The Pet Detective OTT: తెలుగులోనూ అనుపమ మలయాళ సినిమా... ఈ వారమే స్ట్రీమింగ్ - ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
The Pet Detective OTT Streaming Telugu: అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ సినిమా 'ది పెట్ డిటెక్టివ్'. ఈ వారం ఓటీటీలోకి వస్తోంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.

అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) మలయాళీ. అయితే ఆమెను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడో ఓన్ చేసుకున్నారు. ఆమె మలయాళం కంటే తెలుగు మూవీస్ ఎక్కువ చేస్తున్నారు. ఈ ఏడాది 'పరదా', 'కిష్కింధపురి' చేశారు. తమిళ్ నుంచి తెలుగులో డబ్బింగ్ అయిన 'డ్రాగన్', 'బైసన్'లోనూ అనుపమ హీరోయిన్. ఈ ఏడాది ఆమె నటించిన మలయాళ సినిమాల్లో 'ది పెట్ డిటెక్టివ్' ఒకటి. ఆ సినిమా ఈ వారం ఓటీటీలోకి వస్తోంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.
'జీ 5' ఓటీటీలోకి 'ది పెట్ డిటెక్టివ్'...
ఎప్పట్నించి స్ట్రీమింగ్ అవుతుందంటే?
The Pet Detective OTT Release Date: ఇండియాలోని వన్నాఫ్ ది బిగ్గెస్ట్ ఓటీటీ వేదికల్లో 'జీ 5' ఒకటి. 'ది పెట్ డిటెక్టివ్' స్ట్రీమింగ్ హక్కులను ఆ సంస్థ సొంతం చేసుకుంది. ఈ శుక్రవారం... అంటే ఈ నెల (నవంబర్) 28వ తేదీ నుంచి ఆ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది.
మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో 'ది పెట్ డిటెక్టివ్' ప్రీమియర్ (డిజిటల్ స్ట్రీమింగ్) చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
Also Read: 250 కోట్ల డ్రగ్స్ కేసు... పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోదరుడు
View this post on Instagram
'ది పెట్ డిటెక్టివ్' కథ ఏమిటంటే?
'ది పెట్ డిటెక్టివ్' సినిమాను దర్శకుడు ప్రణీష్ విజయన్ తెరకెక్కించారు. ష్రాఫ్ యు దీన్ ప్రధాన పాత్రలో నటించటంతో పాటు ప్రొడ్యూస్ చేశారు. నిర్మాతగా ఆయన తొలి చిత్రమిది. ఇందులో 'జైలర్' ఫేమ్ వినాయకన్, వినయ్ ఫార్ట్, అనుపమ పరమేశ్వరన్, శ్యామ్ మోహన్, జ్యోమన్ జ్యోతిర్ ప్రధాన పాత్రలు పోషించారు.
Also Read: 'ఆంధ్ర కింగ్ తాలూకా' సెన్సార్ రివ్యూ: రామ్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్... సినిమాలో హైలైట్స్ ఏమిటంటే?
'ది పెట్ డిటెక్టివ్' కథ విషయానికి వస్తే... జోస్ అలులా (ష్రాఫ్ యు దీన్) ఓ డిటెక్టివ్. అతను తన ట్యాలెంట్ గురించి చెప్పుకోవడానికి పెద్ద కేసులు ఉండవు. అయితే తనను తాను నిరూపించుకోవడానికి ఎదురు చూస్తున్న తరుణంలో పెట్ డాగ్ మిస్సింగ్ కేసును సాల్వ్ చేయటానికి అంగీకరిస్తాడు. ఆ ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ - కిడ్నాపర్స్ నుంచి మిస్సింగ్ చిన్నారి, మెక్సికన్ మాఫియా డాన్, అరుదైన చేప, మిస్సింగ్ మహిళను వెతికే పోలీస్ కథలోకి ఎంట్రీ ఇస్తారు. ఆ తర్వాత ఏమైంది? అనేది 'జీ 5'లో సినిమా చూసి తెలుసుకోవాలి.
కుటుంబ ప్రేక్షకులతో పాటు వినోదాత్మక సినిమాలు కోరుకునే ప్రజలను 'ది పెట్ డిటెక్టివ్' ఆకట్టుకుంటుందని, ముఖ్యంగా ప్రియదర్శన్ స్టైల్ ఆఫ్ సినిమాలను గుర్తు చేసే హై వోల్టేజ్ క్లైమాక్స్ అసలు మిస్ అవ్వొద్దని 'జీ 5' పేర్కొంది. నవంబర్ 28వ తేదీ నుంచి 'ది పెట్ డిటెక్టివ్' జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.





















