By: ABP Desam | Updated at : 21 Feb 2023 07:54 AM (IST)
Edited By: Soundarya
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
యష్ తన ఫ్లాట్స్ లోని రాజేశ్వరి కూతురు కీర్తనతో విన్నీకి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాడు. వీళ్లిద్దరి జంట బాగుంది కదా అని యష్ అంటే అవును కానీ కీర్తన కాస్తా పొట్టిగా ఉంటుంది అంతే అని అంటుంది. ప్రతిదానికి విన్నీ బదులు వేద సమాధానం చెప్తుంది. అది విని యష్ రగిలిపోతాడు. అందరూ విన్నీ గురించి మంచిగా చెప్తుంటే వేద మాత్రం తనకి సిగరెట్ తాగుతాడని, మందు కొడతాడని, అమ్మాయిలతో పార్టీ చేసుకున్నప్పుడు మాత్రమే అలాంటివి చేస్తాడని అంటుంది. ఈ సంబంధం చెడగొట్టాలని వేద ట్రై చేస్తుందని యష్ మనసులో అనుకుంటాడు. అన్నీ వేద మాట్లాడుతుంటే పనిగట్టుకుని మరీ సంబంధం చెడగొట్టాలని చూస్తుందని యష్ తిట్టుకుంటాడు.
Also Read: 'ఆ తాళి తియ్యగలవా వసుధార'? ప్రశ్నల వర్షం కురిపించిన రిషి- కొడుకుని సమర్థించిన జగతి
కీర్తన చాలా మంచిదని యష్ అంటుంటే వేద వెటకారంగా అవునవును అమ్మాయి చాలా మంచిది, ఆంటీ ఇంకా మంచిదని అంటుంది. చాలా మంచి సంబంధం హ్యపీగా చేసుకోవచ్చు అని వేద అనేసరికి రాజేశ్వరి మొహం వెలిగిపోతుంది. అయితే ముహూర్తాలు పెట్టుకుందామని అంటే వేద రాజేశ్వరి గురించి చెప్తుంది. ఫ్లాట్స్ లో మీరు చిట్టీలు వేసి ఏదో మోసం చేశారాంట కదా కోర్టులు, పోలీస్ కేసు అని తిరుగుతున్నారంట కదా అని వేద నిజం చెప్తుంది. ఈ సంబంధం చేసుకోవా అని విన్నీ వెటకారంగా మాట్లాడుతుంది. ఆ మాటలు విని రాజేశ్వరి వేదని తిడుతుంది. అసలు ఈ సంబంధం చెడగొట్టాలని చేస్తున్నావ్ కదా అరుస్తుంటే విన్నీ కోపంగా షటప్ అని అరుస్తాడు. వేద చెప్పబట్టే అసలు ఈ పెళ్లి చూపులకు ఒప్పుకున్నా మీరు నా ముందే నా బెస్ట్ ఫ్రెండ్ ని తిడుతున్నారు అని విన్నీ సీరియస్ అయి వెళ్ళిపోతాడు.
మీ ఆయన మా వెంట తిరిగాడు అబ్బాయి మంచిది చేసుకుంటే చాలా బాగుంటుందని అంటే ఒప్పుకున్నాను అందరి ముందు నీ భర్తని, మమ్మల్ని అవమానించావ్ అని రాజేశ్వరి తిట్టేసి వెళ్ళిపోతుంది. భ్రమరాంబిక చెప్పిన ప్లాన్ అమలు చేసేందుకు అభిమన్యు మాళవికని ఆఫీసుకి తీసుకుని వస్తాడు. కంపెనీలో పార్టనర్ ని చేయబోతున్నా ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చెయ్యి అని అంటాడు. మాళవిక వాటిని చూడకుండానే సంతకాలు పెడుతుంటే చిత్ర దాన్ని చెడగొట్టాలని కాఫీ తీసుకొచ్చి ఆ డాక్యుమెంట్స్ మీద కావాలని పడేలా చేస్తుంది. ఇది పోతే ఇంకో డాక్యుమెంట్ రెడీ చేయిస్తాను ఫైనల్ గా నేను అనుకున్నదే జరుగుతుందని అభి చిత్రకి తగిలేలా అంటాడు.
Also Read: 'ఆ తాళి తియ్యగలవా వసుధార'? ప్రశ్నల వర్షం కురిపించిన రిషి- కొడుకుని సమర్థించిన జగతి
యష్ తన రూమ్ లోకి వచ్చి వేద మాటలు తలుచుకుని రగిలిపోతాడు. కావాలనే ఇదంతా చేశావ్ కదా అని కొప్పడతాడు. విన్నీకి అసలు పెళ్లి చేయకూడదని అనుకుంటున్నావా అని ప్రశ్నిస్తాడు. వేద చెప్తున్నా కూడా వినిపించుకోకుండా అరుస్తూనే ఉంటాడు. కీర్తన వేదని కలిసి ఇష్టం లేకుండా మీ ఫ్రెండ్ తో పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది నేను వేరే అబ్బాయిని ప్రేమించాను అతడినే పెళ్లి చేసుకుంటాను లేదంటే చచ్చిపోతాను అని వేద కాళ్ళ మీద పడుతుంది. జరిగింది చెప్పనివ్వకుండా మాటలు అని మనసుని బాధపెడుతున్నారని వేద ఎమోషనల్ అవుతుంది. మీ ఆవేశం మీదే కానీ ఎదుటి వాళ్ళని ఎప్పుడు అర్థం చేసుకుంటారు, మీరు మారరా నన్ను అర్థం చేసుకోరా అని కళ్ళు తిరిగి యష్ మీద పడిపోతుంది. తన ముక్కు వెంట రక్తం వస్తుంది. యష్ వెంటనే వేదని ఎత్తుకుని హాస్పిటల్ కి వస్తాడు. వెంటనే విన్నీ కూడా వస్తాడు.
DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య
Suriya Jyotika: ముంబైకి మకాం మార్చిన సూర్య, జ్యోతిక - తొలిసారి తల్లిదండ్రులను వదిలి..
18 ఏళ్లుగా అదేపని, చోరీ డబ్బుతో ఏకంగా ఇల్లే కట్టేశారు - సూపర్ స్టార్ కూతురికే షాకిచ్చిన పనివారు
Nithiin Rashmika New Movie : నితిన్ ఫ్లాపులు, రష్మిక కాంట్రవర్సీలు - కొత్త సినిమా కబురులో ఫుల్ సెటైర్లు
Dasara: అదరగొట్టే మాస్ స్టెప్స్‌తో ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ - ‘దసరా’ ఫస్ట్ వీడియో సాంగ్ వచ్చేసింది!
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్
IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!
TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!
Pragya Nagra: ఉగాదికి ఇంత అందంగా ముస్తాబైన ఈ తమిళ బ్యూటీ ఎవరో తెలుసా?