అన్వేషించండి
Jagapathi Babu: 'ఇది అవసరం, లేకపోతే ఒళ్లు బలుస్తుంది' - జగపతి బాబు కామెంట్స్‌కు నెటిజన్స్ ఫిదా!
తాజాగా జగపతిబాబు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

జగపతి బాబు కామెంట్స్‌కు నెటిజన్స్ ఫిదా
టాలీవుడ్ లో హీరోగా ఎన్నో సినిమాలు చేసిన జగపతి బాబు ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా సినిమాలు చేయడం మొదలుపెట్టారు. సెకండ్ ఇన్నింగ్స్ లో తన క్రేజ్ ను మరింత పెంచుకున్నారు జగపతి బాబు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీ స్టార్ గా మారారు. బాలీవుడ్ మేకర్స్ కూడా జగపతిబాబు కాల్షీట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఇతడు ప్రభాస్ నటిస్తోన్న 'సలార్' సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. తాజాగా జగపతిబాబు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఫారెన్ లో ఉన్న ఆయన చినుకులు పడుతుండగా.. తన హుడ్డీను తలపై కప్పుకొని నడుస్తూ వెళ్తున్నారు. ఈ ఫొటోను షేర్ చేస్తూ.. 'ఇదే అక్కడైతే(ఇండియా) గొడుగు పట్టుకోవడానికి ఎవరో ఒకరు ఉండేవారు. అప్పుడప్పుడు ఇది అవసరం.. లేకపోతే ఒళ్లు బలుస్తుంది' అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
ఇండియాలో స్టార్స్ అంతా చాలా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తుంటారు. షూటింగ్ కి వెళ్లాలంటే క్యారవాన్, స్పాట్ లో అసిస్టెంట్స్.. ఇలా వారికి హెల్ప్ చేయడానికి చాలా మంది ఉంటారు. వాటికి దూరంగా ఉండాలని మన స్టార్స్ అప్పుడప్పుడు ఫారెన్ చెక్కేస్తుంటారు. నటుడు జగపతిబాబు కూడా అదే సిట్యుయేషన్ ను ఉద్దేశిస్తూ ఈ పోస్ట్ పెట్టారు. ఇది చూసిన నెటిజన్లు.. ఆయన్ను ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 'మీ క్యాప్షన్స్ కి సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది' అంటూ జగపతిపై అభిమానాన్ని చాటుకుంటున్నారు.
View this post on Instagram
"ఇదే అక్కడైతే గొడుగు పట్టుకోవటానికి ఎవరొకరు ఉండేవారు.. అప్పుడు అప్పుడు ఇది అవసరం, లేకపోతే ఒళ్ళు బలుస్తుంది" అని జగపతి బాబు అబ్రాడ్ నుంచి పెట్టిన ట్వీట్ కి నెటిజన్స్ పాజిటివ్ కామెంట్స్ తో ముంచేస్తున్నారు@IamJagguBhai pic.twitter.com/L4InDsVQNU
— ABP Desam (@ABPDesam) May 19, 2022
ఇంకా చదవండి





















