Tollywood: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించబోయే సినిమాలివే!
ఈ వారం మరికొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం!
గత వారం 'పక్కా కమర్షియల్' సినిమా థియేటర్లలో సందడి చేయగా.. ఈ వారం మరికొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం!
హ్యాపీ బర్త్ డే: నటి లావణ్యా త్రిపాఠి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న సినిమా 'హ్యాపీ బర్త్ డే'. 'మత్తు వదలరా'తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న దర్శకుడు రితేష్ రాణా రూపొందిస్తోన్న రెండో సినిమా ఇది. నరేష్ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. జూలై 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
View this post on Instagram
కడువా: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన లేటెస్ట్ సినిమా 'కడువా'. ఈ సినిమాను జూలై 7న విడుదల చేయనున్నట్టు పృథ్వీరాజ్ సుకుమారన్ సోషల్ మీడియాలో వెల్లడించారు. మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Gear UPP to witness the 𝐌𝐚𝐬𝐬 #కడువా in theatres from "𝐉𝐮𝐥𝐲 𝟕𝐭𝐡"
— Prithviraj Sukumaran (@PrithviOfficial) June 28, 2022
A #ShajiKailas film 🐅
@iamsamyuktha_ @JxBe @vivekoberoi @magicframes2011 @PrithvirajProd @Poffactio @urstanaysuriya @UrsVamsiShekar#kaduva pic.twitter.com/F3L2d0cVqU
మాయోన్: ప్రముఖ నటుడు సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ హీరోగా యువ దర్శకుడు కిషోర్ దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్ఠాత్మక చిత్రం 'మాయోన్'. ఈ సినిమా హక్కులను మూవీమ్యాక్స్ అధినేత ప్రముఖ నిర్మాత మామిడాల శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలలో జూలై 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మా నాన్న నక్సలైట్: చదలవాడ బ్రదర్స్ సమర్పణలో అనురాధ ఫిలిమ్స్ డివిజన్ పతాకం పై పీ. సునీల్ కుమార్ రెడ్డి దర్శకుడిగా చదలవాడ శ్రీనివాస్ నిర్మించిన 'మా నాన్న నక్సలైట్' సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై 8న విడుదలకు సిద్ధంగా ఉంది. తొంభైవ దశకంలో ని సామాజిక పరిస్థితుల నేపథ్యంలో సాగే ఒక నక్సలైట్ తండ్రి కథ.
ఓటీటీ రిలీజెస్:
విక్రమ్: లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా నటించడంతో పాటు నిర్మాణంలో పాలు పంచుకున్న సినిమా 'విక్రమ్'. జూన్ 3న థియేటర్లలో విడుదల అయ్యింది. ఇప్పుడీ ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. జూలై 8న 'విక్రమ్' డిజిటల్ రిలీజ్‌కు ప్లాన్ చేశామని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ తెలిపింది. తెలుగు, తమిళ భాషల్లో ఆ రోజు నుంచి 'విక్రమ్' సినిమా వీక్షకులకు అందుబాటులోకి రానుంది.
View this post on Instagram
మోడ్రన్ లవ్ హైదరాబాద్: రేవతి, నిత్యా మీనన్ (Nithya Menon), ఆది పినిశెట్టి, రీతూ వర్మ, 'బిగ్ బాస్' అభిజిత్ (Bigg Boss Abhijeet), మాళవిక నాయర్ (Malavika Nair), సుహాసిని మణిరత్నం, నరేష్ అగస్త్య, ఉల్కా గుప్తా, నరేష్, కోమలీ ప్రసాద్ ప్రధాన తారలుగా రూపొందిన వెబ్ సిరీస్ 'మోడ్రన్ లవ్ హైదరాబాద్'. మొత్తం ఆరు ఎపిసోడ్స్ తో ఈ సిరీస్ ను రిలీజ్ చేయబోతున్నారు. నగేష్ కుకునూర్, వెంకటేష్ మహా, ఉదయ్ గుర్రాల, దేవికా బహుధనం దర్శకత్వం వహించారు. జూలై 8 నుంచి 'మోడ్రన్ లవ్ హైదరాబాద్' స్ట్రీమింగ్ అవుతుందని అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఇప్పటికే వెల్లడించింది.
View this post on Instagram
అంటే సుందరానికి: నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ సినిమా 'అంటే సుందరానికి'. జూన్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ లో జూలై 10 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు.
z
View this post on Instagram
కాఫీ విత్ కరణ్ 7: పాపులర్ టీవీ షో 'కాఫీ విత్ కరణ్' సీజన్ 7 జూలై7 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది.
View this post on Instagram