Jacqueline Fernandez Instagram: సుఖేష్ తో జాక్వెలిన్ పర్సనల్ ఫొటో లీక్.. హర్ట్ అయిన నటి..
తాజాగా జాక్వెలిన్-సుఖేష్ లకు సంబంధించిన మరో ఫొటో బయటకొచ్చింది.
మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదర్కొంటూ జైలులో ఉన్న నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్ తో జాక్వెలిన్ సన్నిహితంగా మెలిగేది. వీరిద్దరికి సంబంధించిన ముద్దు సెల్ఫీలు కూడా బయటకొచ్చాయి. కానీ జాక్వెలిన్ మాత్రం అతడితో డేటింగ్ చేయలేదని చెబుతోంది. జాక్వెలిన్ కి సుఖేష్ పది కోట్ల విలువైన బహుమతులు ఇచ్చాడనే విషయం ఈడీ వెల్లడించింది. ఈ కేసులో జాక్వెలిన్ కూడా విచారణ ఎదుర్కొంటుంది. ఈ మధ్యనే దేశం విడిచి వెళ్లాలనుకున్న ఆమెని అధికారులు అడ్డుకున్నారు.
ఇదిలా ఉండగా.. తాజాగా జాక్వెలిన్-సుఖేష్ లకు సంబంధించిన మరో ఫొటో బయటకొచ్చింది. ఇందులో సుఖేష్.. జాక్వెలిన్ ను ముద్దాడుతూ కనిపించాడు. ఇద్దరూ కలిసి ఒకే రూమ్ లో ఉన్న ఇంటిమేట్ ఫొటో ఇది. ఈ ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ విషయంలో చాలా మంది జాక్వెలిన్ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. హాలీవుడ్ లో ఛాన్స్ ఇస్తానని చెప్పడంతో సుఖేష్ తో ఆమె క్లోజ్ ఉండి ఇప్పుడు ప్లేట్ తిప్పేసిందని ట్రోల్ చేస్తున్నారు.
View this post on Instagram
ఈ ఫొటో లీక్ అవ్వడంతో జాక్వెలిన్ బాగా హర్ట్ అయినట్లు ఉంది. వెంటనే తన ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది. 'ఈ దేశం, ఇందులో ఉన్న ప్రజలు నాకు ఎంతో ప్రేమను, గౌరవాన్ని ఇచ్చారు. మీడియాలో కూడా నాకు స్నేహితులు ఉన్నారు.. వారి నుంచి చాలా నేర్చుకున్నాను. ప్రస్తుతం నేను చాలా కష్టాల్లో ఉన్నాను.. ఇలాంటి సమయంలో నా స్నేహితులు, అభిమానులు సపోర్టివ్ గా ఉంటారని ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా నా మీడియా స్నేహితులను ఓ రిక్వెస్ట్ చేస్తున్నా.. దయచేసి నా ప్రైవసీ, పెర్సనల్ స్పేస్ కి భంగం కలిగించే ఎలాంటి ఫొటోలను సర్క్యూలేట్ చేయొద్దు. మీరు ప్రేమించేవారి విషయంలో ఇలా చేయరు.. నా విషయంలో కూడా ఆలా చేయరనే అనుకుంటున్నాను. న్యాయం గెలుస్తుందని ఆశిస్తున్నాను' అంటూ రాసుకొచ్చింది.
View this post on Instagram
Also Read: 2022.. చప్పగా స్టార్ట్ అయిందే..