Janaki Kalaganaledu December 31st: గోవిందరాజులకి పక్షవాతం, ఇంట్లో నుంచి వెళ్లిపోతామన్న మల్లిక- రామా, జానకిని తప్పుపట్టిన జ్ఞానంబ
జానకి ఐపీఎస్ చదవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
![Janaki Kalaganaledu December 31st: గోవిందరాజులకి పక్షవాతం, ఇంట్లో నుంచి వెళ్లిపోతామన్న మల్లిక- రామా, జానకిని తప్పుపట్టిన జ్ఞానంబ Janaki Kalaganaledu Serial December 31st Episode 466 Written Update Today Episode Janaki Kalaganaledu December 31st: గోవిందరాజులకి పక్షవాతం, ఇంట్లో నుంచి వెళ్లిపోతామన్న మల్లిక- రామా, జానకిని తప్పుపట్టిన జ్ఞానంబ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/31/705ec66463f93686e2f6c3eac0860bba1672462073568521_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
రామా రూ.20 లక్షలు అప్పు చేసిన విషయం ఇంట్లో తెలియడంతో మల్లిక రచ్చ రచ్చ చేస్తుంది. చరణ్ డబ్బులు తీసుకుని ఉడాయించిన విషయం రామా వచ్చి ఇంట్లో వాళ్ళకి చెప్పడంతో మల్లిక నోటికి పని చెప్తుంది. రూ.20 లక్షలు ఇచ్చినట్టు రశీదు ఏమైనా ఉందా నిలదీస్తుంది. అఖిల్ కూడా జానకిని నిందిస్తాడు. మాకు అటువంటి స్వార్థం ఏమి లేదని నీ ఫ్యూచర్ కోసం ఆలోచించి మీ అన్నయ్య దోషిలా నిలబడ్డాడు అని జానకి చెప్తుంది. కానీ మల్లిక మాత్రం వినకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. ఇంట్లో చెప్పకపోవడం తన తప్పే అని కానీ ఎవరిని మోసం చేయలేదని స్నేహితుడిని నమ్మి మోసపోయాను అని రామా బాధగా అంటాడు.
Also Read: నందు దుమ్ముదులిపిన తులసి- చిక్కుల్లో పడబోతున్న సామ్రాట్?
మీ అన్నయ్య, వదిన కలిసి రూ.20 లక్షలు కొట్టేస్తే బండగా నిల్చున్నారు ఏంటి నిలదీసి అడగమని మల్లిక విష్ణుని ఉసిగొల్పుతుంది. దీంతో విష్ణు కూడా రామాని అనుమానిస్తాడు. ఎందుకు ఇలా చేశావ్ అని నిలదీస్తాడు. ఆస్తిని వాతాలుగా పంచండి అని మల్లిక డిమాండ్ చేస్తుంది. ఎవరికి వాళ్ళం వెళ్లిపోతాం, అప్పులే కట్టుకుంటాం ఏదో ఒకటి చేస్తామని అంటుంది. అఖిల్ కూడా మల్లికకి వంత పాడతాడు. జెస్సి మాట్లాడుతుంటే అఖిల్ అడ్డుపడతాడు. విడిపోవాలనే ఆలోచన మనసులో నుంచి తీసేయమని గోవిందరాజులు అడుగుతాడు. కానీ మల్లిక మాత్రం కలిసి ఉండటం వల్ల మిగిలేది బూడిద వాటాలు పంచుతారా లేదా అని జ్ఞానంబని డిమాండ్ చేస్తుంది. ఆ మాటలకి గోవిందరాజులకి గుండె పోటు వచ్చి కిందపడిపోతాడు. అప్పుడే జ్ఞానంబ ఫ్యామిలీ ఫోటో కిందపడిపోతుంది.
డాక్టర్ వచ్చి గోవిందరాజుల్ని పరిశీలిస్తాడు. సడెన్ గా షాక్ కి గురికావడం వల్ల పక్షవాతం వచ్చిందని డాక్టర్ చెప్తాడు. ఆ మాట వినిన్ అందరూ షాక్ అవుతాడు. కాలు పూర్తిగా పడిపోయిందని, చేతికి స్పర్శ పోయిందని అంటాడు. సిటీలో ఉన్న హాస్పిటల్ లో టెస్ట్ లు చేయించి తర్వాత చికిత్స మొదలుపెడదాం అప్పటి వరకు మందులు వాడమని చెప్తాడు. ఇప్పుడు తన డబ్బు పరిస్థితి ఏంటని వడ్డీ వ్యాపారి భాస్కర్ మనసులో అనుకుంటాడు. గోవిందరాజులు పరిస్థితి తలుచుకుని జ్ఞానంబ విలవిల్లాడిపోతుంది. స్పృహలోకి వచ్చిన గోవిందరాజులు లేచి కూర్చోడానికి ప్రయత్నిస్తాడు కానీ లేవలేక పడిపోతాడు. తనకి ఏమైందని అడుగుతాడు. కాలు, చెయ్యి కదలడం లేదని ఏమైందని అడుగుతాడు. కాలు, చేతికి రక్తప్రసరణ తగ్గిపోయి పక్షవాతం వచ్చిందని మల్లిక చెప్తుంది.
Also Read: జగతి ప్లాన్ వినేసిన దేవయాని- రాజీవ్ తో వసు పెళ్ళిని రిషి అడ్డుకుంటాడా?
మావయ్యకి ఇలా జరగడం బాధగా ఉన్నా కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోవాల్సిందే అని మల్లిక కఠినంగా చెప్తుంది. జానకి, విష్ణు వద్దని చెప్తున్నా కూడా మల్లిక మాత్రం తన మాట తనదే అని అంటుంది. మావయ్య పరిస్థితి కుడుటపడే వరకి అయినా ఉందామని జెస్సి అంటుంది కానీ మల్లిక మాత్రం వినదు. జానకి ఏ ముహూర్తాన ఇంట్లో అడుగు పెట్టిందో అప్పటి నుంచి ఇంట్లో అన్ని సమస్యలే అని మల్లిక తిడుతుంది. కనీసం తను బతికున్నంత వరకు అయినా విడిపోవాలనే ఆలోచన మానుకోమని గోవిందరాజులు బతిమలాడతాడు. కానీ మల్లిక మాత్రం వినదు. ఇక వడ్డీ వ్యాపారి కూడా ఇంట్లో ఎవరిని నమ్మలేనని అంటాడు.
తరువాయి భాగంలో..
జ్ఞానంబ కూడా రామాని తప్పు పడుతుంది. నువ్వు తాకట్టు పెట్టింది ఇంటి కాగితాలు మాత్రమే కాదు పరువు కూడా అది చూడు ఎలా ఉందో. నీ అంతట నువ్వే ఈ నిర్ణయం తీసుకున్నావో లేదంటే ఎవరైనా చెప్తే చేశావో అని జానకిని ఉద్దేశించి అంటుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)