Guppedanta Manasu November 28th: నిజం తెలిసి గౌతమ్ ని ఛీ కొట్టిన రిషి- దేవయానికి వార్నింగ్ ఇచ్చిన మహేంద్ర
Guppedantha Manasu November 28th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో మహేంద్ర చెప్పడానికి ట్రై చేస్తుంటే అదేమీ వద్దని రిషి అంటాడు. మీరు లేకుండా ఉండలేను డాడ్ అని రిషి ఎమోషనల్ గా అంటాడు. క్షమించమని మహేంద్ర అంటే అలా అనకండి డాడ్ నేనే ఏదైనా తప్పు చేస్తే క్షమించమని అడుగుతాడు. కోపం లేదా అంటే మీమీద కోపం ఎప్పటికీ రాదని అంటాడు. ఫణీంద్ర, దేవయాని వాళ్ళని గౌతమ్ తీసుకుని వస్తాడు. వాళ్ళని చూసి తండ్రీకొడుకులు ఒక్కటైపోయారని అనుకుంటుంది. ఎలా ఉందని దేవయాని అడుగుతుంది. బ్లెడ్ ఎక్కించిన తర్వాత జగతి పరిస్థితి బాగానే ఉందని డాక్టర్ చెప్తాడు. తనని ఇంటికి తీసుకుని వెళ్తామని రిషి డాక్టర్ తో అంటాడు.
రిషి రక్తం ఇచ్చిన విషయం మహేంద్ర చెప్పడంతో జగతి చాలా హ్యపీగా ఫీల్ అవుతుంది. ఇంతకన్నా ఈ జన్మకి ఇంకేం కావాలి అని సంతోషంగా అంటుంటే దేవయాని ఎంట్రీ ఇస్తుంది. ఈ యాక్సిడెంట్ నీకు అనుకూలంగా మలుచుకున్నావ్ అని అంటుంది. ఆ మాటకి వసు సీరియస్ అవుతుంది. స్పృహ పోయినట్టు నటించిందని దేవయాని నోరు పారేసుకుంటుంది. ఆ మాటకి మహేంద్ర కోపంగా ఇలాగేనా మాట్లాడేది అని అంటాడు. కంట్రోల్ గా ఉండమని జగతి చెప్పేందుకు చూస్తుంది. ఏదో మాయ చేసి రిషితో రక్తం ఇప్పించుకోగానే తనకి మీమీద ప్రేమ పొగిపోయినట్టు కాదని దేవయాని అంటుంది. రిషి నా కొడుకు జగతి కొడుకు మీ మాటలు, కుట్రలకి రోజులు చెల్లిపోయాయి ఐ గుర్తు పెట్టుకోండి అని మహేంద్ర గట్టిగానే బదులిస్తాడు. నర్స్ వచ్చి అందరినీ బయటకి వెళ్ళమని చెప్తుంది. అప్పుడే రిషి, ఫణీంద్ర వాళ్ళు రావడం చూసిన దేవయాని జగతి మీద లేనిపోని ప్రేమ ఒలకబోస్తుంది.
Also read: విషమంగా దీప ఆరోగ్యం- నిజం తెలిసి మోనితని బురిడీ కొట్టించిన శివ
జగతి రిషి వైపు ప్రేమగా చూస్తుంది. రిషి కోసం టిఫిన్ తీసుకురావడానికి వసు బయటకి వస్తుంది. తన కోసం రిషి వెతుక్కుంటూ వస్తాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టిఫిన్ చెయ్యడం అవసరమా అని అంటుంటే వసు మాత్రం ఏం మాట్లాడొద్దని చెప్తుంది. వసునే ప్రేమగా తనకి తినిపిస్తుంది. జగతి వాళ్ళని డిశ్చార్జి చేసినట్టు గౌతమ్ ఫోన్ చేసి చెప్తాడు. వాళ్ళ కోసం వెళ్దామని అంటే ముందు తినమని తినిపిస్తుంది. తన ఆకలి గురించి ఆలోచించినందుకు రిషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇద్దరూ సేఫ్ గా బాగున్నారు ఇంకేమైనా జరిగి ఉంటే అని రిషి ఎమోషనల్ అవుతుంటే వసు అలా మాట్లాడొద్దు అంతా బాగుంది కదా హ్యపీగా ఉండమని చెప్తుంది. రిషికి ఏదో ఫోన్ వస్తుంది కోపంగా వసుని లోపలికి వెళ్లిపొమ్మని చెప్పి గౌతమ్ దగ్గరకి ఆవేశంగా వస్తాడు.
డాడ్ కోసం నేను ఇంత బాధపడుతుంటే చెప్పకుండా దాస్తావా అసలు నువ్వు ఫ్రెండ్ వేనా, నువ్వు ఒక మోసగాడివి, నీది అసలు ఫ్రెండ్షిప్ కాదు అని నోటికి వచ్చినట్టు అరుస్తాడు. తన మాట వినమని ఎంతగానో బతిమలాడతాడతాడు. రిషి గౌతమ్ మీద చెయ్యి వేసేసరికి తెరుకుని ఏం మాట వినాలి అని అంటాడు. అంటే నిజం తెలియలేదా ఇందంతా తన భ్రమ అని అనుకుంటాడు. రిషికి ఏమి తెలియలేదని ఊపిరి పీల్చుకున్నాడు. మహేంద్ర, జగతి రిషి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. రిషి తనని ఏమి అడగడం లేదని మహేంద్ర బాధపడతాడు. రిషికి ఇంకెప్పుడు దూరం అవ్వొద్దని తన కళ్ళలో బాధ చూడలేనని జగతి అంటుంది.
Also Read: కోర్టులో నేరం చేశానని ఒప్పుకున్న మాళవిక, షాకైన వేద - ఖుషి మీద అరిచిన ఆదిత్య