Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!

మొన్నామధ్య తన కూతురు బాయ్ ఫ్రెండ్ తో దుబాయ్ కి వెళ్లిందని తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు జీవితా రాజశేఖర్.

FOLLOW US: 
టాలీవుడ్ లో నటిగా, దర్శకురాలిగా పలు సినిమాలు చేసిన జీవితా రాజశేఖర్.. తన భర్త ప్రధాన పాత్రలో 'శేఖర్' అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాను మే 20న విడుదల చేయబోతున్నారు. దీంతో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్ లో జీవిత చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. తమ కులాన్ని కించపరిచిందంటూ ఓ వర్గం ఆమెపై ఫైర్ అవ్వడంతో.. బహిరంగంగా క్షమాపణలు చెప్పారామె. 
 
తను ఒకలా చెబితే మరో విధంగా అర్ధం చేసుకున్నారని.. ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించమని కోరారు. ఇదే సమయంలో తన కుటుంబంపై వస్తోన్న వార్తలపై స్పందించారు. తన మీద వచ్చినన్ని వార్తలు వేరేవాళ్ల మీద రావేమోనని అన్నారు. మొన్నామధ్య తన కూతురు బాయ్ ఫ్రెండ్ తో దుబాయ్ కి వెళ్లిందని తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఒకసారి శివాత్మిక అంటారు, ఇంకోసారి శివానీ ప్రియుడితో పారిపోయిందని రాస్తారని ఫైర్ అయ్యారు. 
 
తీరా వార్త ఓపెన్ చేసి చూస్తే.. అందులో రాసున్నదానికి టైటిల్ కి అసలు సంబంధం ఉండదని అన్నారు. తమ కుటుంబం మొత్తం కలిసి దుబాయ్ కి వెళ్లామని.. దానికే ప్రియుడితో దుబాయ్‌కు లేచిపోయారని వార్తలు రాశారని.. ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తే ఎంతో మంది జీవితాలు ప్రభావితం అవుతాయని అన్నారు. 'గరుడ వేగ' సినిమా వివాదం కోర్టులో ఉందని.. అక్కడ తేలకముందే ఏదేదో రాస్తున్నారని అన్నారు. నిజంగా తప్పు చేశామంటే రోడ్డు మీద నిలబెట్టి కొట్టండి.. ఎవరూ కాదనం.. కానీ నిజాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేయొద్దంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
View this post on Instagram
 
A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1)

Published at : 19 May 2022 01:44 PM (IST) Tags: Jeevitha Rajasekhar Shivathmika Rajasekhar Shivani Rajasekhar Shekar Movie

సంబంధిత కథనాలు

Karthi First Look - PS 1: రాజ్యం లేని చోళ యువరాజు - వంతియతేవన్ వచ్చాడోచ్

Karthi First Look - PS 1: రాజ్యం లేని చోళ యువరాజు - వంతియతేవన్ వచ్చాడోచ్

Nandamuri Kalyan Ram New Movie: గన్స్ అండ్ యాక్షన్ - కళ్యాణ్ రామ్ కొత్త ఫిల్మ్

Nandamuri Kalyan Ram New Movie: గన్స్ అండ్ యాక్షన్ - కళ్యాణ్ రామ్ కొత్త ఫిల్మ్

Devatha జులై 5 ఎపిసోడ్: దేవుడమ్మకి రుక్మిణి వాయనం, రుక్మిణి ఫోన్ ట్యాప్ చేసిన మాధవ

Devatha జులై 5 ఎపిసోడ్: దేవుడమ్మకి రుక్మిణి  వాయనం, రుక్మిణి  ఫోన్ ట్యాప్  చేసిన మాధవ

Janaki Kalaganaledu జులై 5 ఎపిసోడ్: గోవిందరాజుల పరిస్థితి విషమం, ఆందోళనలో జ్ఞానంబ- జానకిని ఇరికించిన మల్లిక

Janaki Kalaganaledu జులై 5 ఎపిసోడ్: గోవిందరాజుల పరిస్థితి విషమం, ఆందోళనలో జ్ఞానంబ- జానకిని ఇరికించిన మల్లిక

Narayana Murthy: పీపుల్స్ స్టార్ నారాయణ మూర్తికి మాతృవియోగం

Narayana Murthy: పీపుల్స్ స్టార్ నారాయణ మూర్తికి మాతృవియోగం

టాప్ స్టోరీస్

Teegala Krishna Reddy: మంత్రి సబిత - తీగల కృష్ణారెడ్డి మధ్య ముదిరిన వార్! సంచలన వ్యాఖ్యలు, ఇవి అందుకు సంకేతమా?

Teegala Krishna Reddy: మంత్రి సబిత - తీగల కృష్ణారెడ్డి మధ్య ముదిరిన వార్! సంచలన వ్యాఖ్యలు, ఇవి అందుకు సంకేతమా?

MLA Kotamreddy Protest: మురికి కాల్వలో దిగి YSRCP ఎమ్మెల్యే వింత నిరసన - వద్దని వేడుకుంటున్న ప్రజలు

MLA Kotamreddy Protest: మురికి కాల్వలో దిగి YSRCP ఎమ్మెల్యే వింత నిరసన - వద్దని వేడుకుంటున్న ప్రజలు

Tigers Roaming In AP: పులి ఉంది జాగ్రత్త, ప్రజలను అలర్ట్ చేసిన ఏపీ అటవీ శాఖ - ఈ సూచనలు పాటిస్తే బెటర్

Tigers Roaming In AP: పులి ఉంది జాగ్రత్త, ప్రజలను అలర్ట్ చేసిన ఏపీ అటవీ శాఖ - ఈ సూచనలు పాటిస్తే బెటర్

RRR Movie: సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?

RRR Movie: సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?