News
News
X

Samantha: సమంతకు హెల్త్ ఇష్యూస్ - క్లారిటీ ఇచ్చిన మేనేజర్!

సమంతకు స్కిన్ కి సంబంధించి ఓ ఇష్యూ ఉంది. అప్పట్లో దానికోసం ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని మీడియా వర్గాల్లో వార్తలొచ్చాయి.

FOLLOW US: 

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది సమంత. వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీ హీరోయిన్ గా మారింది. ఓ పక్క తెలుగులో సినిమాలు చేస్తూనే మరోపక్క ఇతర భాషల్లో ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతోంది. అలానే వెబ్ సిరీస్ లపై కూడా దృష్టి పెట్టింది. ఇప్పటికే 'శాకుంతలం' సినిమాను పూర్తి చేసింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా కాలమవుతుంది. ప్రస్తుతం తెలుగులో 'ఖుషి', 'యశోద'.. హిందీలో ఓ వెబ్ సిరీస్ చేస్తోంది సమంత.

ఇదిలా ఉండగా.. సమంతకు స్కిన్ కి సంబంధించి ఓ ఇష్యూ ఉంది. అప్పట్లో దానికోసం ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని మీడియా వర్గాల్లో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు మరోసారి ఆమె అదే సమస్యతో బాధ పడుతుందని.. నిపుణుల సహాయంతో ట్రీట్మెంట్ తీసుకుంటుందని కొన్ని పర్టిక్యులర్ వెబ్ ఛానెల్స్ ప్రచురించాయి. దీంతో ఆమె మేనేజర్ స్పందించారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన సమంత అనారోగ్యంతో ఉందనే మాటల్లో నిజం లేదని.. ఆమె చాలా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. 

కావాలనే కొన్ని మీడియా సంస్థలు ఆమెపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. వారిపై లీగల్ యాక్షన్ తీసుకునే ఆలోచనలో సమంత ఉన్నట్లు తెలిపారు. ఈ నెలలోనే సమంత కొన్ని సినిమా షూటింగ్స్ లో పాల్గొనబోతున్నట్లు తెలిపారు. 

సెప్టెంబర్ 9న 'యశోద' టీజర్:

'యశోద' సినిమా షూట్ ని కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా సంబంధించిన టీజర్ సెప్టెంబర్ 9న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 'యశోద'  సినిమా పూర్తిగా సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతుంది. సమంత ఇంతకు ముందు చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఈ సినిమా పూర్తిగా భిన్నంగా ఉంటుందని టాక్

రెమ్యునరేషన్ పెంచేసిన సామ్:

ఇదిలా ఉండగా.. ఇప్పుడు సమంత తన రెమ్యునరేషన్ పెంచేసిందట. 'పుష్ప' సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి అమ్మడు రూ.2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంది. అలానే 'యశోద', 'శాకుంతలం' సినిమాలకు రూ.2.5 కోట్ల చొప్పున రెమ్యునరేషన్ తీసుకుంది. అయితే ఇప్పుడు ఏకంగా రూ.3.5 కోట్లు డిమాండ్ చేస్తుందట ఈ బ్యూటీ. అంతకంటే తక్కువ ఆఫర్ చేస్తోన్న ప్రాజెక్ట్స్ ఒప్పుకోవడం లేదట. 

'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 2 తరువాత సమంత క్రేజ్ పెరిగింది. ఓటీటీ, శాటిలైట్ ఛానెల్స్ లో తన సినిమాలకు మంచి బిజినెస్ జరుగుతోంది. అందుకే సమంత రెమ్యునరేషన్ విషయంలో అసలు వెనక్కి తగ్గడం లేదు. సౌత్ లో ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ అంటే నయనతార అనే చెప్పాలి. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి సమంత కూడా చేరబోతోంది. 

Published at : 05 Sep 2022 08:27 PM (IST) Tags: samantha Samantha manager Samantha health issues

సంబంధిత కథనాలు

Bhagya Raj: నడిగర్‌ సంఘం షాకింగ్ నిర్ణయం,  సీనియర్ దర్శకుడు భాగ్యరాజ్‌‌పై వేటు!

Bhagya Raj: నడిగర్‌ సంఘం షాకింగ్ నిర్ణయం, సీనియర్ దర్శకుడు భాగ్యరాజ్‌‌పై వేటు!

Shrihan: హీరోగా మారిన బిగ్ బాస్ కంటెస్టెంట్ - ‘ఆవారా జిందగీ’ పేరుతో ప్రేక్షకుల ముందుకు!

Shrihan: హీరోగా మారిన బిగ్ బాస్ కంటెస్టెంట్ - ‘ఆవారా జిందగీ’ పేరుతో ప్రేక్షకుల ముందుకు!

Navya Swami - Ravi Krishna: మొత్తానికి ఒప్పేసుకుంది - రవికి ఆ మాట చెప్పేసి షాకిచ్చిన నవ్యస్వామి

Navya Swami - Ravi Krishna: మొత్తానికి ఒప్పేసుకుంది - రవికి ఆ మాట చెప్పేసి షాకిచ్చిన నవ్యస్వామి

Bigg Boss 6 Telugu: ఏం ఫిట్టింగ్ పెట్టావు బిగ్‌బాస్, ఇలాంటి నామినేషన్ అని పాపం ఊహించి ఉండరు, నామినేషన్లో ఆ ఎనిమిది మంది

Bigg Boss 6 Telugu: ఏం ఫిట్టింగ్ పెట్టావు బిగ్‌బాస్, ఇలాంటి నామినేషన్ అని పాపం ఊహించి ఉండరు, నామినేషన్లో ఆ ఎనిమిది మంది

Hunt Movie Teaser : నన్ను ఎవరూ ఆపలేరు - సుధీర్ బాబు స్టైలిష్ యాక్షన్ అవతార్ 

Hunt Movie Teaser : నన్ను ఎవరూ ఆపలేరు - సుధీర్ బాబు స్టైలిష్ యాక్షన్ అవతార్ 

టాప్ స్టోరీస్

Kishan Reddy: కొత్త పార్టీ ఏర్పాటు అందుకే, ప్రధాని అయినట్లు పగటి కలలు - కిషన్ రెడ్డి ఎద్దేవా

Kishan Reddy: కొత్త పార్టీ ఏర్పాటు అందుకే, ప్రధాని అయినట్లు పగటి కలలు - కిషన్ రెడ్డి ఎద్దేవా

Chinta Mohan: శశిథరూర్ దళిత వ్యతిరేకి, మల్లిఖార్జున ఖర్గేనే విజయం సాధిస్తారు: కాంగ్రెస్ మాజీ ఎంపీ

Chinta Mohan: శశిథరూర్ దళిత వ్యతిరేకి, మల్లిఖార్జున ఖర్గేనే విజయం సాధిస్తారు: కాంగ్రెస్ మాజీ ఎంపీ

MLA Kotamreddy: ఆ సెంటిమెంట్ ని గౌరవిస్తా, అందుకే అలా చేశా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

MLA Kotamreddy: ఆ సెంటిమెంట్ ని గౌరవిస్తా, అందుకే అలా చేశా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

Mrunal Thakur: ఆ సమయంలో చనిపోవాలనుకున్న మృణాల్‌ - ‘సీతారామం’ సక్సెస్ వరకు ‘సీత’ పడిన కష్టాలెన్నో!

Mrunal Thakur: ఆ సమయంలో చనిపోవాలనుకున్న మృణాల్‌ - ‘సీతారామం’ సక్సెస్ వరకు ‘సీత’ పడిన కష్టాలెన్నో!