Janaki Kalaganaledu March 27th: రిసార్ట్ లో దొంగని పట్టేసుకున్న జానకి- శోభనానికి ఏర్పాట్లు రెడీ
జానకి కానిస్టేబుల్ కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
రిసార్ట్ లో పెట్టిన లక్కీ కపుల్స్ కాంపిటీషన్లో జానకి, రామ దంపతులు విజేతలుగా నిలుస్తారు. భర్త అంటే భార్య తాలూకు తల్లిదండ్రులు ప్రేమని చూపించి గుండెల్లో పెట్టుకునే వాడని జానకి చెప్తుంది. మీ ఉద్దేశంలో భార్య, ప్రేమ, నమ్మకం అంటే ఏంటని యాంకర్ అడిగితే అన్నింటికీ జానకి అని సమాధానం చెప్తాడు. చివరగా రామ జానకిని తదేకంగా చూసి కళలు మూసుకుని తన నుదుటి మీద బొట్టు పెట్టాలని యాంకర్ చెప్తుంది. దీంతో రామ భార్యని ప్రేమగా చూస్తూ కళ్ళు మూసుకుని కరెక్ట్ గా నుదుటి మీద బొట్టు పెడతాడు. దీంతో అందరూ చప్పట్లు కొట్టి అభినందిస్తారు. ఈ జిడ్డు గాడు రగిలిపోతూ ఉంటాడు. గోవిందరాజులు ఫోన్ పోయిందని వెతుక్కుంటూ ఉండగా జ్ఞానంబ తీసి ఇస్తుంది. ఎవరికి ఫోన్ చేయాలంటే రామకి అని చెప్తుంది. వాళ్ళు ఈ ప్రపంచాన్ని మర్చిపోవాలని దూరంగా వెళ్లారు అక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా అని జ్ఞానంబ అంటుంది.
Also read: ప్రియ మెడలో తాళి కట్టిన సంజయ్- దివ్య జీవితం నాశనం చేసేందుకు లాస్య స్కెచ్
చాలా రోజుల తర్వాత వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించుకున్నారని జ్ఞానంబ అనేసరికి ఇదంతా నీ ప్రయత్నమా అంటాడు. కాస్త ముందుగా చెప్తే మనం కూడా వెళ్ళేవాళ్ళం కదా అని నసుగుతాడు. మన పెళ్ళైన ఇన్ని రోజులకు మనం భార్యాభర్తలం అన్న అనుభూతి కలిగిందని రామ చెప్తాడు. ఇన్ని రోజులు స్నేహితుల్లాగా ఉన్నామని చెప్తాడు. అక్కడ ఒక జంట ఒక కూల్ డ్రింక్ లో రెండు స్ట్రాలు వేసుకుని తాగడం రామ చూస్తాడు. జానకి కూడా డ్రింక్ తీసుకుని అలాగే తాగుదామని అంటుంది. మీ మనసులో నా మీద ఎంత ప్రేమ లేకపోతే కళ్ళు మూసుకుని బొట్టు పెట్టారని అనేసరికి రామ సిగ్గుపడతాడు. ఇద్దరూ కూల్ డ్రింక్ తాగుతారు. తన భర్తకి ఇంకా విషయం అర్థం కాలేదని జానకి మనసులో మురిసిపోతుంది. అప్పుడే ఒకతను వచ్చి మీరు చెప్పినట్టు ఆ ఏర్పాట్లు కూడా చేశామని చెప్తాడు. ఆ ఏర్పాట్లు ఏంటని రామ అడిగితే జానకి కవర్ చేస్తుంది.
Also Read: ధర్మరాజుకి రిషి కూల్ వార్నింగ్- రిషిధారగా ఒక్కటయ్యేందుకు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు?
ఒకరికొకరు తినిపించు సంతోషంగా ఉంటారు. అప్పుడే ఒకామే వచ్చి తన పాప మెడలో బంగారు గొలుసు పోయిందని చెప్తుంది. అది విని వెంటనే గెట్ క్లోజ్ చేయమని జానకి అంటుంది. ఇక్కడ అందరూ పెద్ద మనుషులే ఎవరినని చెక్ చేస్తామని మేనేజర్ అంటాడు. ఎవరికి ఇబ్బంది లేకుండా దొంగని పట్టుకుందామని జానకి చెప్తుంది. జిడ్డు గాడు తన భార్య ని తీసుకుని వెళ్లబోతుంటే నువ్వు య్ ఎవరు చెక్ చేయడానికని అంటాడు. పోలీస్ అని కార్డ్ చూపిస్తుంది. మేనేజర్ ఇతనే దొంగని జానకి బయట పెట్టేస్తుంది. పాప డ్రెస్ కి ఉన్న మెరుపులు నీ కోట్ డ్రెస్ కి అంటుకున్నాయని జానకి చెప్తుంది. దీంతో అతని భార్య గొలుసు తీసి జానకి చేతిలో పెడుతుంది. ఇద్దరినీ స్టేషన్ కి తీసుకెళ్లమని మేనేజర్ కి చెప్తుంది. అక్కడ అందరూ జానకి చూపించిన ప్రతిభని మెచ్చుకుంటూ చప్పట్లు కొడతారు. మలయాళం అరటి పండు గెల కట్టడానికి తాడు కడుతుంటే ఊరేసుకుంటున్నాడనుకుని మల్లిక పరిగెత్తుకుంటూ వచ్చి స్టూల్ తన్నేసి వాడిని కిందపడేస్తుంది. చచ్చాను బాబోయ్ అని మలయాళం కుర్రో మొర్రో అంటుంటే గోవిందరాజులు వచ్చి పైకి లేపుతాడు. పెళ్లి కావడం లేదని మలయాళం ఆత్మహత్య చేసుకోబోయాడని మల్లిక చెప్తుంది.