అన్వేషించండి

Janaki Kalaganaledu February 21st: జ్ఞానంబ చనిపోతుందని చెప్పిన డాక్టర్- గుండె పగిలేలా ఏడ్చిన జానకి

రామ చేసిన అప్పు తీర్చడంతో అందరు సొంత ఇంటికి వచ్చేస్తారు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

జానకి కళ్ళు తిరిగిపడబోతుంటే జ్ఞానంబ పట్టుకుంటుంది. తనని హాస్పిటల్ కి తీసుకెళ్ళి చెక్ చేయిస్తుంది. తిరిగి వెళ్తుండగా జ్ఞానంబ గుండెల్లో దడ అని పడిపోబోతుంటే డాక్టర్ తనని చెక్ చేస్తుంది. కొన్ని టెస్ట్ లు రాస్తుంది. రామ జానకికి ఫోన్ చేస్తే జ్ఞానంబకి టెస్ట్ లు చేస్తున్నారని చెప్తుంది. కంగారు పడిన రామ హాస్పిటల్ కి వస్తానని అంటాడు కానీ జానకి వద్దని చెప్తుంది. అన్ని టెస్ట్ లు అయిపోయాయని రిపోర్ట్ రావడానికి లేట్ అవుతుందని నర్స్ చెప్తుంది. తిలోత్తమ మల్లిక కోసం వెతుకుతూ ఉంటుంది. తనతో కాళ్ళు నొక్కించుకోవడం సేవలు చేయించుకోవడం చేస్తూ మల్లికని తిప్పలు పెడుతుంది. తనని చూసి మల్లిక దాక్కుంటుంది. కిచెన్ లో ఒక గోతంలో మల్లికని మలయాళం దాచిపెడతాడు.

Also Read: రుద్రాణి ప్లాన్ సక్సెస్, రాజ్ పెళ్లి ఖాయం- రాహుల్‌తో లేచిపోయేందుకు స్వప్న స్కెచ్

ఆ సంచిలో బూడిద గుమ్మడికాయ ఉంటుంది తీసి ఇవ్వమని గోవిందరాజులు అంటాడు. ఆ గోతం తీసేసరికి మల్లిక అక్కడ ఉండటం చూసి బిత్తరపోతారు. ఈరోజు నా చేతిలో నువ్వు అయిపోతావ్ అని తిలోత్తమ అంటుంది. మెయిన్స్ దగ్గర పడుతున్నాయ్ అని బాగా చదువుకోవాలంటే కుటుంబానికి కాస్త దూరంగా ఉండాలని కాలేజ్ ప్రిన్సిపల్ జానకికి సలహా ఇస్తుంది. కానీ జానకి మాత్రం ఫ్యామిలీతో పాటు చదువు కూడా చూసుకుంటానని చెప్తుంది. అప్పుడే హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది. జానకి డాక్టర్ దగ్గరకి వెళ్ళి కలుస్తుంది. జ్ఞానంబకి ఒక కిడ్నీ పూర్తిగా పాడైపోయిందని డాక్టర్ చెప్తుంది. రెండో కిడ్నీ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది, అది కూడా ఫెయిల్ అయితే బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక నుంచైనా తనని జాగ్రత్తగా చూసుకోమని డాక్టర్ సలహా ఇస్తుంది. ఆ మాట వినిన్ జానకి చాలా ఏడుస్తుంది.

Also Read: దివ్య ఎంట్రీ అదుర్స్- ప్రేమ్ కి కొడుకు, కొత్త కథతో గృహలక్ష్మి

ఇంట్లో ఎవరికి చెప్పొద్దని జానకి డాక్టర్ ని బతిమలాడుతుంది. జ్ఞానంబని జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది. తిలోత్తమ, మల్లిక కూర్చుని చింత పిక్కల ఆట ఆడతారు. ఊరికే ఆడటం ఎందుకు వంద రూపాయలు పందెం అని చెప్తుంది. అప్పుడే జానకి డల్ గా ఇంటికి వస్తుంది. రిపోర్ట్స్ ఎవరైనా చూస్తే విషయం బయట పడుతుందని జానకి వాటిని ఇంటి బయట దాచిపెట్టి లోపలికి వెళ్తుంది. మల్లిక ఆట నుంచి తప్పించుకోవడం కోసం మలయాళం కాలు గిల్లుతుంది దీంతో అతడు ఆట మధ్యలో పడిపోతాడు. వాడిని ఉతికి ఆరేస్తుంది తిలోత్తమ. జ్ఞానంబ జానకిని చూసి రిపోర్ట్స్ వచ్చాయా? ఏం చెప్పింది అని అడుగుతుంది. రిపోర్ట్స్ చూసి ఏ సమస్య లేదని చెప్పిందని జానకి అబద్ధం చెప్తుంది. జానకి రామతో మాట్లాడటానికి ట్రై చేస్తుంది. అమ్మకి టెస్ట్ లు చేశారన్నారు కదా ఏం చెప్పారు అని రామ కంగారుగా అడుగుతాడు. జానకి జ్ఞానంబ రిపోర్ట్స్ రామ చేతిలో పెడుతుంది. తన ఫ్రెండ్ అమ్మ చనిపోయారని అని చెప్పి బాధపడతాడు. అది విని జానకి మరింతగా బాధపడుతుంది. ఆ విషయం చెప్పగానే జానకి వెక్కి వెక్కి ఏడుస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 19th:ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌
పొదరిల్లు: ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌
Nandamuri Mokshagna: ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
Nindu Manasulu Serial Today August 19th: నిండు మనసులు: గిన్నెలు తోమేసిన మామ అల్లుడు! అదిరిపోయిన ప్రేరణ కండీషన్!
నిండు మనసులు: గిన్నెలు తోమేసిన మామ అల్లుడు! అదిరిపోయిన ప్రేరణ కండీషన్!
Balakrishna: డిసెంబర్‌లో NBK 111... సర్జరీ జరిగినా షూటింగ్‌కు బాలయ్య?
డిసెంబర్‌లో NBK 111... సర్జరీ జరిగినా షూటింగ్‌కు బాలయ్య?

వీడియోలు

Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Embed widget