Janaki Kalaganaledu January 20th: తల్లిదండ్రులని చూసి కన్నీళ్ళు పెట్టుకున్న వెన్నెల - విష్ణు బుర్రలో విషం నింపుతున్న మల్లిక
రామా చేసిన అప్పు వల్ల జ్ఞానంబ కుటుంబం రోడ్డున పడటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
చాలా రోజుల తర్వాత వెన్నెల ఇంటికి వస్తుంది. అఖిల్ తనని చిన్న ఇంటికి తీసుకుని వస్తాడు. తండ్రి పరిస్థితి చూసి వెన్నెల చాలా బాధపడుతుంది. అసలు ఏం జరిగిందని వెన్నల ఇంట్లో వాళ్ళని అడుగుతుంది. ఎంతో ఆరోగ్యంగా ఉండే నాన్న ఇలా అయిపోవడానికి కారణం ఏంటి? మన ఇంట్లో కాకుండా ఈ ఇంట్లో ఉండటానికి కారణం ఏంటని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. ఈ పరిస్థితికి కారణం బావగారు అని ఎలా చెప్తారు అని మల్లిక అంటుంది. మన పరిస్థితి ఇలా అవడానికి కారణం బావగారు అని మల్లిక జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అప్పు తీర్చే వరకు అందరికీ ఈ బాధలు తప్పవు అని మల్లిక ఉసిగొల్పుతుంది. తల్లిదండ్రుల పరిస్థితి చూసి వెన్నెల కన్నీళ్ళు పెట్టుకుంటుంది.
Also Read: మత్తులో దివ్య- ఇంట్లో నిజం చెప్పిన లాస్య, టెన్షన్ లో తులసి
త్వరలో అప్పులు తీర్చేసి మన ఇంటికి వెళ్లిపోదామని రామా అంటాడు. కానీ చేసింది తీర్చడానికి అదేమీ చిన్న అప్పు కాదు, అది సరిదిద్దుకోవడానికి ఒక్కోసారి జీవిత కాలం కూడా పట్టొచ్చు అని జ్ఞానంబ కోపంగా అంటుంది. మల్లిక నీలావతికి ఫోన్ చేసి గుడిలో జరిగిన దానికి సంతోషంగా ఉందని చెప్తుంది. ఆ మాటలు అన్నీ విష్ణు వింటాడు. వెన్నెల వచ్చి ఇంటి మీద పడిందని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. మా చెల్లెలి గురించి అలా మాట్లాడతావ్ ఏంటని వచ్చి నిలదీస్తాడు. కానీ మల్లిక మాత్రం తన ధోరణిలో మాట్లాడుతుంది. మీ నానమ్మ దగ్గర ఉంటే పెళ్లి ఖర్చులు వాళ్ళే భరించే వాళ్ళు తను ఇక్కడ ఉంటే మీరే కదా చేయాలి మళ్ళీ అప్పు చేయాలి కదా అని మల్లిక అంటుంది. అది కూడా నిజమే ఇప్పుడున్న పరిస్థితిలో వెన్నెల పెళ్లి అంటే కష్టమే అని విష్ణు కూడా అనుకుంటాడు.
జ్ఞానంబ కూతురికి ప్రేమగా అన్నం పెడుతూ ఉంటుంది. అప్పుడే కరెంట్ పోవడంతో జానకి కొవ్వొత్తి వెలిగించి తీసుకొస్తుంది. జానకి రావడంతో వదినకి కూడా వడ్డించు అని వెన్నెల అడుగుతుంది. కానీ జ్ఞానంబ మాత్రం మాట దాటేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసి అమ్మ నీతో మాట్లాడటం లేదా అని వెన్నెల అడుగుతుంది. ఏదో జరిగిందని వెన్నెల మనసులో అనుకుంటుంది. రామా ఇంట్లోకి రాకుండా బాధగా కూర్చుని ఉండటం చూసి జానకి వస్తుంది. వెన్నెల తల్లితో కలిసి కింద పడుకోవడం చూసి రామా విలవిల్లాడిపోతాడు. ఇంత మంది కష్టానికి తనే కారణం కదా అని తనని తాను నిందించుకుంటాడు. రామా బాధని గమనించిన జానకి తనని ఓదారుస్తుంది.
Also Read: యష్, వేద మధ్యలో విన్నీ- అభికి సంబంధాలు చూస్తున్న భ్రమరాంబిక, మరి మాళవిక పరిస్థితేంటి?
అఖిల్ ఏమి పట్టనట్టు ఫోన్లో గేమ్స్ ఆదుకోవడం చూసి జెస్సి తిడుతుంది. ఇంట్లో కూర్చుని గేమ్స్ ఆదుకోవడం కాదు బయటకి వెళ్ళి ఏదైనా ఉద్యోగం చూసుకోమని క్లాస్ తీసుకుంటుంది. వదిన అండ చూసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకని అఖిల్ అంటాడు. నువ్వు ఈ ఇంటి అల్లుడివి కాదు నాకెందుకు అని పట్టించుకోకుండా ఉండటం కాదు నీ ఇల్లు ఇది బాధ్యత లేకుండా ఎందుకు ఇలా ఉంటున్నావ్ అని జెస్సి తిడుతుంది.