Janhvi Kapoor On Vijay Devarakonda : విజయ్ దేవరకొండకు పెళ్లి చేసిన జాన్వీ కపూర్
విజయ్ దేవరకొండకు పెళ్ళైపోయిందా? ఇప్పుడీ డౌట్ ఎందుకంటే... అతడికి ప్రాక్టికల్‌గా పెళ్ళైందని అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కామెంట్ చేశారు.
పాన్ ఇండియా స్థాయిలో ఫాలోయింగ్ ఉన్న టాలీవుడ్ యంగ్ హీరోల్లో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఒకరు. ఆయనతో నటించాలని, సినిమా చేయాలని ఉందంటూ పలువురు హీరోయిన్లు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోల్లో విజయ్ దేవరకొండ పేరు కూడా ఉంటుంది. అతడు బ్యాచిలర్ కావచ్చు కానీ... అతడికి పెళ్ళైపోయిందని హిందీ హీరోయిన్ జాన్వీ కపూర్ చెప్పడం వైరల్ అవుతోంది.
విజయ్ దేవరకొండ గురించి జాన్వీ కపూర్ ఎందుకలా చెప్పారు?
జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ప్రధాన పాత్రలో ఆమె తండ్రి బోనీ కపూర్ నిర్మించిన సినిమా 'మిలి'. మలయాళ హిట్ 'హెలెన్'కు రీమేక్ అది. నవంబర్ 4న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ మీడియాతో జాన్వీ కపూర్ మాట్లాడుతున్నారు. 'ఒకవేళ మీ స్వయంవరం జరిగితే... అందులో ఏయే హీరోలు ఉండాలని కోరుకుంటారు?' అనే ప్రశ్న ఓ ఇంటర్వ్యూలో జాన్వీకి ఎదురైంది.
తన స్వయంవరంలో హృతిక్ రోషన్, రణ్‌బీర్ కపూర్, టైగర్ ష్రాఫ్ ఉండాలని కోరుకుంటున్నట్టు జాన్వీ కపూర్ తెలిపారు. అప్పుడు రణ్‌బీర్ పెళ్ళైంది కాబట్టి ఇంకొకరి పేరు చెప్పమని అడిగితే ఆవిడ ఆలోచనలో పడ్డారు. అప్పుడు విజయ్ దేవరకొండ పేరు చెబితే... ''హి ఈజ్ ప్రాక్టికల్లీ మ్యారీడ్'' అని జాన్వీ కపూర్ ఆన్సర్ ఇచ్చారు. ఆ మాటతో చాలా మంది షాక్ తిన్నారు. ప్రాక్టికల్లీ మ్యారీడ్ వెనుక అర్థం ఏమిటని డిస్కషన్స్ స్టార్ట్ చేశారు.
రష్మికతో విజయ్ ప్రేమలో ఉన్నారని!
విజయ్ దేవరకొండ లవ్ లైఫ్ ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. నేషనల్ క్రష్ రష్మికతో ఆయన ప్రేమలో ఉన్నారని ప్రేక్షకులు, పరిశ్రమలో కొంత మంది భావిస్తున్నారు. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాల్లో వాళ్ళిద్దరూ జంటగా నటించారు. రష్మిక తెలుగులో కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి విజయ్ దేవరకొండతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. దాన్ని కొంత మంది ప్రేమ అని కూడా అంటుంటారు అనుకోండి! అయితే... తాము మంచి స్నేహితులం మాత్రమేనని ఇద్దరూ చెబుతున్నారు.
Also Read : 'ఝాన్సీ' వెబ్ సిరీస్ రివ్యూ : లేడీ గజినీలా మారిన అంజలి - సిరీస్ ఎలా ఉందంటే?
విజయ్ దేవరకొండ, రష్మిక... ఇద్దరూ ఈ ఏడాది హిందీ చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన 'లైగర్'తో విజయ్ దేవరకొండ హిందీకి ఇంట్రడ్యూస్ అయితే... అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించిన 'గుడ్ బై'తో రష్మిక బాలీవుడ్ వెళ్లారు. రెండు సినిమాలకు ఆశించిన విజయాలు రాలేదనుకోండి. రిజల్ట్స్ పక్కన పెడితే... ఇద్దరికీ పేరొచ్చింది.
రూమర్స్ గురించి డిస్కషన్ వస్తుందా?
విజయ్ దేవరకొండ, రష్మిక రిలేషన్షిప్ గురించి డిస్కషన్ జరుగుతోంది. సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. అటువంటి వీడియోస్ కొన్ని తాను చూశానని రష్మిక తెలిపారు. అవి క్యూట్‌గా ఉన్నాయని, అయితే వాటి గురించి ఎప్పుడూ విజయ్ దేవరకొండతో డిస్కస్ చేయలేదన్నారు. తమది పదిహేను మంది సభ్యులతో కూడిన గ్యాంగ్ అని, అందరం కలిసినప్పుడు బోర్డు గేమ్స్ వంటివి ఆడతామని రష్మిక పేర్కొన్నారు.