News
News
X

Janaki Kalaganaledu November 3rd: రక్తపు మడుగులో మాధురి, తప్పించుకున్న అఖిల్- షాకైన జానకి

ఈజిగా డబ్బు సంపాదించాలని అఖిల్ మాదకద్రవ్యాలు అమ్ముతూ తన ఫ్రెండ్ కంట పడతాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
 
అఖిల్ కాలేజీలో తన ఫ్రెండ్ ని పిలిచి మాదకద్రవ్యం ఉందని చెప్తాడు. ఎవరికి చెప్పొద్దని తాను సప్లై చేస్తున్నా అని అంటాడు. అదే కాలేజీలో జానకి కూడా ఉంటుంది కానీ అఖిల్ ని గమనించదు. కాలేజీలో అందరికీ చాటుగా మాల్ సప్లై చేసి డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. అప్పుడే మాధురి అనే అమ్మాయి అఖిల్ దగ్గరకి వస్తుంది. నువ్వు కాలేజీలో ఏదో అమ్మకూడనిది అమ్ముతున్నావ్ నేను చూశాను అని చెప్పేసరికి అఖిల్ షాక్ అవతాడు. ఏం మాట్లాడతన్నావ్ మాధురి నేను మాల్ అమ్మడం ఏంటి అని అఖిల్ నోరు జారతాడు. మాల్ అని నేను అనలేదే అని మాధురి అనేసరికి అఖిల్ బిత్తరపోతాడు. దొంగతనంగా ఇలాంటివి ఎందుకు చేస్తున్నావ్, సొసైటీకి హాని చేసేవి ఎందుకు అమ్ముతున్నావ్ అని నిలదీస్తుంది.

అరవకు అని అఖిల్ తనని బతిమలాడటానికి ట్రై చేస్తాడు కానీ మాధురి మాత్రం వినదు. ఈ విషయం వెంటనే మీ పేరెంట్స్ కి చెప్తాను అని వెళ్లబోతుంటే అఖిల్ ఆగమని పిలుస్తాడు కానీ వినకుండా పరుగులు పెడుతుంది. తన వెనుకాలే అఖిల్ వెళతాడు ఎంత బతిమలాడినా కూడా మాధురి వినడు. మీ ఇంట్లో చెప్పాల్సిందే అని మాధురి కాలే బయటకి వెళ్లిపోతుంటే అప్పుడే జానకి కూడా బయటకి వచ్చి నిలబడుతుంది. ఆగు మాధురి అని అఖిల్ వెంటపడటం జానకి చూస్తుంది. ఇప్పుడు ఆగకపోతే నిజంగానే చంపేస్తాను అని అఖిల్ అక్కడ ఉన్న కర్ర తీసి మాధురి తలకి విసురుతాడు. అఖిల్ వెంట జానకి పరుగులు పెడుతుంది.

Also read: తులసికి సామ్రాట్ సరైన భర్త అన్న పరంధామయ్య- అనసూయకి నూరిపోస్తున్న లాస్య

తలకి కర్ర తగలడంతో మాధురి కిందపడిపోతుంది. అది చూసి జానకి షాక్ అవుతుంది. మాధురి తేరుకుని మళ్ళీ పరుగులు పెడుతూ ఒక చోటకి వెళ్ళి రక్తపు మడుగులో  కనిపిస్తుంది. తనని చూసి అఖిల్ దగ్గరకి వెళ్తాడు. ఎవరైనా తనని చూస్తే ఇబ్బంది అవుతుందని భయపడి అక్కడి నుంచి అఖిల్ వెళ్ళిపోతాడు. వాళ్ళని వెతుక్కుంటూ వచ్చిన జానకి కూడా మాధురిని చూస్తుంది. తనని లేపడానికి ట్రై చేస్తుంది. అఖిల్ ఏం తెలియని వాడిలా టెన్షన్ గా ఇంటికి వచ్చేస్తాడు. చేతికి రక్తం అయితే దాన్ని తుడిచేసుకుంటాడు. అప్పుడే జ్ఞానంబ, గోవిందరాజులు ఎదురుపడతారు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావ్ అని గోవిందరాజులు అడుగుతాడు.

