Janaki Kalaganaledu March 29th: తండ్రిని నోటికొచ్చినట్టు తిట్టిన అఖిల్- సర్దుకుపొమ్మని చెప్పిన జ్ఞానంబ
జానకి కానిస్టేబుల్ కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
విష్ణు ఈనెల డబ్బులని చెప్పి తెచ్చి తండ్రి గోవిందరాజులకి ఇస్తాడు. వెంటనే అఖిల్ కూడా తీసుకొచ్చి ఇస్తాడు. లెక్కబెట్టిన గోవిందరాజులు రెండు వేలు తక్కువ ఇచ్చాడని అడుగుతాడు. ఎన్ని సార్లు లెక్కబెట్టిన తక్కువే ఉంటాయని చెప్తాడు. ఎందుకు తక్కువ ఇచ్చావని అంటే జెస్సికి బాబు పుట్టాడు ఖర్చులు ఎక్కువయ్యాయని అఖిల్ అంటాడు. ఇక నుంచి కూడా ఇలాగే ఇస్తాను సర్దుకోమని అనేసరికి గోవిందరాజులు సీరియస్ అవుతాడు. నువ్వేమైన ముష్టి వేస్తున్నావా మాకు అని అంటాడు. కానీ గోవిందరాజులు మాత్రం ఒప్పుకోకుండా ఇచ్చి తీరాల్సిందేనని పట్టుబడతాడు. మీరు ఎన్ని చెప్పినా నేను చెప్పేది ఒకటేనని కోపంగా అంటాడు. నాన్నతో మాట్లాడే పద్ధతి ఇదేనా అని జ్ఞానంబ తిడుతుంది.
అఖిల్: ఈ ఇంట్లో నచ్చిన మనిషికి ఒక రూల్ నచ్చని మనిషికి ఒక రూల్ ఉంటుందా. ఈ మధ్య ఇంట్లో ఇద్దరు విహార యాత్రకి వెళ్ళినప్పుడు మీరు డబ్బులు ఇచ్చిన మాట నిజమా కాదా?
గోవిందరాజులు: అవును ఇచ్చాం తప్పేముంది. పైసా కూడా దాచుకోకుండా మొత్తం డబ్బులు మా చేతిలోనే పెడుతున్నారు.
రామ: ఖర్చుల్లో ఉన్నామని చెప్తున్నారు కదా ఇబ్బంది పెట్టకండి
గోవిందరాజులు: విష్ణుకి రేపు బిడ్డ పుడితే వాడు తగ్గిచ్చి ఇస్తాడు రేపు అఖిల్ కి రెండో బిడ్డ పుడితే ఇవి కూడా ఇవ్వడు
Also Read: రాజ్యలక్ష్మి అసలు స్వరూపం తెలుసుకున్న ప్రియ- లాస్య ట్రాప్ లో పడిపోయిన దివ్య
అఖిల్: మా బిడ్డ గురించి మేము ఆలోచించుకోవడం తప్పా? మీ స్వార్థం కోసం మీరు కన్నారు చదివించారు ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిస్తామని కన్నారు కదా
జానకి: మావయ్య ని బాధపెట్టేలా మాట్లాడకు
అఖిల్: పెద్దోదిన నువ్వు మధ్యలో మాట్లాడకు
గోవిందరాజులు: నిన్ను చదివించింది మాకేదో ఇస్తావని కాదు నీ బతుకు నువ్వు బటుకుతావని
జ్ఞానంబ: కన్నతల్లిదండ్రులకు పిల్లలందరూ సమానమే అనేసరికి అఖిల్ కోపంగా వెళ్ళిపోతాడు. ఆయన తరఫున క్షమించమని అడగటం తప్ప ఏమి చేయలేనని జెస్సి వెళ్ళిపోతుంది. అఖిల్ ను ఎందుకు బతిమలాడుతున్నావ్ లాగి పెట్టి కొట్టకుండా ఉన్నావని గోవిందరాజులు కోపంగా అరుస్తాడు. మనం ఉమ్మడి కుటుంబంలో ఉన్నాం అంతా కలిసి ఉండాలని ఆశపడుతున్నాం, మనమే సర్దుకోపోవాలని చెప్తుంది. ఖర్చులు తగ్గిస్తానులే ఏదో ఒక విధంగా అని నచ్చజెప్పడానికి చూస్తుంది. రెండో కోడలు కూడా వచ్చే నెల ఇచ్చే డబ్బుల్లో కోత పెట్టడానికి చూస్తుంది అప్పుడు నేను కూడా ఏదో ఒక వాచ్ మెన్ ఉద్యోగం చూసుకోవాలి లేదంటే రామ మీద పడాలని అంటాడు.
Also Read: అందరి ముందు అడ్డంగా బుక్కైన రాజ్- అన్నని ఇరికించేసిన కళ్యాణ్
అఖిల్ చేసిన అవమానానికి గోవిందరాజులు మండిపోతూ ఉంటాడు. జెస్సి అఖిల్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంకా ఇంటికి రాలేదని జెస్సి కంగారు పడుతుంది. పొద్దున గొడవ జరిగిన దగ్గర నుంచి కాల్ చేయలేదు నేను చేసిన లిఫ్ట్ చేయలేదు అందుకే కంగారుగా ఉందని చెప్తుంది. అఖిల్ మనసుని కొబ్బరి తురుము తురిమినట్టు తురిమారు. ఇల్లు వదిలి వెళ్లిపోయాడేమోనని మల్లిక అంటే పోలీస్ కంప్లైంట్ ఇద్దామని మలయాళం సలహా ఇస్తాడు. అప్పుడే జానకి, రామ వస్తారు. ఎందుకు కంగారుగా ఉన్నారని అడిగితే అఖిల్ ఇల్లు వదిలి వెళ్లిపోయాడని మల్లిక చెప్తుంది. కడుపు కాలితే వాడే వస్తాడని గోవిందరాజులు అంటాడు. అప్పుడే అఖిల్ ఇంటికి రావడంతో జెస్సి కంగారుతో కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఫ్రెండ్స్ తో బయటకి వెళ్ళాను రావడం కాస్త లేట్ అయింది నేనేమీ అలగలేదని చెప్తాడు.