Janaki Kalaganaledu September 19th: అఖిల్ ఛీటింగ్ గేమ్, మొదటి తప్పు చేసిన జానకి- సంబరంలో మల్లిక
అఖిల్ జెస్సి నుంచి తప్పించుకునేందుకు సూసైడ్ డ్రామా ఆడతాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
జెస్సి సూసైడ్ దాకా వచ్చింది టైమ్ లేదు అఖిల్ ఏమో చీటింగ్ గేమ్ ఆడుతున్నాడు. ఒకవైపు జెస్సి సమస్య మరో వైపు అత్తయ్యగారు నా మీద పెట్టిన బాధ్యత దీని నుంచి ఎలా బయట పడాలి అని జానకి ఆలోచిస్తూ ఉంటే రామా వస్తాడు. నీటి బిందువులాంటి సమస్యకి అంతగా ఎందుకు ఆలోచిస్తున్నారని రామా అంటాడు. భయం వల్ల అఖిల అమ్మ ముందు వాడు నిజం ఒప్పుకోవడం లేదు మీ ఐపీఎస్ బుర్రకి పదును పెట్టండి నిజం అదే బయట పడుతుంది. కోడలిగా అయితే బంధాలు అడ్డు వస్తాయి, అదే ఐపీఎస్ ఆఫీసర్ గా అయితే సమస్య మీదే ఏకాగ్రత ఉంటుంది ఎలాగైనా సమస్యని పరిష్కారం దొరుకుతుందని రామా చెప్తాడు. నిజమే మీరు చెప్పినట్టు ఆలోచిస్తే సమస్య పరిష్కారం అవుతుందని అంటుంది. డీ ఎన్ ఏ టెస్ట్ చేయిస్తే నిజం బయటపడుతుందని జానకి చెప్తుంది. కానీ అందుకు అత్తయ్యగారు ఒప్పుకుంటారా అని జానకి అడుగుతుంది. అమ్మని నేను ఒప్పిస్తాను అని రామా చెప్తాడు.
ఎందుకో తను పట్టిన కుందేలుగు మూడే కాళ్ళు అన్నట్టు ప్రవర్తిస్తుంది. ఎన్ని రకాలుగా చెప్పినా మొండిపట్టు పట్టి ఆ అమ్మాయి సమస్యని ఇంటి దాకా తీసుకొచ్చి మనల్ని ఇబ్బంది పెడుతుంది. జానకి అలా చేయడం నన్ను చాలా బాధపెడుతుందని జ్ఞానంబ భర్తతో చెప్తుంది. పెళ్ళైన ఇన్ని రోజుల్లో జానకి ఇలా ఎప్పుడైనా చేసిందా తను బాధ పడిందే కానీ మన దాకా విషయం తీసుకురాలేదు కానీ ఇప్పుడు ఇలా చేస్తుంది అంటే ఒక్కసారి తన వైపు నుంచి కూడా ఆలోచించు అని గోవిందరాజులు చెప్తాడు. అప్పుడే మల్లిక అత్తయ్యగారు అఖిల్ ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పి తలుపు వేసుకున్నాడు అని చెప్తుంది.
