Janaki Kalaganaledu September 16th: సూసైడ్ చేసుకోబోయిన అఖిల్- జెస్సి గురించి ఇంట్లో నిజం చెప్పేసిన జానకి
అబార్షన్ చేయించుకోమని జెస్సిని అఖిల్ బెదిరిస్తాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
జెస్సి చెయ్యి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేస్తుంది. విషయం తెలుసుకుని జానకి ఎగ్జామ్ రాయకుండా హడావుడిగా వెళ్తుంది. జెస్సి ఇంటికి వెళ్తుంది జానకి. ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేసిందని అడుగుతుంది. నువ్వే ధైర్యం చెప్పి ఇలాంటి పని చేయవద్దని చెప్పమ్మా అని మేరీ జానకితో చెప్తుంది. చచ్చిపోతే సమస్య తీరిపోతుందా, ఒక్కగానొక్క కూతురివి విషయం తెలిసి నలుగురు నాలుగు మాటలు అంటే వాళ్ళు చచ్చిపోతారు అని జానకి చెప్తుంది. నేను రామా గారు నీతో అఖిల్ పెళ్లి చెయ్యాలని చూస్తుంటే నువ్వు ఎందుకు ఇలా చేశావని అడుగుతుంది. అఖిల్ ఫోన్ చేసి అబార్షన్ చేయించుకుంటావా లేదంటే పర్మినెంట్ గా నన్ను వదులుకుంటావా అని బెదిరిస్తుంటే ఏం చేసేది అని జెస్సి ఏడుస్తూ చెప్తుంది. మీ అత్తయ్యగారు పెళ్ళికి ఒప్పుకున్నా అఖిల్ నా నుంచి తప్పించుకోవాలని చూస్తే ఏం లాభం అని ఏడుస్తుంది.
అఖిల్ తో నీకు పెళ్లి చేసే బాధ్యత నాది అని జానకి మాట ఇస్తుంది. అనవసరమైన భయాలు పెట్టుకుని ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చెయ్యను అని నాకు మాట ఇవ్వు అని జానకి అడుగుతుంది. సరే అని జెస్సి మాట ఇస్తుంది. జానకి కాలేజీ ప్రిన్సిపల్ జ్ఞానంబకి ఫోన్ చేస్తుంది. మీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా జ్ఞానంబగారు అని అడుగుతుంది. ఎగ్జామ్ హాల్ దాకా వచ్చిన జానకి ఎగ్జామ్ రాయకుండానే వెనక్కి తిరిగి వెళ్లిపోయిందని చెప్తుంది. పెద్ద ప్రాబ్లం అయితే తప్ప జానకి ఎగ్జామ్ మిస్ అయ్యింది కదా అని అడుగుతున్నా అని అంటుంది. ఈ ఎగ్జామ్ ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవొద్దని ప్రిన్సిపల్ చెప్తుంది. ఆ మాట విని జ్ఞానంబ కోపంగా రామాని పిలుస్తాడు. జానకి పరీక్ష రాయకుండా ఎటో వెళ్ళిందని ప్రిన్సిపల్ ఫోన్ చేసి చెప్పారు ఎక్కడికి వెళ్లిందో నీకు తెలుసా అని అడుగుతుంది. లేదని అంటాడు.
Also Read: వేదని వదిలి మాళవిక చెయ్యి అందుకున్న యష్- జలస్ ఫీల్ అయిన అభిమన్యు
జానకిని ఇరికించాలని మల్లిక చూస్తుంది. మల్లిక అన్న దాంట్లో తప్పేమీ ఉందని జ్ఞానంబ అంటుంది. తను నమ్మింది నిజం అని జానకి ప్రవర్తిస్తుందని జ్ఞానంబ కోపంగా అంటుంది. జానకి కోసం ఇంట్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇంటికి వచ్చిన జానకిని పరీక్ష రాశావా అని జ్ఞానంబ అడుగుతుంది. లేదు అత్తయ్యగారు అని చెప్తుంది. జెస్సి ఆత్మహత్యాయత్నం చేసిందని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. అఖిల్ టెన్షన్ పడతాడు. వాళ్ళందరూ బాగా కుమిలిపోతున్నారు అందుకే వెళ్ళాను అని చెప్తుంది. రామా కంగారుగా ఎలా ఉందని అడుగుతాడు. ప్రమాదం ఏమి లేదు బాగానే ఉందని చెప్తుంది. ఇదొక నాటకం అని మల్లిక అంటుంది.
నీ చదువుకి ఇంటికి ఆటంకం కలగకుండా నిజాన్ని నిరూపించమని చెప్పాను ఇంకోసారి ఇలా జరిగితే ఊరుకొను అని జ్ఞానంబ హెచ్చరించి వెళ్ళిపోతుంది. రామా అఖిల్ ని మళ్ళీ అడుగుతాడు. నేను నిజమే చెప్తున్నా అని అఖిల్ అంటాడు. అమ్మ మీద ఒట్టేసినాక కూడా ఎందుకు నమ్మడం లేదని అఖిల్ అంటాడు. అందరికీ చెప్పే విషయం నాకు చెప్పకు తెలిసో తెలియకో తప్పు చేశావ్ నువ్వు ఒప్పుకుంటే ఏ సమస్య లేకుండా పరిష్కారం చేసే బాధ్యత నాది అని రామా అంటాడు. నాకు ఏ సంబంధం లేదని అఖిల్ గట్టిగా చెప్తాడు. మీ వదిన చెప్పింది అంటే నమ్ముతున్నా అని రామా అంటాడు. అఖిల్ అందరినీ నమ్మించడం కోసం సూసైడ్ చేసుకోబోతాడు.