NTR30 Launch Date : కొరటాల శివ సినిమాకు ఎన్టీఆర్ కొబ్బరికాయ కొట్టేది ఆ రోజే
NTR30 Pooja Ceremony : యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కలయికలో రూపొందుతున్న తాజా సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఓ గుడ్ న్యూస్. ఆ సినిమా పూజతో ఏ రోజు మొదలు కానుందంటే...
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR Jr), దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) ది సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్. 'ఆర్ఆర్ఆర్' లాంటి పాన్ ఇండియా, వరల్డ్ సక్సెస్ తర్వాత తనకు రచయితగా 'బృందావనం', దర్శకుడిగా 'జనతా గ్యారేజ్' వంటి విజయవంతమైన సినిమాలు అందించిన కొరటాల శివతో ఆయన సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే...
ఫిబ్రవరి 24న పూజ!
ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా ఫిబ్రవరి 24న లాంఛనంగా ప్రారంభం కానుందట. ఆ రోజు హైదరాబాదులోని ప్రముఖ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో సినిమాను స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారట. దానికి సినిమా ఇండస్ట్రీలో కొందరు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.
మార్చిలో చిత్రీకరణ మొదలు...
వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల!
ఎన్టీఆర్ 30వ చిత్రమిది. అందుకని, ఎన్టీఆర్ 30గా వ్యవహరిస్తున్నారు. మార్చిలో సెట్స్ మీదకు వెళ్ళనుంది. మార్చి 20న రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తామని ఎన్టీఆర్ స్వయంగా 'అమిగోస్' ప్రీ రిలీజ్ వేడుకలో తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆలోపు అప్డేట్స్... అప్డేట్స్ అంటూ దర్శక నిర్మాతలపై ఒత్తిడి తీసుకు రావద్దని కూడా అభిమానులకు ఎన్టీఆర్ క్లాస్ పీకారు. యాంకర్ సుమ కనకాల అప్డేట్ అడిగినప్పుడు ఎన్టీఆర్ సీరియస్ అయ్యారు కూడా. అది పక్కన పెడితే... ఇప్పుడీ సినిమా కథా నేపథ్యం గురించైనా ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది.
Also Read : ఎక్కడ చూసినా రామ్ చరణే - ఒక్కటీ మిస్ కావడం లేదుగా!
ఈ సినిమా ఓ కల్పిత దీవి, పోర్టు నేపథ్యంలో తెరకెక్కుతోందట. కథా నేపథ్యం ఈ ట్వంటీయెత్ సెంచరీ కాదని సమాచారం అందుతోంది. సెమీ పీరియడ్ బ్యాక్ డ్రాప్ సెలెక్ట్ చేశారట కొరటాల శివ. హైద్రాబాదులో ఈ సినిమా కోసం భారీ సెట్ వేస్తున్నారు. భాగ్య నగరంలో కొంత... ఆ తర్వాత విశాఖ, గోవా ఏరియాల్లో మరి కొంత షూటింగ్ చేయాలని ప్లాన్ చేశారట. వీఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ ఉంటుందని, సీజీ అవసరం అయ్యే సన్నివేశాలను ముందు షూట్ చేసి విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలకు ఇవ్వాలని ప్లాన్ చేశారట.
Also Read : ఇండియాలో 'యాంట్ మ్యాన్ 3' అడ్వాన్స్ బుకింగ్స్ - 'అల' హిందీ రీమేక్‌తో కంపేర్ చేస్తే...
ఆల్రెడీ విడుదల చేసిన సినిమా అనౌన్స్‌మెంట్ టీజర్ ప్రేక్షకుల అందరి దృష్టిని ఆకర్షించింది. ''అప్పుడప్పుడూ ధైర్యానికి కూడా తెలియదు. అవసరానికి మించి తను ఉండకూడదని! అప్పుడు భయానికి తెలియాలి... తాను రావాల్సిన సమయం వచ్చిందని! వస్తున్నా'' అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాలో కథానాయికగా అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, ప్రతినాయకుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ లేదా విక్రమ్ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, చిత్ర బృందం అధికారికంగా ఏ విషయం చెప్పలేదు.
నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్న చిత్రమిది. దీనికి యువ సంగీత సంచలన అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్ : రత్నవేలు.