Also Read: ప్రేమపక్షుల మధ్య మనస్పర్థలు, వసుకి రిషి సూటి ప్రశ్న- దూరమవుతోన్న తండ్రీ కొడుకుల బంధం
అఖిల్ సూసైడ్ చేసుకునేందుకు విషం తాగబోతుంటే జ్ఞానంబ వాళ్ళు వచ్చి తలుపు కొడతారు. చెయ్యని తప్పుకి నన్ను దోషిగా చూస్తున్నారు అది నేను తట్టుకోలేక పోతున్నా నేను చచ్చిపోతాను అమ్మా అని ఏడుస్తూ నటిస్తాడు. రామా వచ్చి తలుపు బద్దలు కొడతాడు. ఇంత అవమానం నేను భరించలేను, స్వంత మనుషులే అవమానిస్తుంటే తట్టుకోలేకపోతున్నా అని అంటాడు. సరిగా అఖిల్ మందు తాగే టైమ్ కి రామా తలుపు బద్ధలు కొట్టి కాపాడతాడు. ఎందుకు ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకున్నావ్ అని జ్ఞానంబ బాధగా అడుగుతుంది. అఖిల్ మాత్రం ఏడుస్తూ నటిస్తాడు. వదినకి నా మీద నమ్మకం లేక డీ ఎన్ ఏ టెస్ట్ చేయించి అబద్దాన్ని ప్రూవ్ చెయ్యాలని ట్రై చేస్తుంది. అన్నయ్య కూడా వదినకే సపోర్ట్ చేస్తున్నాడు. నేను దేవుదులా భావించే అన్నయ్య నన్ను దోషిలా చూస్తుంటే నేను ఎలా భరిస్తాను అందుకే నేను చావాలని అనుకున్నా’ అని అఖిల్ చెప్తాడు.
20 ఏళ్లుగా వాడిని చూస్తున్నావ్ వాడు అర్థం కాలేదా అని రామాని అడుగుతుంది. అఖిల్ కి డీ ఎన్ ఏ పరీక్ష చేయించాలని అనుకున్నావా లేదా అని జ్ఞానంబ జానకిని అడుగుతుంది. అవును అత్తయ్యగారు కానీ... అని జానకి చెప్పబోతుంటే ఇంకేం మాట్లాడకు అని జ్ఞానంబ అరుస్తుంది. పోలీసు బుద్ధితో సమస్య పరిష్కరించాలని చూశావ్ అది తట్టుకోలేక అఖిల్ చనిపోవాలని అనుకున్నాడు అని జ్ఞానంబ ఆగరం వ్యక్తం చేస్తుంది. విషయం బయట పడితే నలుగురు అవమానిస్తారు అని ఈ నిర్ణయం తీసుకున్నాం సమస్య నుంచి బయటపడటానికి ఇలా చేద్దాం అనుకున్నాం కానీ వాడు మమ్మల్ని అపార్థం చేసుకుని ఇలా చేస్తాడు అనుకోలేదని రామా సర్ది చెప్పేందుకు చూస్తాడు. కానీ జ్ఞానంబ మాత్రం వినదు. బయటకి మాత్రమే పోలీసు ఉద్యోగం ఇంట్లో కోడలివి మాత్రమే అని చెప్పాను కూడా నువ్వు నా మాట వినలేదు ఇంత జరిగినా కూడా నిన్ను ఇలాగే వదిలేస్తే నీ తప్పులు పెరిగిపోయి అవి ఎంతటి ప్రమాదానికి అయినా దారి తీస్తాయని అంటుంది.
నేను ఎన్ని సార్లు హెచ్చరించినా జానకి నా మాట పట్టించుకోలేదు. బాధ్యత విస్మరించి పరీక్ష రాయకుండా ఉంది, జెస్సి మాటలు నమ్మి ఇంట్లో అందరి మనసులు గాయపడేలా చేసింది. ఈరోజు అఖిల్ ప్రాణాలు తీసుకునే వరకి వచ్చింది. ఈసారి కూడా నిన్ను క్షమిస్తే నేను పెద్ద తప్పు చేసినట్టే అవుతుంది. నేను పెట్టిన ఐదు షరతుల్లో ఒకటి తప్పి పెద్ద తప్పే చేసింది. నేను ఇచ్చిన ఐదు తప్పుల్లో ఒకటి జరిగిపోయింది అని జ్ఞానంబ వెళ్ళి గోడ మీద ఉన్న మొదటి అంకె కొట్టేస్తుంది. అది చూసి మల్లిక తెగ సంబరపడుతుంది. తొందరలోనే మిగతా తప్పులు చేసి వాటిని కొట్టించేసేయాలి అని మల్లిక మనసులో అనుకుంటుంది.