అన్వేషించండి

Jr NTR Lakshmi Pranathi : ప్రణతీ సమేత ఎన్టీఆర్ - అమెరికన్ రెస్టారెంటులో ఓ ప్రేమ కౌగిలింత 

NTR Hugs Pranathi : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. ఫ్యామిలీతో కలిసి వెళ్ళారు. అక్కడ ఒక రెస్టారెంటులో భార్యకు ప్రేమతో హగ్ ఇచ్చిన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) అమెరికాలో ఉన్నారు. ఈ నెల రెండవ శుక్రవారంలో భార్య ప్రణతీ, పిల్లలతో కలిసి ట్రిప్ వేశారు. కొరటాల శివ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి ముందు ఫ్యామిలీతో లాంగ్ టూర్ ప్లాన్ చేశారు. మళ్ళీ సినిమా మొదలైతే షూటింగులతో సరిపోతుందని భావించారు ఏమో!?

ప్రణతీకి ప్రేమ కౌగిలింత!
అమెరికా నుంచి ఎన్టీఆర్ ఓ ఫోటో షేర్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఆ ఫొటోలో శ్రీమతి ప్రణతీతో ఉన్నారు. ఒక రెస్టారెంటులో చాలా మంది మధ్యలో ప్రేమగా కౌగిలించుకున్న ఫోటో అది. దానికి మూడు రెడ్ హార్ట్ లవ్ సింబల్ ఎమోజీలు పోస్ట్ చేశారు. ఫోటో కొంచెం క్లారిటీగా లేదు గానీ... అందులో ఎన్టీఆర్ ప్రేమ మాత్రం క్లారిటీగా కనబడుతోంది.
నెల రోజులు అమెరికాలో! 

NTR New Year Celebrations :  ఎన్టీఆర్ ఫ్యామిలీ అమెరికా ట్రిప్ నెల రోజులు ఉంటుందని సన్నిహిత వర్గాలు తెలిపారు. కొత్త ఏడాదికి అక్కడే ఆయన వెల్కమ్ చెప్పనున్నారు. అలాగే, అమెరికాలో క్రిస్మస్ వేడుకలను వీక్షించనున్నారు. మధ్యలో కొంత మంది బంధువులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్, అభిమానులను ఎన్టీఆర్ కలిసి అవకాశం ఉందట. ఇటీవల రాజమౌళి అమెరికా వెళ్ళారు. చికాగోలో 'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ నామినేషన్స్ కోసం ప్రచారం చేశారు. మరి, ఎన్టీఆర్ టూర్ ప్లానింగులో అటువంటిది ఉందో? లేదో? తెలియాలి. 

Also Read : ఏందిది నారప్ప... 'అవతార్ 2' కథ వెంకటేష్ 'నారప్ప'లా ఉందని చెబుతున్నారేంటి?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jr NTR (@jrntr)

సంక్రాంతికి ముందు ఇండియాకు!      
సంక్రాంతికి ముందు ఎన్టీఆర్ ఇండియా రానున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి తర్వాత, జనవరి సెకండాఫ్‌లో సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు. 

ఎన్టీఆర్ అభిమానులతో పాటు ప్రేక్షకులను మెప్పించేలా కొరటాల శివ చాలా పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశారట. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై కొరటాల శివ సన్నిహిత మిత్రుడు మిక్కినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్న చిత్రమిది. దీనికి యువ సంగీత సంచలన అనిరుధ్  రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.

Also Read : మినీ సిరీస్ రివ్యూ : నెట్‌ఫ్లిక్స్‌లో బెంగళూరు కామపిశాచి ఉమేష్ రెడ్డి డాక్యుమెంటరీ

ఎన్టీఆర్ 30వ చిత్రమిది. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగులో జరుగుతున్నాయి. దీనికి 'దేవర' టైటిల్ ఖరారు చేసినట్లు ఆ మధ్య సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అందులో నిజం లేదని ఎన్టీఆర్ 30 యూనిట్ వర్గాలు అప్పుడు కన్ఫర్మ్ చేశాయి. 

హీరోయిన్ ఎవరు?
ఎన్టీఆర్ సినిమా హీరోయిన్ విషయంలో కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ ఆలియా భట్‌ను తీసుకోవాలని ప్లాన్ చేశారు. దర్శకుడు కొరటాల శివ ఆమెకు కథ కూడా వివరించారు. అయితే... ఆలియా ప్రెగ్నెంట్ కావడంతో ఆమె నటించే అవకాశాలు లేవు. ఈ మధ్య అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ పేరు కూడా వినిపించింది. ఆమె ఒక ఆప్షన్. ఎన్టీఆర్ సినిమా చేయడానికి తాను కూడా ఆసక్తిగా ఉన్నట్లు 'మిలి' ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన జాన్వీ చెప్పారు. ఆమెతో పాటు 'సీతా రామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్ పేరు కూడా వినబడుతోంది. చివరకు, ఎవరిని ఫైనలైజ్ చేస్తారో చూడాలి.

'ఆర్ఆర్ఆర్' విడుదల తర్వాత పాన్ ఇండియా మాత్రమే కాదు... జపాన్, వెస్ట్రన్ కంట్రీస్‌లో కూడా ఎన్టీఆర్ పాపులర్ అయ్యారు. ఆయన్ను అభిమానించే ప్రేక్షకులు పెరిగారు. అందరినీ దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ సోదరుడు, హీరో నందమూరి కల్యాణ్ రామ్, కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని నిర్మించనున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. అన్ని భాషలకు పరిచయమైన నటీనటులు ఎక్కువ మంది సినిమాలో ఉండనున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget