Brahmamudi February 21st: రుద్రాణి ప్లాన్ సక్సెస్, రాజ్ పెళ్లి ఖాయం- రాహుల్‌తో లేచిపోయేందుకు స్వప్న స్కెచ్
దుగ్గిరాల కుటుంబానికి తన కూతుర్ని కోడల్ని చేయాలని కనకం ప్లాన్స్ వేస్తోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
కావ్య స్వప్న కోసం పార్లర్ వెంట తిరుగుతూ ఉండగా టీవీలో తను కనిపిస్తుంది. వెంటనే ఈవెంట్ జరిగిన ప్లేస్ కి కావ్య వెళ్తుంది. అటు స్వప్నని ఫ్లాట్ చేయడానికి రాహుల్ అన్నీ వేషాలు వేస్తూ ఉంటాడు. గిటార్ వాయిస్తూ పాట పాడుతూ స్వప్న చేయి అందుకుంటాడు. టీవీలో చూపించిన ప్లేస్ ఇదే అయినా అక్క ఇక్కడ ఉండటం ఏంటని కావ్య అనుకుని అక్కడి వారికి స్వప్న ఫొటో చూపించి ఇక్కడ ఉందా అని అడుగుతుంది. అప్పు బైక్ ఆగిపోయి రోడ్డు మీద వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే కళ్యాణ్ కారు అటుగా వెళ్తుంటే రాయి పెట్టి కొట్టి కారు ఎక్కుతుంది. కారులో అప్పుని చూసి నువ్వు ఎప్పుడు ఎక్కావ్ అని అడుగుతాడు. ఎవరు లిఫ్ట్ ఇవ్వడం లేదు అందుకే రాయి పెట్టి కొట్టి కారు ఆపానని చెప్తుంది.
రాహుల్ ఖరీదైన నెక్లెస్ తీసుకొస్తాడు. అది తనకి కాబోయే భార్యకి గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకున్నా, ఆ దేవకన్య ఎవరో తెలుసా అని స్వప్నని అద్దంలో చూపించి అది నువ్వే అని తన మెడలో నెక్లెస్ తొడుగుతాడు. ఆ మూడు ముక్కలు కూడా చెప్పేయ్ నీలాంటి వాడికి భార్యగా ఉంటే ఇలాంటివి ఎన్నో గిఫ్ట్ లు వస్తాయి. ఆ రాజ్ తో పెళ్లి అయితే చాక్లెట్స్ తప్ప ఏమీ రావని స్వప్న మనసులో అనుకుంటాడు. నా జీవితంలోకి రాబోయే దేవకన్య నువ్వే అని చెప్పి మళ్ళీ తప్పు చేశాను సోరి రాజ్ కి కాబోయే భార్యవి అని డ్రామా స్టార్ట్ చేస్తాడు. మీరమి తప్పు చెయ్యలేదు రాజ్ ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని స్వప్న అంటుంది. మీ మనసు దోచుకున్న వ్యక్తి ఎవరు అని రాహుల్ అడుగుతాడు. స్వప్న చెప్పే టైమ్ కి కావ్య వచ్చి వాళ్ళ రూమ్ డోర్ కొడుతుంది. ఎంతకీ తీయకపోయేసరికి తనే డోర్ ఓపెన్ చేస్తుంది.
Also Read: దివ్య ఎంట్రీ అదుర్స్- ప్రేమ్ కి కొడుకు, కొత్త కథతో గృహలక్ష్మి
స్వప్న రాహుల్ తో కలిసి ఉండటం చూసి షాక్ అవుతుంది. అక్కడ పెళ్లి చూపులు పెట్టుకుని ఇక్కడ ఎందుకు ఉన్నావ్ అని నిలదీస్తుంది. స్వప్న విషయం చెప్పకుండా దాటేసి కావ్య మీద రివర్స్ లో అరుస్తుంది. కూర్చుని కూర్చుని బోర్ కొడుతుంది పక్కనే ఉన్న పార్లర్ కి వెళ్ళి ఉందేమో చూసి తీసుకొస్తానని రాజ్ వెళ్లబోతుండగా కావ్య ఎదురుపడుతుంది. నువ్వు ఎందుకు వచ్చావ్ అని రాజ్ అడుగుతాడు. అప్పుడు స్వప్న ఎంట్రీ ఇస్తుంది. వెంటనే రాజ్ వాళ్ళ తాతయ్య దగ్గరకి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుని డ్రామా మొదలుపెడుతుంది. తిరిగి వస్తుంటే కారు ట్రబుల్ ఇచ్చి ఆగిపోయింది ఫోన్ చేద్దామంటే స్విచ్ ఆఫ్ అయ్యింది అని కొత్త కథ అల్లుతూ స్వప్న కన్నీళ్ళు పెట్టుకున్నట్టు నటిస్తుంది. అందరూ స్వప్న మాటలు నమ్ముతారు. స్వప్న తనకి అన్ని విధాలుగా నచ్చిందని అపర్ణ అంటుంది.
Also Read: అభి ప్లాన్ తిప్పికొట్టిన చిత్ర- వేద పరిస్థితి చూసి విలవిల్లాడిపోయిన యష్
ఆ మాటకి రుద్రాణి సంతోషంగా ఈరోజే నిశ్చితార్థం పెట్టుకుందామని అంటుంది. ఇప్పటికిప్పుడు నిశ్చితార్థం ఎందుకని అపర్ణ అంటుంది. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చినప్పుడే వీళ్ళ సంబంధం నచ్చిందని రుద్రాణి తండ్రి చెప్తాడు. అందరి మొహాలు వెలిగిపోతాయి కానీ స్వప్న మాత్రం మొహం మాడ్చుకుంటుంది. రుద్రాణి పంతుల్ని పిలిపిస్తుంది. ఇద్దరి పేరు మీద చూస్తే జాతకాలు చూసి పంతులు మూడు నెలల వరకు ముహూర్తాలు లేవని అంటాడు. మూడు నెలల్లో కనకం వేసుకున్న రిచ్ రంగు వెలిసిపోతుందని రుద్రాణి మనసులో అనుకుంటుంది. కానీ కనకం మాత్రం కుదరదని గట్టిగా అరుస్తుంది.