News Reels

తెలిసో తెలియకో మిమ్మల్ని అందరినీ బాధపెట్టాను కదా నాన్న, నా తప్పు తెలుసుకున్నా మంచి పేరు తెచ్చుకోవాలని డిసైడ్ అయ్యాను. ఇదంతా మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపిస్తాను అందుకే బుక్స్ కూడా కొనుక్కుని వచ్చాను అని చెప్తాడు. గోవిందరాజులు అనుమానంగా చూస్తుంటే మీరు నా మాట నమ్మరు కానీ నేను నిజంగా మారాను అని లోపలికి వెళ్ళిపోతాడు. గదిలోకి వెళ్ళిన అఖిల్ ని చూసి ఏంటి టెన్షన్ పడుతున్నావ్ అని అడుగుతుంది. మాయమాటలు చెప్పి తనని నమ్మిస్తాడు. అఖిల్ లో మార్పు వచ్చిందని జెస్సి హ్యాపీగా ఫీల్ అవుతుంది. జానకి మాధురిని హాస్పిటల్ కి తీసుకుని వస్తుంది.

Also read: ఊహించని ట్విస్ట్, ఒకేసారి రెండు నిజాలు బట్టబయలు- ఫుల్ ఖుషిలో దేవి, షాకైన చిన్మయి

Published at : 03 Nov 2022 10:58 AM (IST) Tags: janaki kalaganaledu serial today episode Janaki Kalaganaledu Serial Written Update Janaki Kalaganaledu Serial Janaki Kalaganaledu Serial November 3rd Update

సంబంధిత కథనాలు

Jabardasth Teja - Pavithra: ‘జబర్దస్త్’ తేజాకు, పవిత్రకు పెళ్లి? వైరల్ అవుతోన్న వీడియో

Jabardasth Teja - Pavithra: ‘జబర్దస్త్’ తేజాకు, పవిత్రకు పెళ్లి? వైరల్ అవుతోన్న వీడియో

Mounika Reddy Marriage:పెళ్లి పీటలెక్కుతున్న యూట్యూబ్ స్టార్ మౌనిక రెడ్డి, వరుడు ఎవరంటే..

Mounika Reddy Marriage:పెళ్లి పీటలెక్కుతున్న యూట్యూబ్ స్టార్ మౌనిక రెడ్డి, వరుడు ఎవరంటే..

RGV on Ashu Reddy: వామ్మో వర్మ - అషురెడ్డిలో ఆ స్ట్రెంత్ చూసే సెలక్ట్ చేశారట, ఆర్జీవీ ఎక్కడా తగ్గట్లేదు!

RGV on Ashu Reddy: వామ్మో వర్మ - అషురెడ్డిలో ఆ స్ట్రెంత్ చూసే సెలక్ట్ చేశారట, ఆర్జీవీ ఎక్కడా తగ్గట్లేదు!

NBK108 Launch : పూజతో మొదలైన బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా - గిప్పడి సంది లెక్కలు టక్కర్

NBK108 Launch : పూజతో మొదలైన బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా -  గిప్పడి సంది లెక్కలు టక్కర్

Telugu Movies 2022: గూగూల్‌ సెర్చ్‌లోనూ దక్షిణాది సినిమాల హవా, టాప్-10లో ఏయే సినిమాలు ఏయే స్థానాలంటే..

Telugu Movies 2022: గూగూల్‌ సెర్చ్‌లోనూ దక్షిణాది సినిమాల హవా, టాప్-10లో ఏయే సినిమాలు ఏయే స్థానాలంటే..

టాప్ స్టోరీస్

Jagan Review : వైఎస్ఆర్‌సీపీలోనూ వాలంటీర్ తరహా వ్యవస్థ - ప్రతి యాభై ఇళ్లకు ఓ నేతను పెట్టాలని జగన్ నిర్ణయం !

Jagan Review : వైఎస్ఆర్‌సీపీలోనూ వాలంటీర్ తరహా వ్యవస్థ - ప్రతి యాభై ఇళ్లకు ఓ నేతను పెట్టాలని జగన్ నిర్ణయం !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Minister Botsa : ఏపీ, తెలంగాణ  కలిస్తే  మోస్ట్  వెల్కం- మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

Minister Botsa : ఏపీ, తెలంగాణ  కలిస్తే  మోస్ట్  వెల్కం- మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

Weather Updates AP: మాండూస్ తుపాన్ ఎఫెక్ట్ - రాబోయే మూడు రోజులు ఏపీలో వర్షాలు!

Weather Updates AP: మాండూస్ తుపాన్ ఎఫెక్ట్ - రాబోయే మూడు రోజులు ఏపీలో వర్షాలు!