: హీరో శ్రీకాంత్
Actor Ajith Father Died : కోలీవుడ్ హీరో అజిత్ ఇంట్లో విషాదం - హీరో తండ్రి మృతి
TSPSC Paper Leak: ఉదాసీనతే కొంప ముంచిందా? విధులు నిర్వహిస్తూనే పరీక్షలకు హాజరైన కమిషన్ ఉద్యోగులు! అయినా నో రెస్పాన్స్!
300కార్లతో ర్యాలీ- టీడీపీలోకి వెళ్లే సమయంలో కోటంరెడ్డి బలప్రదర్శన
దర్యాప్తు సంస్థల దాడులను నిరసిస్తూ ప్రతిపక్షాల పిటిషన్, విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
పేపర్ లీకేజీపై గవర్నర్ ఫోకస్ - పూర్తి వివరాలు ఇవ్వాలని సీఎస్, డీజీపీకి లేఖ