(Source: ECI/ABP News/ABP Majha)
Janaki Kalaganaledu November 28th: మల్లికకి ఝలక్ ఇచ్చిన జ్ఞానంబ- నోటికి పనిచెప్పిన సునంద, గడ్డిపెట్టిన జానకి
జానకి ఐపీఎస్ చదువు వదిలేశానని రామాకి చెప్పడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
ఇంట్లో ప్రశాంతత లేకపోవడంతో జ్ఞానంబ దోష నివారణ పూజ చేయిస్తుంది. శివాలయంలో పూజలు చేసి కోనేటిలో దీపాలు వదలాలని పూజారి చెప్తాడు. అన్ని జంటలు దీపాలు వదులుతూ తమ మనసులో కోరికలు చెప్తూ దీపాలు వదులుతారు. రామా జానకిని తొలిసారి గుడిలో చూసిన విషయం చెప్తాడు. ‘ఈ దేవత పక్కన నిలబడే చోటు దొరుకుతుందా అని అనిపించింది అది తీరని కోరిక అనిపించింది కానీ దేవుడు విన్నాడు ఈ దేవతని నాకు ఇచ్చాడ’ని చెప్తాడు. అది విని జానకి ఫ్లాట్ అయిపోతుంది. తర్వాత జానకి కోనేటిలో దీపం వదులుతుంది. అది చూసిన మల్లిక కుళ్ళుబోతుతనంతో దీపం ఆరిపోయేలా చేసేందుకు నీళ్ళని కదిలిస్తుంది.
Also Read: లాస్య నిజస్వరూపం తెలుసుకున్న నందు- పరంధామయ్యని ఇంటికి తీసుకొచ్చిన సామ్రాట్
నీళ్ళు కదలడం చూసి దీపాలు మునిగిపోతాయేమో అని రామా కంగారుపడతాడు. మీరు నీళ్ళు అలా కదిలిస్తే జానకమ్మ దీపం మునిగిపోతుందని చికిత అంటుంటే మల్లిక నోరు మూయిస్తుంది. మల్లిక చేస్తున్న పని జానకి గమనిస్తుంది. నీళ్ళు బాగా కదలడం వల్ల మల్లిక పెట్టిన దీపం మునిగిపోతుంది. అది చూసి తన దొంగ కడుపు పోలేరమ్మకి తెలిసిపోతుందేమో అని కంగారుపడుతుంది. జానకి మల్లిక వైపు కోపంగా చూస్తుంది. అందరూ మొహాలు మాడ్చుకుని ఉండటం చూసి ఏమైందని గోవిందరాజులు అడుగుతాడు. పుట్టబోయే బిడ్డ గురించి మొక్కుకుని దీపం వదిలితే అది మునిగిపోయిందని చికిత చెప్పేసరికి జ్ఞానంబ షాక్ అవుతుంది. శుభమా అని దీపం పెడితే మునిగిపోవడం ఏంటి అని కంగారుపడుతుంది.
కొడుకులు, కోడళ్లతో జ్ఞానంబ హోమం చేయిస్తుంది. దీపం మునిగిపోయిందని భయపడకు రేపు హాస్పిటల్ కి వెళ్ళి స్కానింగ్ చేయిద్దాం కడుపులో బిడ్డ బాగుందని తెలిస్తే అందరూ సంతోషంగా ఉంటాం కదా అని అంటుంది. ఆ మాటకి మల్లిక టెన్షన్ పడుతుంది. టెస్ట్ లు చేయిస్తే అసలు కడుపులో బిడ్డ లేదని తెలిసిపోతుందని అనుకుంటుంది. బయటపడిపోతుందేమో అని జానకి అనేసరికి అందరూ షాకింగ్ గా చూస్తారు. రక్తం చూస్తే భయమని చెప్పింది కదా దాని గురించి అన్నాలే అని తర్వాత జానకి కవర్ చేస్తుంది. పూజ కోసం కొబ్బరి కాయలు తీసుకురావడానికి జానకి వెళ్తుంది. రామా ఒక్కడే పూజలో ఉండటం చూసిన సునంద నోటికి పని చెప్తుంది. అఖిల్ ని ఇరికిద్దామని అనుకుంటే జానకి అది జరగకుండా చేసిందని మనసులో అనుకుంటుంది.
Also Read: నిజం తెలిసి గౌతమ్ ని ఛీ కొట్టిన రిషి- దేవయానికి వార్నింగ్ ఇచ్చిన మహేంద్ర
జైలుకి వెళ్లాల్సిన కొడుకు స్టేషన్ నుంచి ఇంటికి వచ్చాడని ఈ హోమం చేయిస్తున్నావని జనం అనుకుంటున్నారు అందుకే ఈ పూజ చేస్తున్నావ్ అని అంటుంది. నీ కోడలు వల్ల నీ కొడుకు క్షేమంగా ఇంటికి వచ్చాడు కదా అని అంటుంది. పూజలో పెద్ద కోడాలిని కూర్చోబెట్టకుండా మిగతా కోడళ్లని కూర్చోబెట్టి పూజ చేయిస్తున్నారని ఒకామే అంటుంది. దానికి సునంద జానకి ఇంకా ప్రెగ్నెంట్ కాలేదని నోటికొచ్చినట్టు వాగుతుంది. అందరూ జానకి గురించి తక్కువ చేసి మాట్లాడతారు. మీరు అంత బాధపడాల్సిన అవసరం లేదు సునందగారు అని జానకి ఎంట్రీ ఇస్తుంది.