Jagadhatri Serial Today November 27th: డీఎన్ఏ టెస్ట్ ఆపడానికి వైజయంతి చేసిన సాహసం ఏంటి..? అసలు కేదార్‌కు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించారా లేదా..?
Jagadhatri Serial Today Episode November 27: కేదార్‌కు, తండ్రికి డీఏన్ఏ పరీక్ష జరగకుండా నిలిపివేసేందుకు వైజయంత్రి పెద్ద సహాసమే చేస్తుంది. ఇంతకు టెస్ట్ జరిగిందా..లేదా..?

Jagadhatri Serial Today Episode: కేదార్, సుధాకర్‌కు డీఎన్‌ఏ టెస్ట్ చేయించాల్సిందేనన్న జగధాత్రి మాటలకు వైజయంతి భయపడిపోతుంది. ఈ వ్యవహారాన్ని ఎలాగైనా ఆపాలని అనుకుంటుంది. అటు కేదార్ కూడా తన తల్లికి జరిగిన అవమానాలు తొలగిపోవాలంటే ఖచ్చితంగా డీఎన్‌ఏ టెస్ట్ జరిపించాల్సేందే అంటాడు. ఈ ఇంటి గౌరవం కాపాడాలనే కేదార్ తల్లి ఈ ఇంటికి దూరమైందని...అలాంటి ఆవిడకి అవమానం జరగకూడదని జగధాత్రి అంటుంది. మధ్యలో కల్పించుకున్న నిశి...మేం కావాలని ఏదీ చేయలేదని నిజాన్ని నిరూపించమనే కదా కోరామని మండిపడుతుంది. అది నిరూపించేందుకే ఇప్పుడు డీఎన్‌ఏ పరీక్షకు పిలుస్తున్నామని జగధాత్రి సమాధానమిస్తుంది. కానీ డీఎన్‌ఏ టెస్ట్ గురించి నలగురికి తెలిస్తే పరువుపోతుందని కౌసికి జగధాత్రిని ప్రాధేయపడుతుంది. చిన్నప్పటి నుంచి కేదార్ పడిన అవమానాలు కంటే ఇది పెద్ద విషయమేమీ కాదని జగధాత్రి అంటుంది. మీ అవమానాల కోసం మేం పరువుపోగొట్టుకోవాలా అంటూ వైజయంతి మండిపడుతుంది. దీనికి జగధాత్రి గట్టిగానే బదులిస్తుంది. తన తల్లిని అవమానించి, తన పుట్టుకను నిరూపించుకోమన్నప్పుడే కేదార్ డీఎన్‌ఏ టెస్ట్ కోసం పట్టుబట్టేవాడని...ఈ ఇంటి పరువుకోసమే ఇన్నాళ్లు నోరుమెదపకుండా ఉంటున్నాడని చెబుతుంది. మీ అందరి కోసమే తాను మౌనం దాల్చాడని చెబుతుంది.
అటు యువరాజు సైతం డీఎన్ఏ టెస్ట్ జరగకూడదని మనసులో అనుకుంటాడు. టెస్ట్ జరిగితే వీడు నాన్న కొడుకేనని తేలిపోతుందని...ఆస్తిమొత్తానికి వాడే వారసుడవుతాడని అనుకుంటుండగానే...ల్యాబ్ టెక్నిషియన్ అక్కడికి వస్తాడు. ఇక్కడ డీఎన్‌ఏ పరీక్ష ఎవరికి జరిపించాలని అడుగుతాడు. నా భర్తకు, మామయ్య బ్లడ్ శాంపిల్ తీసుకుని డీఏన్‌ఏ మ్యాచ్ అవుతుందోలేదో చెప్పాలని జగధాత్రి చెబుతుంది. టెక్నిషియన్ సుధాకర్ నుంచి బ్లండ్ శాంపిల్ తీసుకోవడానికి రెడీ అవుతుండగా....వైజయంతి వచ్చి మధ్యలోనే నిలిపివేయిస్తుంది. జగధాత్రి అడ్డుకోబోగా నీ మొగుడు సంతోషం కోసం నా మొగుడి పరువు తీస్తానంటే నేను ఒప్పుకోను అంటుంది. ఇంట్లో ఉంచుకున్న పాపానికి మామీదే పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడుతుంది.ల్యాబ్ టెక్నిషియన్‌ను, లాయర్‌ను బయటకు వెళ్లాలని ఆదేశిస్తుంది. వెంటనే కల్పించుకున్న జగధాత్రి....ఇక్కడ ఇవాళ టెస్ట్ జరగకుండా ఎవ్వరూ వెళ్లరని చెబుతుంది. మీ కంగారే చెబుతుంది మేం తప్పుడు ఆరోపణలు చేయడం లేదని గట్టిగా నిలదీస్తుంది.
