By: ABP Desam | Updated at : 19 Dec 2022 11:34 AM (IST)
Edited By: Soundarya
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
మల్లిక రిపోర్ట్స్ తీసుకుని జెస్సి దగ్గరకి వెళ్లబోతుంటే జ్ఞానంబ పిలుస్తుంది. ఈ రిపోర్ట్ పోలేరమ్మ చూస్తే మళ్ళీ ఇవేంటని అడుగుతుంది అనుకుని వాటిని అక్కడ దాచి పెట్టి వెళ్ళిపోతుంది. అదంతా జానకి చూస్తూనే ఉంటుంది. మల్లిక వెళ్ళగానే జానకి వచ్చి ఆ రిపోర్ట్ తీసుకుంటుంది. మల్లిక మళ్ళీ వచ్చి వాటిని చూస్తే రిపోర్ట్స్ కనిపించవు. మల్లిక వెతుకుతూ ఉంటే చికిత వచ్చి కదిలిస్తుంది. గదిలోకి వచ్చిన జానకి వాటిని చింపేస్తుంది. రిపోర్ట్స్ కి సంబంధించి జానకి ఏదో దాచిపెడుతుంది అదేంటో తెలుసుకోవాలని మల్లిక అనుకుంటుంది.
రామా బయట నిలబడి బండి తుడుచుకుంటూ ఉన్నప్పుడు గోవిందరాజులు వస్తాడు. అప్పుడే ఒక్కసారిగా గుండెల్లో నొప్పిగా ఉంది గోవిందరాజులు పడబోతుంటే రామా చూసి పట్టుకుంటాడు. గదిలోకి వచ్చి మందులు తీసుకుంటుంటే జ్ఞానంబ ఏంటని అడుగుతుంది. ఏమి లేదని చెప్పి రామా పరుగున వెళ్ళి గోవిందరాజులకి ట్యాబ్లెట్స్ ఇస్తాడు. అది చూసి జానకి, జ్ఞానంబ కంగారుపడతారు. మందులు వేసుకోకపోయేసరికి గుండెల్లో కాస్త నొప్పి వచ్చిందని అంటాడు. తనకి ఏమైనా అయితే కుటుంబాన్ని చూసుకోవడానికి నువ్వు ఉన్నావ్ కదా అని రామాతో అంటాడు.
గోవిందరాజులు: ప్రతి తండ్రికి తను లేకపోతే కుటుంబం ఏమైపోతుందో అని బెంగ ఉంటుంది, కానీ నాకు ఆ బెంగ లేదు పదేళ్ళ వయస్సులోనే నువ్వు నాకు తండ్రివి అయ్యావు. నా చెయ్యి పట్టి నన్ను నడిపిస్తున్నావ్. కుటుంబ భారాన్ని మోస్తున్నావ్
Also Read: ఏడిపించేసిన డాక్టర్ బాబు- తల్లిని చూసి ఎమోషనల్ అయిన కార్తీక్, శౌర్యని చేరుకున్న సౌందర్య
జ్ఞానంబ: మీకు ఇప్పుడు ఏమైందని అలా మాట్లాడుతున్నారు
గోవిందరాజులు: నాకు ఉన్న దిగులు ఒక్కటే అఖిల్ బాగా చదువుకుని ఎప్పుడు స్థిరపడతాడని, వెన్నెల పెళ్లి జరగాలి ఇవే నాకు ఉన్న కోరికలు
రామా: అఖిల్ తొందర్లోనే ఏదో ఒక ఉద్యోగం తీసుకుంటాడు, వెన్నెలకి నానమ్మ పెళ్లి సంబంధం చూస్తుంది మీరు దీని గురించి ఏమి ఆలోచించకండి విశ్రాంతి తీసుకోమని చెప్పి తన గదిలోకి తీసుకుని వెళతారు. అఖిల్ భవిష్యత్ గురించి చాలా దిగులు పెట్టుకున్నారు ఎలా వాడిని ప్రయోజకుడిని చేయడం అని రామా ఆలోచిస్తూ ఉంటాడు. జానకి వాళ్ళు మాట్లాడుకోవడం అఖిల్ వింటాడు.
రామా: అఖిల్ ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటే అమ్మానాన్న మనశ్శాంతిగా ఉంటారు
జానకి: ఏదో ఒక ఉద్యోగం చేయడం కాదు ఇంజినీరింగ్ కంప్లీట్ చేశాడు కాబట్టి దానికి తగ్గ ఉద్యోగం చూసుకోమని చెప్పండి. పెళ్లి అయిన తర్వాత కూడా అఖిల్ బాధ్యత లేకుండా ఖాళీగా ఉంటే వాళ్ళు బాధపడతారు. అది అఖిల్ కి అర్థం అయ్యేలా మీరే చెప్పండి. ఎవరైనా లైఫ్ లో సెటిల్ అయినాక పెళ్లి చేసుకుంటారు కానీ అఖిల్ తొందరపడి సెటిల్ అవకుండానే పెళ్లి చేసుకున్నాడు. అందుకే తన మీద భారం పడింది
అఖిల్: ఎందుకు వదిన నేనంటే నీకు అంత కోపం
రామా: నీ గురించి వదిన తప్పుగా ఏం చెప్పడం లేదు
Also Read: చిలిపి అల్లరి చేస్తూ భార్యని ఉడికించిన యష్- బుంగమూతి పెట్టిన వేద
అఖిల్: ఎందుకో గాని వదిన నా మీద కోపం పెంచుకుంది. దీని వల్ల జెస్సి, మీ ముందు నన్ను చెడ్డవాడిని చేస్తుంది. నన్ను బ్యాడ్ చెయ్యాలని చూడకు ప్లీజ్ వదిన అనేసి కోపంగా వెళ్ళిపోతాడు
అఖిల్ మాటలు పట్టించుకోవద్దని రామా సర్ది చెప్తాడు. మల్లిక అదంతా చూసి తెగ సంబరపడుతుంది. మెడిసిన్స్ చీటీ తీసుకుని జానకి దగ్గరకి వెళ్లబోతుంటే అఖిల్ ఆపి తను తీసుకొస్తానని అంటాడు. ఇక నుంచి ఇలాంటివి ఏమైనా కావాలని అంటే తనని అడగమని చెప్తాడు. జెస్సి ముందు నటించడం కోసం సర్టిఫికెట్స్ తీసుకుంటూ ఉంటాడు. జాబ్ వెతుక్కోవడానికి వెళ్తాడు.
DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య
Suriya Jyotika: ముంబైకి మకాం మార్చిన సూర్య, జ్యోతిక - తొలిసారి తల్లిదండ్రులను వదిలి..
18 ఏళ్లుగా అదేపని, చోరీ డబ్బుతో ఏకంగా ఇల్లే కట్టేశారు - సూపర్ స్టార్ కూతురికే షాకిచ్చిన పనివారు
Nithiin Rashmika New Movie : నితిన్ ఫ్లాపులు, రష్మిక కాంట్రవర్సీలు - కొత్త సినిమా కబురులో ఫుల్ సెటైర్లు
Dasara: అదరగొట్టే మాస్ స్టెప్స్‌తో ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ - ‘దసరా’ ఫస్ట్ వీడియో సాంగ్ వచ్చేసింది!
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్
IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!
TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!
Pragya Nagra: ఉగాదికి ఇంత అందంగా ముస్తాబైన ఈ తమిళ బ్యూటీ ఎవరో తెలుసా?