Ram Charan : ఎక్కడ చూసినా రామ్ చరణే - ఒక్కటీ మిస్ కావడం లేదుగా!
సచిన్ టెండ్కూలర్, ఆనంద్ మహీంద్రాతో ఒక రోజు... అభిమానులతో మరో రోజు... షూటింగులో ఇంకో రోజు... ఎక్కడా చూసినా రామ్ చరణే కనిపిస్తున్నారు.
సచిన్ టెండ్కూలర్, ఆనంద్ మహీంద్రాతో ఒక రోజు... హైదరాబాదులో జరిగిన ఫార్ములా ఈ రేసింగ్ దగ్గర మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సందడి చేశారు. మరొక రోజు ఎక్కడ అంటే? అభిమానులతో ముచ్చటిస్తూ కనిపించారు. ఫాన్స్ కోసం స్పెషల్ ఫోటోషూట్ చేశారు. మళ్ళీ ఎక్కడ? అంటే... రాజమండ్రి, సింహాచలం అని కబురు వినిబడుతుంది.
నాలుగు ఐదు రోజులుగా ఎక్కడ చూసినా కళ్ళ ముందు మగధీరుడు రామ్ చరణే కనిపిస్తున్నారు. అసలు ఆయన ఒక్క ఈవెంట్ కూడా మిస్ కావడం లేదు. అలాగని, ఖాళీగా లేరు. కేవలం పబ్లిక్ అప్పియరెన్స్ మాత్రమే ఇవ్వడం లేదు. ఒక వైపు మన ముందుకు వస్తూనే... మరో వైపు షూటింగ్ కూడా చేస్తున్నారు. అవును... ఇప్పుడు రామ్ చరణ్ షూటింగ్ చేస్తున్నారు.
ఒక్క సాంగ్ కోసం...
ఎన్ని రియల్ ప్లేసులకో!
సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్, లెజెండరీ ఫిల్మ్ మేకర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందనే. ప్రస్తుతం ఈ సినిమా కోసం ఓ సాంగ్ చేస్తున్నారు. రోజుకో ఏరియాలో షూటింగ్ చేస్తూ అసలు క్షణం తీరిక లేకుండా షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు శంకర్.
తొలుత కర్నూలులో, రెండు రోజుల క్రితం హైదరాబాదులో, మళ్లీ విశాఖపట్నంలో, సింహాచలంలో.... ఇలా ఎక్కడ చూసినా ఏ ఊరిలో చూసినా రామ్ చరణ్ సినిమా షూటింగే సినిమా కనిపిస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ లేకుండా రియల్ లొకేషన్స్‌లో షూట్ చేస్తుండటం విశేషం. ఒకవేళ హీరో, దర్శకుడు కోరుకుంటే... సెట్స్ వేసి లేదంటే గ్రీన్ మ్యాట్‌లో షూటింగ్ చేయవచ్చు. కానీ, అలా చేయడం లేదు. అన్నీ రియల్ లొకేషన్స్‌లో తీస్తున్నారు. గతంలోనూ ఆ ఏరియాల్లో కొన్ని షూట్ చేశారు.
Also Read : 'అవెంజర్స్', 'యాంట్ మ్యాన్' విలన్ జోనాథన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే
ఐఏఎస్ అధికారిగా...
ముఖ్యమంత్రి అభ్యర్థి!
శంకర్ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా కనిపించనున్నారు. అభ్యుదయం పార్టీ సీయం క్యాండిడేట్ చరణ్. రాజమండ్రి, విశాఖలో ఆ సీన్స్ తీసినప్పుడు విజువల్స్ లీక్ అయ్యాయి. ఫ్లాష్‌బ్యాక్ కాకుండా ప్రజెంట్‌కు వస్తే... ఐఏఎస్ అధికారిగా కనిపిస్తారు. తండ్రీ కొడుకులుగా రెండు క్యారెక్టర్లు ఉంటాయని టాక్.
అభ్యుదయం పార్టీ కోసం చరణ్ ప్రచారం చేసే సన్నివేశాలు పాటలో రానున్నాయి. ఆ సాంగ్ షూటింగే ఇప్పుడు జరుగుతోంది. అభ్యుదయం పార్టీ పేరుతో చార్మినార్ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభ సెట్స్ విజువల్స్, రామ్ చరణ్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విశాఖ గీతం కాలేజీలో యంగ్ లుక్ లో ఉన్న రామ్ చరణ్ కోసం ప్రత్యేకంగా హెలికాఫ్టర్ ను తెప్పించారు. యంగ్ లుక్ లో ఉన్న రామ్ చరణ్ ఐఏఎస్ అధికారి కే రామ్ నందన్ అని... ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సాంగ్ కోసం హెలికాప్టర్ తప్పించినట్లు మరో టాక్.
Also Read : ఆస్కార్ గడ్డపై తెలుగు బిడ్డలు - ఒకే వరుసలో స్టీవెన్ స్పీల్‌బర్గ్, చంద్రబోస్
ఈ సినిమాలో కియారా అడ్వాణీ (Kiara Advani) ఓ కథానాయిక. మరో కథానాయికగా తెలుగమ్మాయి అంజలి నటిస్తున్నారు. ఆమె ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో చరణ్ భార్యగా కనిపించనున్నారు. శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా, సునీల్, 'వెన్నెల' కిషోర్, ప్రియదర్శి, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్' రాజు, శిరీశ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు.