Jagadhatri Serial Today December1: ఆత్మహత్య చేసుకోవాలనుకున్న కుటుంబాన్ని జగధాత్రి, కేధార్ ఎలా కాపాడారు..?అసలు వాళ్లు ఎందుకు చనిపోదామనుకున్నారు..?
Jagadhatri Serial Today Episode December1: పురుగుల మందు డబ్బాతో వెళ్తున్న పెద్దయనను అనుసరించి వెళ్లిన జగధాత్రి,కేధార్ అక్కడ ఏం చూశారు.? ఆయన పురుగుల మందుతో ఏం చేశాడు..?

Jagadhatri Serial Today Episode: ఇంద్రాణిని బయటకు వెళ్లి మాట్లాడుకుందాం రమ్మని నిషిక చెప్పగా....లేదు ఇక్కడే మాట్లాడదామని ఆమె అంటుంది. నేను మళ్లీ మళ్లీ వస్తానని ఇక్కడి వాళ్లకు కూడా తెలియాలి కదా అంటుంది. దీనికి నిషిక నువ్వు ఇలాగే గొడవ చేస్తే...ఆస్తిలో మాకు చిల్లిగవ్వ కూడా రాదని...అప్పుడు నువ్వు ఇచ్చిన డబ్బులపై ఆశలు వదులుకోవాల్సిందేనని అని చెప్పి ఆమెను ఇంటి బయటకు తీసుకెళ్తుంది.
నిషిక భయం, యువరాజు కంగారు చూస్తుంటే...ఖచ్చితంగా ఇది పాత లెక్కల సెటిల్‌మెంట్‌లా లేదని అనిపిస్తోందని జగధాత్రి కేదార్‌తో అంటుంది. తాను కూడా అలాగే అనిపిస్తోందని అంటాడు. పేపర్‌లో యాడ్ ఇవ్వడానికి లేటవుతుందని చెప్పి కేదార్, జగధాత్రి అక్కడి నుంచి వెళ్లిపోతారు.
రంగా వెనక ఉండి ఇదంతా చేసింది నువ్వునా అని నిషిక ఇంద్రాణిపై మండిపడుతుంది. అవును నేనే అంటుంది ఇంద్రాణి...నేను నిన్ను ఎలా కలవాలా అని ఆలోచిస్తుంటే...నీ అంతటికి నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చావని అంటుంది. ఒకప్పుడు నిన్ను నమ్మితే నువ్వు నన్ను మోసం చేశావని ...ఇప్పుడు అలా కాదని నిషిక అంటే...ఇప్పుడు నువ్వు బెదిరించే పొజిషన్‌లో లేవని...పాతిక లక్షలకు వడ్డీపై వడ్డీ పెరుగుతుందని ఇంద్రాణి బెదిరిస్తుంది. పాతిక లక్షలకు వారానికి పదిలక్షలు కలిపి 35లక్షలు ఇవ్వకుంటే ఈ విషయం కౌషికికి చెబుతానని బెదిరించి అక్కడి నుంచి ఇంద్రాణి వెళ్లిపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన యువరాజును చూసి ఇంద్రాణి ఎంత పనిచేసిందో చూశావా అంటుంది. అప్పటికే కోపంతో రగిలిపోతున్న యువరాజు...నిషిక చెంప చెల్లుమనిపిస్తాడు. ఆరోజు ఎంత చెప్పినా వినకుండా వెళ్లి అప్పు చేసి నగలు కొన్నావు...ఇప్పుడు ఈవిషయం ఎంత వరకు వచ్చిందో చూశావు కదా అంటాడు. అప్పు సంగతి ఇంట్లో తెలిస్తే మనం రోడ్డుమీదకు రావాల్సి ఉంటుందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
పేపర్‌లో యాడ్ ఇచ్చి జగధాత్రి,కేదార్ ఇంటికి వస్తుంటారు.మాఅమ్మ ఫొటో చూసి నా తోబుట్టువులు ఎవరైనా ఉంటే నా దగ్గరకు వస్తారని అంటాడు. వాళ్లు బైక్ వెనక్కి తీస్తుండగా ఓ పెద్దాయనకు తగిలి ఆయన చేతిలోని సంచి కిందపడిపోతుంది. దాన్ని తీసి ఇస్తూ అందులో ఉన్న పురుగుల మందు డబ్బాను జగధాత్రి చూస్తుంది. అతను కంగారుగా ఆ సంచి తీసుకుని వెళ్లిపోతాడు. ఆయన కంగారు, సంచిలో పురుగుల మందు చూసి జగధాత్రికి అనుమానం వస్తుంది. ఇంట్లో తోట కోసం కొని ఉంటాడులే అని కేధార్ చెబితే...ఆ కంగారు చూస్తుంటే అలా అనిపించడం లేదని జగధాత్రి అంటుంది. ఖచ్చితంగా అతను ఏదో తప్పు చేస్తున్నాడని అంటుంది.
పురుగులమందుతో ఇంటికి చేరిన ఆ పెద్దాయని అన్నంలో పురుగుల మందు కలిపి భార్యాబిడ్డలకు తినిపిస్తుండగా....కేధార్, జగధాత్రి ఆ ఇంట్లోకి వస్తారు. ఏం జరిగిందని వారిని అడుగుతారు. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుని ఏం చేద్దామనుకుంటున్నారని నిలదీస్తుంది. పరువు పోగొట్టుకుని బతకడం కన్నా చావే నయమని ఈ పనిచేస్తున్నాం అంటాడు. స్థాయికి మించి కుమార్తెను చదివించడానికి పర్సనల్ లోన్ తీసుకున్నానని...ఆ వడ్డీ కట్టలేకపోవడంతో లోన్ ఇచ్చిన ఏజెంట్ ఫోన్‌చేసి అసహ్యంగా మాట్లాడాడని...అందుకే ఈ పనిచేస్తున్నాం అంటాడు.ఈ సారి వాళ్లు ఫోన్ చేయకుండా నేరుగా ఇంటికే వచ్చారని...అందరి ముందు పరువు తీశారని చెబుతాడు. తన బిడ్డమీద చెయ్యి కూడా వేశారని...డబ్బులు ఇవ్వుకుంటే కూతుర్ని కాలేజీ నుంచి లాక్కెళ్తామని బెదిరించారంటాడు. మీ బాధను అర్థం చేసుకోగలమని...కానీ అన్నింటికీ చావే ముఖ్యం కాదని జగధాత్రి సముదాయిస్తుంది. పోలీసులకు ఈ విషయం ఎందుకు చెప్పలేదని అడుగుతుంది. వాళ్లు లోన్ డబ్బులు తిరిగికట్టమంటారని చెబుతాడు. దీంతో మనమే ఏదోఒకటి చేద్దామని జగధాత్రి కేధార్‌తో అంటుంది.
లోక్ రికవరీ ఏజెంట్‌కు ఫోన్ చేసి వడ్డీ డబ్బులుతీసుకెళ్లమని చెబుతుంది జగధాత్రి....మిగిలిన విషయం మేం చూసుకుంటామని అభయమిస్తుంది. దీంతో ఆ పెద్దాయన లోక్ రికవరీ ఏజెంట్‌కు ఫోన్ చేస్తాడు. వాళ్లు వస్తారు....మళ్లీ యథావిధిగా డబ్బులు ఇవ్వమని బెదిరిస్తారు. అప్పుడే అక్కడికి వచ్చిన జగధాత్రి...వీధిలోవేడుకలా చూస్తున్న అందరిని ఉద్దేశించి గట్టిగా నిలదీస్తుంది. మీలాంటి ఓ ఇంటి పెద్దకు కష్టం వస్తే కనీసం మీరు ముందుకు వచ్చి సాయం చేయలేదని...అతని కుమార్తె గురించి నీచంగా మాట్లాడుతుంటే కనీసం అడ్డుకోలేదని మండిపడుతుంది. మీలో ఒక్కరు కూడా అండగా ఉండలేకపోయారా అంటుంది. ఇంతలో లోన్ రికవరీ ఏజెంట్ ఎక్స్‌ట్రాలు మాట్లాడుతున్నావేంటి అని దగ్గరకు రాగా...జగధాత్రి వాడి చెంప పగులగొడుతుంది. తీసుకున్న అప్పుకు వడ్డీ కట్టమంటే ఇలా రౌడీలతో కొట్టిస్తావా అంటూ రికవరీ ఏజెంట్ మండిపడగా....కేధార్ వాడి పొట్టలో గట్టిగా ఒక పంచ్ ఇస్తాడు. అంతే వాడు అబ్బ అంటూ కిందకు పడిపోతాడు. మీరు బ్యాంకు సిబ్బందా అని నిలదీయగా....లేదండీ రికవరీ ఏజెన్సీకు చెందిన వాళ్లమని చెబుతాడు. అలాంటప్పుడు డబ్బులు వసూలు చేసే పద్దతి ఇది కాదని కేధార్ వాడికి హితవు పలుకుతాడు. డబ్బులు రికవరీ చేయాలంటే అప్పు తీసుకున్న వాడిని ఇబ్బంది పెట్టకూడదని మీవాళ్లు చెప్పలేదా అంటూ జగధాత్రి మండిపడుతుంది. అయినా వినకుండా రికవరీ ఏజెంట్లు మళ్లీ ముందుకు రాగా...ఈసారి జగధాత్రి,కేధార్ ఇద్దరూ కలిసి వాయించి పడేయడంతో ఇవాల్టి ఏపిసోడ్ ముగిసిపోతుంది.



















