By: ABP Desam | Updated at : 05 Jun 2023 12:20 PM (IST)
ఆది పురుష్ (Image Credits: Adi Purush/Twitter)
Adi Purush : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మైథలాజికల్ మూవీ 'ఆది పురుష్' రిలీజ్ కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఇప్పుడు సినీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 6న సాయంత్రం 5గంటలకు ప్రారంభం కానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో అప్ డేట్ తెగ వైరల్ అవుతోంది. ఈ కార్యక్రమానికి చినజీయర్ స్వామీజీ గెస్ట్ గా రాబోతున్నారు. ఆయనతో పాటు చిన జీయర్ భక్తులు కూడా పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారని సమాచారం.
అత్యంత గ్రాండ్ గా జరగనున్న 'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలోని రీ వెంకటేశ్వర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో జరగనుండగా.. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు తెలుస్తోంది. అయితే చాలా మందికి టికెట్లు కూడా ఇచ్చారని ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో ఓ పక్క ప్రభాస్ ఫ్యాన్స్, మరో పక్క చిన జీయర్ భక్తులు.. ఈవెంట్ కు హాజరై మహా సముద్రాన్ని తలపించేలా గ్రౌండ్ నిండిపోతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తిరుపతిలోనే ఎందుకు ఏర్పాటు చేశారన్న విషయంపై చర్చ సాగుతోంది. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా పార్ట్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా తిరుపతిలోని ఎస్వీ గ్రౌండ్స్ లోన నిర్వహించారు. ఆ తర్వాత ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను ఫాల్ అవుతూ ఆది పురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా అక్కడే నిర్వహిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మరి ఈ సెంటిమెంట్ ఆది పురుష్ కు కలిసొస్తుందా, లేదా అనేది తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.
ఇక ఈ ఈవెంట్ కు ఆర్ఆర్ఆర్ సృష్టికర్త ఎస్ఎస్ రాజమౌళి కూడా హాజరు కానున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. ఈ వేడుకలో దాదాపు 200 మంది సింగర్స్, 200 మంది డ్యాన్సర్స్ ప్రదర్శన ఇవ్వబోతున్నట్లుగా సమాచారం. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే కనివినీ ఎరుగని రీతిలో ఈ వేడుక ఉండనుందని తెలుస్తోంది.
కాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలై భారీ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈ మూవీపై అన్ని వర్గాల్ల ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే సాహో, రాధే శ్యామ్ వంటి వరుస ఫ్లాపులతో నిరాశ పర్చిన ప్రభాస్.. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను అలరిస్తారని, మంచి విజయం సాధిస్తారని ఆయన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. రాముని పాత్రలో కనిపించనుండగా, హీరోయిన్ కృతి సనన్ సీతగా కనిపించనుంది. జూన్ 16న పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది.
Read Also : త్రిషాకు తిరుగేలేదు - పెద్ద హీరోల పక్కన వరుస అవకాశాలు, ఆ ఒక్క సినిమాతో మారిన దశ!
King of Kotha: ఎట్టకేలకు ‘కింగ్ ఆఫ్ కోత’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ అంటే?
Sundeep Kishan New Movie : పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సందీప్ కిషన్ కొత్త సినిమా - డైరెక్టర్ ఎవరంటే?
The Great Indian Suicide : ఆహాలో 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' - హెబ్బా పటేల్ సినిమా ఎక్స్క్లూజివ్ రిలీజ్!
Chandramukhi 2: ‘చంద్రముఖి 2‘ విడుదలకు ముందు రజనీకాంత్ ఆశీర్వాదం తీసుకున్న రాఘవా లారెన్స్
Prema Entha Madhuram September 26th: ఆర్య సహాయంతో ఉట్టిని కొట్టిన అక్కి - అనుని చూసిన ఆర్య!
Chandrababu News: చంద్రబాబు పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా, సెలవులో ఏసీబీ కోర్టు జడ్జి
Telangana Cabinet: రెండు మూడు రోజుల్లో తెలంగాణ కేబినెట్ భేటీ, ప్రధాన అజెండాలు ఇవే!
Sreeleela Rashmika : మళ్ళీ విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా - ఆ సినిమా నుంచి శ్రీ లీల అవుట్?
Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం, ఆస్పత్రికి తరలింపు
/body>