దీంతో చిర్రెత్తిపోయిన వైజయంతి పక్కనే ఉన్న నిశి చెంప పగులగొడుతుంది. నీ ఆవేశం, నీ మొగుడు దూకుడు వల్లే ఇదంతా జరిగిందని తిట్టిపోస్తుంది. ఈ ఇంటి పెద్దగా నేను చెబుతున్నాను. ఈ టెస్ట్ జరగడానికి వీల్లేదని వైజయంతి హుకుం జారీ చేస్తుంది. అదే స్థాయిలో జగధాత్రి కూడా టెస్ట్ జరిగి తీరుతుందని సమాధానిస్తుంది. ఏం జరిగినా ఇక్కడ టెస్ట్ జరిిప తీరుతామని చెబుతుంది. దీనికి వైజయంతి తాను చచ్చిపోయిన తర్వాతే ఆ టెస్ట్ జరిపించుకోండంటూ అక్కడే ఉన్న కత్తి తీసుకుని పోడుచుకునేందుకు ప్రయత్నించడంతో అందరూ ఆపుతారు. ఈ టెస్ట్ జరగదని చెప్పే వరకు తాను వినని మణికట్టు వద్ద కత్తి పెట్టుకుని బెదిరింపులకు దిగినా....జగధాత్రి మాత్రం టెస్ట్ జరిపే తీరుతామని అంటుంది. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెబుతుంది. దీంతో వైజయంతి చేతిమణికట్టు వద్ద కత్తితో కోసుకుంటుంది. దీంతో అందరూ భయపడిపోతారు. అప్పుడు కేదార్ ముందుకొచ్చి డీఎన్‌ఏ టెస్ట్ జరగదని పిన్ని అంటూ మాటిస్తాడు.అప్పుడు ధాత్రి అడ్డుచెప్పబోగా....ఇలా నేను ఈ ఇంటి కొడుకునని నిరూపించుకోలేనని తనకు అడ్డు చెప్పొద్దని చెబుతాడు. ఇంట్లో వాళ్ల ప్రేమ గెలుచుకోవడానికే ఇంత కష్టపడ్డానని..తల్లిని పోగొట్టుకున్న నేను ఇప్పుడు పిన్నిని పోగొట్టుకోలేనన్నాడు. ప్రాణాలు తీసి నిజాన్ని నిరూపించుకోలేనని చెప్పి టెక్నిషియన్‌ను అక్కడి నుంచి పంపించివేస్తాడు. లాయర్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
డాక్టర్ వద్దకు తీసుకెళ్తానని కేదార్ చెప్పినా వినకుండా తన కొడుకు, కోడల్ని తీసుకుని వైజయంతి ఆస్పత్రికి వెళ్తుంది. ఇంట్లో గొడవలతో మనశ్శాంతి లేకుండా పోయిందని సుధాకర్ కౌశిక్‌తో అంటాడు. నా వల్లే ఈ ఇంట్లో ఇన్ని సమస్యలు వచ్చాయని బాధపడతాడు. అటు వైజయంతి కొట్టడంతో నిశి చాలా ఫీలవుతుంటే యువరాజు ఆమెను సముదాయిస్తాడు. ఎలాగైనా డీఎన్‌ఏ టెస్ట్ ఆపాలనే అలా చేసిందని సర్దిచెబుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన వైజయంతి మీద కూడా నిశి మండిపడుతుంది. జగధాత్రిని ఆపడానికి నేను అలా చేయాల్సి వచ్చిందని...తాను ఏం చేసినా మీకోసమే కదా అని బదులిస్తుంది. శ్రీవల్లి మీ కుమార్తే కదా అని నిశి నిలదీయగా...ఆమె నా కుమార్తె కాదు అని చెప్పబోయి ఆగిపోతుంది. ఈ తింగరదానికి నిజం చెబితే...ఎక్కడో ఒక చోట వాగుతుందని భయపడి ఆపేస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండకపోతే ఆ కేదార్, శ్రీవల్లి ఆస్తి మొత్తం తీసుకునిపోతారని నోరుజారడంతో....శ్రీవల్లికి ఆస్తి ఎందుకుపోతుందని యువరాజు నిలదీస్తాడు. దానికి వేరే లెక్క ఉందిలే అంటూ వైజయంతి దాటవేస్తుంది.
డీఎన్ఏ టెస్ట్ జరగనివ్వకుండా ఎందుకు ఆపావంటూ జగధాత్రి కేదార్‌ను ప్రశ్నిస్తుంది. వాళ్లను బాధపెట్టి ఈ టెస్ట్ చేయించుకోలేనని కేదార్ బదులిస్తాడు. నిజం బయటపడకూడదనే అత్తయ్యగారు చెయ్యికోసుకుని నాటకమాడిందని జగధాత్రి అంటుంది.




















